యూట్యూబర్ గంగవ్వ నెల సంపాదన ఎంతో తెలుసా...? పల్లెనుంచి స్టార్ గా ఎదిగిన గంగమ్మ
పల్లెలో సాధారణ పేద కుటుంబంనుంచి సోషల్ మీడియా స్టార్ గా మారింది గంగవ్వ. పూటగడవని పరిస్థితుల నుంచి.. చేతినిండా సంపాదన వరకూ.. ఆమె ప్రయాణం అందరికి తెలిసిందే..? ఇంతకీ గంగవ్వ సంపాదన ఎంత..?

యూట్యూబ్‌లో వైరల్‌గా మారిన గంగవ్వ గతేడాది `బిగ్‌బాస్4` సీజన్‌లో పాల్గొని హాట్ టాపిక్‌గా మారింది. కానీ అనారోగ్యంతో ఆమె మధ్యలోనే హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది. కానీ ఆమె కోసం ఏకంగా బిగ్‌బాస్ ఓ ఇంటిని నిర్మిస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియా చాలా విసృతం అయ్యింది. యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ లాంటి వాటి నుంచి ఎంతో మంది కళాకారులు స్టార్స్ గామారుతున్నారు ఫేమ్ తో పాటు చేతినిండా సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో గంగవ్వకూడా ఒకరు. మారుమూల పల్లె లో కూలి చేసుకునే వృద్థురాలు ఇప్పుడు సోషల్ మీడియా స్టార్. మరి ఆవిడి నెలకు ఎంత సంపాధిస్తుండోచ్చు.. ఆమె ఇన్ కంమ్ ఎంత...?
ఈమధ్య యూట్యూబ్ ఛానల్స్ తో పల్లెవాసులు ఎక్కువగా ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాల నుంచి వచ్చి స్టార్ గా మారింది గంగవ్వ. తన మార్క్ డైలాగ్స్ త అందరిని ఆకట్టుకున్న గంగవ్వ.. చాలా తక్కువ టైమ్ లోనే సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయింది.
పల్లెటూరు యాసలో గంగవ్వ చెప్పే డైలాగులు ప్రేక్షకుల కు తెగనచ్చాయి. దాంతో గంగవ్వ సినిమా ఆఫర్ లను అందుకున్నారు. అంతే కాకుండా తన మై విలేజ్ షో యూట్యాబ్ ఛానల్ ద్వారా టాలీవుడ్ టాప్ హీరోలను హీరోయిన్ లను గంగవ్వ ఇంటర్వ్యూలు చేశారు గంగవ్వ.
ఆమెకు సబ్ స్క్రైబర్స్ పెరగడంతో పాటు ఫుల్ పాపులారిటీ సాధించింది. దాంతో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ టీవీ షోలో గంగవ్వ కంటెస్టెంట్ గా వచ్చారు. గంగవ్వ తన కామెడీతో మంచితనంతో అభిమానులను సంపాదించుకున్నారు.దీంతో మరింత పాపులర్ అయ్యింది గంగవ్వ. ఈమె కోసం నాగార్జున స్వయంగా తన డబ్బుతో ఇల్లు కూడా కట్టించారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం గంగవ్వ మైవీలేజ్ షోలో నటిస్తూనే సినిమాల్లోనూ ఫుల్ బిజీగా మారిపోయారు. కాగా గంగవ్వ బాగా సంపాదిస్తున్నారట. తను ఒక్కరోజు కాల్ షీట్ కోసం 10వేల రూపాయల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.
యూట్యూబ్ ద్వారా వచ్చిన ఫేమ్ తో గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కావడం జరిగింది. ఆ వయసులో బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అంతే కాకుండా తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు లక్ష రూపాయలు సంపాదించుకుంటుందట. టాలెంట్ ఉంటే చాలు ఏ వయసులో అయినా ఎక్కడ ఉన్నా అవకాశాలను అందుకోవచ్చని గంగవ్వ నిరూపించుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.