ప్రభాస్ సెంటిమెంట్...బర్త్ డే రోజు ఎవరు చెప్పినా... ఆ పని మాత్రం చేయడట
ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలలో చాలా మందిస్టార్స్ కు చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మకంతో ఉంటారు. అలసలు ఈ నమ్మకాలు లేనివారు కూడా ఉన్నారు. అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు సబంధించినసెంటిమెంట్ ఒకటి వైరల్ అవుతోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ నుంచి..యూనివర్సల్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం ఇండియాలోనే కాకుండా.. జపాన్ లాంటి దేశాల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఆయన కనిపిస్తే చాలు అనుకేవారు చాలా మంది ఉన్నారు. అయితే జపాన్ నుంచి ప్రభాస్ ను చూడటానికి వచ్చేవారు కూడా ఉన్నారు.
ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఆయన చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ లో.. పాన్ ఇండియా సినిమాలే ప్రస్తుతం ప్రభాస్ నుంచి సలార్ సినిమాతో పాటు.. కల్కీ కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. అంతే కాదు.. మరో మూడు పాన్ ఇండియా సినిమాలు.. సిద్దం చేస్తున్నాడు ప్రభాస్.
ఇక తాజాగా ప్రభాస్ 44వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు.. ప్రభాస్ బర్త్ డేను పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. అటు జపాన్ లో కూడా ప్రభాస్ ఫోటోకు ఏకంగా పూజాలు చేసి ప్రసాదాలు కూడా పెట్టారు. ఇక హైదరాబాద్ లో ఆయన భారీ కటౌట్ ను కూడా చూశాం..
ఇక ఇప్పుడు ప్రభాస్ కు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ కు బర్త్ డే సెంటిమెంట్ ఎక్కువగా ఉందట.. ఆయన సెంటిమెంట్లు ఫాలో అయినట్టు కనిపించడు కాని...ఎక్కువగా ఫాలో అవుతాడ. మరీ భర్త్ డే రోజు ఎక్కువగా ఫాలో అవుతాడట.
ప్రభాస్ ఎంత మంచి ఫుడీనో అందరికి తెలుసు.. ఆయన నచ్చిన ఫుడ్ ను ఇష్టంగా లాగించేస్తాడు. అంతే కాదు.. తనతో పాటు.. తాను చేస్తున్న సినిమా షూటింగ్ లో యూనిట్ కు.. ప్రభాస్ ఉన్నాడంటే పండగే..ఆయన ఏం తింటాడో.. అందరికి అదే ఫుడ్ ను తన ఇంటి నుంచి తెప్పిస్తాడు.
Prabhas at San Diego comic con
ప్రభాస్ అన్ని రకాల నాన్ వేజ్ ఐటమ్స్ ను ఇష్టంగా లాగించేస్తుంటాడు. ఎవరైనా అతిదులు వస్తే.. ఇక వారికి నాన్ వెజ్ ఫెస్టివల్ అన్నట్టే. అయితే సాధారణ రోజుల్లో నాన్ వేజ్ లేనిదే ముద్ద ముట్టని ప్రభాస్.. తన పుట్టిన రోజున మాత్రం అస్సలు నాన్ వెజ్ ను ముట్టుకోడట. ఎప్పటి నుంచో ప్రభాస్ ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్టుతెలుస్తోంది. తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ న్యూస్ వైరల్ అవుతోంది.