- Home
- Entertainment
- రాంచరణ్ అట్టర్ ఫ్లాప్ మూవీ కథతో సినిమా చేసి స్టార్ అయిపోయిన కుర్ర హీరో, యువతలో తిరుగులేని క్రేజ్
రాంచరణ్ అట్టర్ ఫ్లాప్ మూవీ కథతో సినిమా చేసి స్టార్ అయిపోయిన కుర్ర హీరో, యువతలో తిరుగులేని క్రేజ్
ఒక సినిమా కథని పోలిన విధంగా మరో చిత్రం తెరకెక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి.దాహరణకు పటాస్, టెంపర్ చిత్రాల కథలు ఒకే విధంగా ఉంటాయి. ఆ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. రాంచరణ్ నటించిన ఒక అట్టర్ ఫ్లాప్ మూవీ కథతో మరో సినిమా వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Ram Charan
చిత్ర పరిశ్రమలో కథల కాపీ గురించి తరచుగా వింటూనే ఉంటాం. ఒక సినిమా కథని పోలిన విధంగా మరో చిత్రం తెరకెక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొందరు దర్శకులు ఆ చిత్రాలని ఇన్స్పైర్ అయి చేశాం అని ఓపెన్ గా చెబుతుంటారు. కొన్ని చిత్రాలు యాధృచ్చికంగా అలా జరుగుతాయి. ఉదాహరణకు పటాస్, టెంపర్ చిత్రాల కథలు ఒకే విధంగా ఉంటాయి. ఆ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. రాంచరణ్ నటించిన ఒక అట్టర్ ఫ్లాప్ మూవీ కథతో మరో సినిమా వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ఆరెంజ్ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని ఫ్లాప్ చిత్రాలకు కూడా సూపర్ క్రేజ్ ఉంటుంది. ఆ కోవకి చెందిన చిత్రమే ఆరెంజ్. ఈ చిత్రం ఆ మధ్యన రిలీజ్ అయినప్పుడు బ్లాక్ బస్టర్ అన్న తరహాలో వసూళ్లు రాబట్టింది. కానీ ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు దారుణమైన నష్టాలు మిగిల్చింది. ఈ చిత్రం నష్టాల వల్ల మెగా బ్రదర్ నాగబాబు సూసైడ్ చేసుకుందాం అనే స్థితికి కూడా వెళ్లారు.
Pradeep Ranganathan
మగధీర తర్వాత విడుదలైన ఆరెంజ్ చిత్రం ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఈ చిత్రం తెరకెక్కిస్తునప్పుడు తోట ప్రసాద్ రచయితగా పనిచేశారు. కథలో కొన్ని మార్పులు అవసరం అని తోట ప్రసాద్, రాంచరణ్ ఇద్దరూ భావించారట. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కి చెబితే ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ కథని భాస్కర్ గుడ్డిగా నమ్మేశారు. పర్సనల్ గా కనెక్ట్ అయిపోయారు. కాబట్టి మార్పులు చేయలేకపోయాం అని తోట ప్రసాద్ అన్నారు.
ఈ చిత్రంలో ఒక ఎపిసోడ్ ఉంది. అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా మొబైల్ ఫోన్ అనేది పర్సనల్. లవర్స్ అయినా, భార్య భర్తల మధ్య అయినా ఫోన్ అనేది పర్సనల్ మ్యాటర్ గానే ఉంటుంది. ఫోన్ అనేది తన పర్సనల్ మ్యాటర్ అని హీరో భావిస్తాడు. ఇదే పాయింట్ తో తమిళంలో కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే అనే సినిమా చేశారు. ప్రస్తుతం లవర్స్ మధ్య ఫోన్ చాలా ప్రాబ్లెమ్ అవుతోంది. కాబట్టి లవ్ టుడే చిత్రానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
Orange Movie
కానీ ఆరెంజ్ మూవీ టైంలో అప్పుడప్పుడే మొబైల్స్ వస్తున్నాయి. కాబట్టి అంతగా జనాలు కనెక్ట్ కాలేదు అని తోట ప్రసాద్ అన్నారు. లవ్ టుడే చిత్రంతో ప్రదీప్ రంగనాథన్ ఏకంగా స్టార్ హీరో అయిపోయాడు. ఇటీవల విడుదలైన అతడి డ్రాగన్ చిత్రం కూడా హిట్ అయింది. ప్రదీప్ కి యువతలో తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ప్రదీప్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.