Deepika Pilli: బెడ్ పై బోర్లా పడుకుని దీపికా పిల్లి టీజింగ్ పోజులు... కుర్ర భామ అసలు తగ్గడం లేదు!
యంగ్ బ్యూటీ దీపికా పిల్లికి యూత్ లో యమ క్రేజ్ ఉంది. ఒకపాప్తి ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ యాంకర్ గా మారిన విషయం తెలిసిందే. అమ్మడు బెడ్ పై పడుకుని కుర్రాళ్లను కవ్వించింది.
Deepika Pilli
దీపికా పిల్లి అందాల ఆరబోతలో అసలు తగ్గడం లేదు. కుర్రాళ్లను కవ్వించడమే పనిగా పెట్టుకుందేమో కానీ... ఇంస్టాగ్రామ్ వేదికగా గిలిగింతలు పెడుతుంది. తాజాగా బెడ్ పై బోర్లా పడుకుని మతిపోగొట్టేసింది. దీపికా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Deepika Pilli
దీపికా పిల్లి కెరీర్ పరిశీలిస్తే... యాంకర్ గా, నటిగా ఆమె అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఆ మధ్య ఆహాలో స్ట్రీమ్ అవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ షో చేశారు. సుడిగాలి సుధీర్ తో పాటు సదరు కామెడీ షోకి దీపిక యాంకర్ గా వ్యవహరించారు. కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫస్ట్ సీజన్ ముగిసినట్లు ఉంది.
Deepika Pilli
గత ఏడాది ఆమె నటించిన వాంటెడ్ పండుగాడ్ మూవీ విడుదలైంది. సునీల్, అనసూయ(తో పాటు పలువురు బుల్లితెర ఆర్టిస్స్ నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో దీపికాకు మరో ఆఫర్ రాలేదు. ఆమె గ్లామర్ ని దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు.
దీపికా డాన్స్ రియాలిటీ షో ఢీ తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఢీ సీజన్ 13లో యాంకర్ రష్మీతో పాటు దీపికా యాంకరింగ్ చేశారు. రష్మీ, దీపికా సీజన్ 13 టీఆర్పీ పరుగులు పెట్టించారు. ఆ షోకి దీపికా గ్లామర్ ప్లస్ అయ్యిందని చెప్పాలి. ఆమెకు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
Deepika Pilli
అనూహ్యంగా ఢీ సీజన్ 14 నుండి దీపికను తప్పించారు. రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ లను సైతం తీసేయడం జరిగింది. వారి కాంబినేషన్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నప్పటికీ పెను మార్పులు చేశారు. ఢీ నుండి తప్పుకున్నాక దీపికా బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఇది ఒకింత అభిమానులను నిరాశపరుస్తుంది. ఆమె గ్లామర్ ని బాగా మిస్ అవుతున్నారు.
Deepika Pilli
అయితే సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది. దీపికా హాట్ వీడియోలు, ఫోటోలు ఫాలోవర్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి.
దీపికా అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. టిక్ టాక్ స్టార్ గా ఫేమస్ అయిన దీపికా బుల్లితెర యాంకర్ స్థాయికి వెళ్ళింది.నటిగా సినిమాలు చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ చూసి మల్లెమాల వాళ్ళు యాంకర్ గా అవకాశం ఇచ్చారు. దీపికా ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్నారు. యంగ్ ఏజ్ లో ఉన్న దీపికా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం. సరైన మూవీ పడితే తన టాలెంట్ చూపించడానికి అమ్మడు సిద్ధంగా ఉంది.