- Home
- Entertainment
- పరువాల విందులో ఆరితేరుతున్న యంగ్ బ్యూటీ అనన్య పాండే.. ఓరచూపుతో ఊరించేలా ‘లైగర్’ భామా ఫోజులు..
పరువాల విందులో ఆరితేరుతున్న యంగ్ బ్యూటీ అనన్య పాండే.. ఓరచూపుతో ఊరించేలా ‘లైగర్’ భామా ఫోజులు..
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) గ్లామర్ షోలో ఆరితేరుతోంది. ట్రెండీ వేర్ లో కొత్త అందాలను పరిచయం చేస్తూ.. మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

వరుస చిత్రాల్లో నటిస్తూ అనన్య పాండే బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది. సినీ తారాలతో మంచి రాపో మెయిన్ టేయిన్ చేస్తూ కేరీర్ లో దూసుకుపోతోంది. ఇందుకు పలు పార్టీలు, ఫంక్షన్లకు కూడా హాజరవుతూ ఆకట్టుకుంటోంది.
నిన్న ముంబైలో బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బర్త్ డే పార్టీని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ తారలు, స్టార్స్, డైరెక్టర్స్, హీరోయిన్లు హాజరై కరణ్ జోహార్ కు 50వ పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపారు. పార్టీలో పాల్గొని సక్సెస్ చేశారు.
ఈ సందర్భంగా యంగ్ బ్యూటీ అనన్య పాండే కూడా ఈ బర్త్ డే పార్టీకి హాజరైంది. ప్రముఖ సినీ స్టార్స్, సీనియర్లు హీరోయిన్లు వస్తున్న ఈ బర్త్ డే బాష్ లో తన మార్క్ చూపించేందుకు అనన్య ట్రెండీ గౌన్ ధరించి అందరి మతిపోగొట్టింది. ఆ పిక్స్ ను తాజాగా తన అభిమానులతో పంచుకుంది.
ఈ పిక్స్ లో అనన్య షీర్ గౌన్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రెండీ గౌన్ లో కొత్త అందాలను పరిచయం చేస్తూ.. తన క్రేజ్ పెంచుకుంటోంది. ఆ ఫొటోలను చూసిన కొందరు.. గత కొద్ది రోజులు తన ఫ్యాషన్ సెన్స్ తో అనన్య అందాల విందులో ఆరి తేరిందంటున్నారు. లేటెస్ట్ ఫొటోషూట్ లో అన్యన్య ఇచ్చిన స్టిల్స్, చూసే చూపులు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి.
ప్రస్తుతం ఈ గ్లామర్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే అనన్య పిక్స్ తో పాటు.. ఫొటోషూట్ కు స్పందించిన ఓ వీడియోను కూడా పంచుకుంది. ఆ వీడియోపై నటి షానాయ కపూర్ స్పందించింది. ‘కెండల్ జెన్నర్’ అంటూ కామెంట్ చేసింది. మరోవైపు నెటిజన్లు, అభిమానులు కూడా ఈ బ్యూటీ పిక్స్ ను లైక్ చేస్తున్నారు.
త్వరలో ఈ బ్యూటీ దుబాయ్ లో నిర్వహించనున్న IIFA 2022 అవార్డ్స్ ఈవెంట్ కు కూడా వెళ్లనుంది. ఆ వేదికనై తను ప్రదర్శన కూడా చేయనుంది. ఇప్పటికే అనన్య రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ చిత్రంలో నటించింది. ఆగస్టు 26న రిలీజ్ కానున్న ఈ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ‘ఖో గయే హమ్ కహాన్’ చిత్రంలో నటిస్తోంది.