విజయ్ దేవరకొండకి ద్రోహం చేస్తున్నావ్.. రష్మిక మందన్నా లిప్‌కిస్‌పై ట్రోలర్స్ రచ్చ షురూ..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరు చాలా సందర్బాల్లో ఓకే చోట కనిపించి రూమర్లకి బలాన్నిచ్చారు. కానీ రష్మిక చేసిన పని ఇప్పుడు ట్రోల్స్ కి కారణమవుతుంది.
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. కలిసి `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఇద్దరు లవ్ లో ఉన్నారట. `డియర్ కామ్రేడ్` నుంచి ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని, దీంతో రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరు రిలేషన్ షిప్‌లో ఉన్నారనేది ఓపెన్‌గా జరిగే చర్చ.
దీనిపై ఇద్దరూ సైలెంట్‌గానే ఉంటున్నారు. ప్రారంభంలో ఇందులో నిజం లేదని చెప్పారు. తాము బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు. కానీ ఆ తర్వాత పలు మార్లు కలిసి కనిపించడం, వెకేషన్‌లోనూ దొరికిపోవడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ సహా అంతా వారు నిజంగానే లవ్ లో ఉన్నారని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రష్మిక మందన్నా చేసిన పని ఇప్పుడు నెట్టింట రచ్చ అవుతుంది. ట్రోల్స్ కి కారణమవుతుంది.
అందుకు కారణం `యానిమల్` మూవీ లేటెస్ట్ పోస్టర్. ఈ చిత్రం నుంచి సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఫ్లైట్‌లో రణబీర్ కపూర్, రష్మిక లిప్‌కిస్ పెట్టుకున్నారు. ఘాటు ముద్దుతో రచ్చ చేశారు. దీంతో ఇది వైరల్ అవుతుంది. ఈ పోస్టర్‌ని రష్మిక తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అభిమానులతో పంచుకుంది. దీనిపై ట్రోలర్స్ రచ్చ చేస్తున్నారు. హాట్ కామెంట్లతో నేషనల్ క్రిష్‌ని ఆడుకుంటున్నారు.
రణ్‌బీర్‌కి లిప్ లాక్ పెట్టడం విజయ్ దేవరకొండకి ద్రోహం చేసినట్టే అంటున్నారు. రష్మిక విజయ్‌కి ద్రోహం చేయడం సరికాదంటున్నారు. విజయ్ లాగా ఉండండి అని, ఆయనలా వాటికి దూరంగా ఉండండి అని కామెంట్లు పెడుతున్నారు. రష్మిక ఇది మీకు సరికాదు, వెంటనే పోస్ట్ డిలీట్ చేయాలని విజయ్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నెట్టింట ఈ పోస్టర్ రచ్చ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. మొత్తంగా ట్రోలర్స్ కి బలవుతుంది రష్మిక మందన్నా.
ఇక `అర్జున్‌రెడ్డి` ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌కి జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. ఈ మూవీ డిసెంబర్ 1న విడుదల కాబోతుంది. ఇక రష్మిక మందన్నా `పుష్ప2` చిత్రం చేస్తుంది. దీంతోపాటు విజయ్‌తో మరోసారి జోడీ కట్టబోతుందట. గౌతమ్ తిన్ననూరి చిత్రంలో నేషనల్ క్రష్ పేరు వినిపిస్తుంది. దీంతోపాటు `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది రష్మిక.