Ennenno Janmala Bandham: ఎత్తుకి పై ఎత్తు వేసిన వేద.. కటకటాల పాలైన అభి!
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకొని ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ఆపదలో ఉన్న చెల్లిని తన తెలివితేటలతో రక్షించుకున్న ఒక అక్క కథ ఈ సీరియల్ ఇక ఈరోజు మే 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రాజ్ దంపతులకి కూర్చోబెట్టి కావ్య కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెడుతుంది వేద. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటుంది కావ్య. మీ పెళ్లి మేము కళ్ళారా చూడలేకపోయాము అందుకే సరదాగా తీర్చుకుంటున్నాము మా ఎదురుగా మళ్లీ పెళ్లి చేసుకోవాలి అంటూ దండలు ఇచ్చి మార్చుకోమంటుంది వేద. కావ్య దంపతులు దండలు మార్చుకుంటారు.
యష్ దంపతులు కావ్య దంపతులకు బట్టలు పెడతారు. చిన్న గిఫ్ట్ అని చెప్పి చాలా పెద్ద మెమొరీ ఇచ్చారు అని ఆనందపడుతుంది కావ్య. ఆ తర్వాత కావ్య దంపతులు అక్కడ నుంచి బయలుదేరుతారు. మరోవైపు రెండు జంటలు పీటల మీద కూర్చుంటాయి. కాసేపు కూడా వసంత్ నీ పక్కన కూర్చుంటే భరించలేకపోతున్నాను అంటాడు అభి. చిత్ర భయంగా అభిని చూస్తుంది.
అభి ఏదో చేస్తున్నట్లుగా కన్ఫర్మ్ అవుతారు వేద దంపతులు. బ్రహ్మ ముహూర్తం కి సమయం దగ్గర పడుతుంది మీరు వెళ్లి బట్టలు మార్చుకోండి అంటారు పంతులుగారు.తన గదిలోకి వెళ్లి బాధతో కూర్చున్న చిత్ర దగ్గరికి వస్తుంది వేద. చెల్లెల్ని మాటల్లో పెట్టి అభి గురించి తెలుసుకుందామని ప్రయత్నిస్తుంది. కానీ భయంతో ఉన్న చిత్ర నిజం చెప్పలేక పోతుంది అబద్ధం చెప్పి మాట దాటవేస్తుంది.
మాటల్లో పడి చిత్ర నిద్రపోతుంది. వేద అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వేద వెళ్లిన తర్వాత లేచిన చిత్ర తల్లిదండ్రుల ఫోటో చూసి క్షమాపణ చెప్తుంది. మీరు నాకు ఎంతో చేశారు కానీ నేను మీకు కన్నీరు మిగిల్చి వెళ్ళిపోతున్నాను అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఏదో నిర్ణయానికి వచ్చినట్లుగా ఫోన్ పక్కన పెట్టి చుట్టూ నెలుకుతుంది. ఇదేనా అంటూ పాయిజన్ బాటిల్ తో వస్తుంది వేద. ఒక్కసారిగా షాక్ అవుతుంది చిత్ర.
ఏడుస్తూ అక్కని హత్తుకుంటుంది. ఇప్పటికైనా నిజం చెప్పు ఏం జరిగిందో అంటుంది వేద. ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది చిత్ర. అదే సమయంలో కిందన టైం అయింది పెళ్ళికొడుకు వాళ్ళని రమ్మనండి అంటారు పూజారి. ఇటు వసంత్ అటు మాళవిక ఇద్దరు వస్తారు మిగతా ఇద్దరూ ఏరి అని అడుగుతారు పూజారి. అవును అభి ఇందాకటి నుంచి కనిపించడం లేదు నువ్వు చూసావా అని వేదని అడుగుతుంది మాళవిక.
అభి ఎక్కడికి వెళ్ళాడో నాకేం తెలుస్తుంది.. నా చెల్లెలు కూడా కనిపించడం లేదు అంటుంది వేద. అయినా అభి ఏమైనా చిన్నపిల్లడా అంటూ కసురుకుంటుంది మాలిని. మీ అందరిని చూస్తే నాకు ఏదో అనుమానంగా ఉంది ముహూర్తం దగ్గర పడుతున్నా మీ ఎవరిలో టెన్షన్ లేదు అందరూ మౌనంగా ఉన్నారు నాకు నీ మీద అనుమానంగా ఉంది అంటుంది మాళవిక.
నువ్వు అనుకున్నంత అమాయకుడు ఏమీ కాదు అభి అంటుంది పేద. ఆమె మాటలు నమ్మదు మాళవిక. ఆధారాలతో సహా నిరూపిస్తాను వెయిట్ అండ్ వాచ్ అంటుంది వేద. మరోవైపు అభి గదికి వచ్చిన చిత్ర తన ఫోన్ వీడియో ఆన్ చేసి అభి కి కనిపించకుండా పెడుతుంది. ఇంతలో అభి వచ్చి ఈ రూమ్ లోకి వచ్చినందుకు నా లైఫ్ లోకి వస్తున్నందుకు వెల్కమ్ అంటాడు. రావేమో అన్న అనుమానం గోరంత ఉండేది కానీ వస్తావన్న నమ్మకం కొండంత ఉంది. ఇలాంటి రిచ్ లైఫ్ని సెలెక్ట్ చేసుకున్నందుకు నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను.
మనం ఇలాగే సంవత్సరాలు కబుర్లు చెప్పుకోవచ్చు కానీ నీ మెడలో తాళి కట్టడానికి మాత్రం క్షణం కూడా టైం లేదు అంటూ తాళి కట్టటానికి ప్రిపేర్ అవుతాడు అభి. తరువాయి భాగంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన అభిని పోలీసులకి అప్పగిస్తారు యష్ వాళ్ళు. నన్ను అభిని విడగొట్టడానికి మీరు చాలా పెద్ద ప్లాన్ వేశారు అంటూ ఆదిత్యని తీసుకొని వెళ్ళిపోతుంది మాళవిక. ఘనంగా చిత్ర, వసంత్ ల పెళ్లి జరుగుతుంది.