- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: మాజీ భర్తని బ్రతిమాలుకుంటున్న మాళవిక.. భార్య చేసిన పనికి కోపంతో రగిలిపోతున్న యష్!
Ennenno Janmala Bandham: మాజీ భర్తని బ్రతిమాలుకుంటున్న మాళవిక.. భార్య చేసిన పనికి కోపంతో రగిలిపోతున్న యష్!
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ముందుకి దూసుకుపోతుంది. అపార్థం చేసుకున్న భర్తకి కళ్ళు తెరిపించి కాపురాన్ని నిలబెట్టుకున్న ఒక స్త్రీ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో అందరూ భార్యలని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు కానీ ఒడిలో కూర్చోబెట్టుకుని చూసే మొగుణ్ణి నేనే నేమో అంటూ నవ్వుతాడు యష్. నాకు ఎవరైనా తినిపిస్తే నచ్చదు కానీ మీరు తినిపిస్తే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంటుంది వేద. మరోవైపు నన్ను ఆ వేద చాలా అవమానించింది, యష్ కూడా నా మీద రెచ్చిపోయాడు అని అభికి చెప్తుంది మాళవిక.
నా డార్లింగ్ ని అవమానిస్తాడా వాడి అంతు చూస్తాను అంటాడు అభి. నాకు తెలుసు డార్లింగ్ నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని. ఇప్పుడు నాకు నువ్వు తప్ప వేరే ఎవరూ లేరు అంటూ అభి ని హాగ్ చేసుకుంటుంది మాళవిక. నా లైఫ్ నుంచి నీ ఎగ్జిట్ చిత్ర ఎంట్రీ ఒకేసారి జరగాలి అని మనసులో అనుకుంటాడు అభి.
మరోవైపు తనని తాను అద్దంలో చూసుకొని నువ్వు అందగాడివి రా.. అందుకే బెస్ట్ సీఈఓ వి అయ్యావు అని తనని తానే పొగుడుకుంటాడు యష్. అప్పుడు అక్కడికి వచ్చిన వేద అంత లేదు మీ పెర్ఫార్మెన్స్ కి బెస్ట్ సీఈఓ అయ్యారు అంటుంది. నాకేం తక్కువ ఇప్పటికీ నా అందాన్ని చూసి ఫ్లాట్ అయిపోతారు అమ్మాయిలు అంటాడు యష్. తనలోంచి తెల్ల వెంట్రుక తీసి మీరు ముసలి అయిపోతున్నారు అంటూ ఆట పట్టిస్తుంది వేద. ఇంతలోనే యష్ కి ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి ఈవినింగ్ పార్టీ ఉంది అని చెప్తాడు. అదే విషయాన్ని ఎవ్వరికీ చెప్పి నీకు ఈవినింగ్ కి కొత్త డ్రెస్ ఉందా అని అడుగుతాడు. ఏదో ఒకటి కట్టుకుంటాను అంటుంది వేద.
అలా కాదు నేనే షాపింగ్ కి వెళ్లి కొత్త డ్రెస్ తీసుకు వస్తాను అది చూసి నువ్వు సర్ప్రైజ్ అవుతావు అంటూ బయటికి వెళ్ళిపోతాడు యష్. షాప్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మోడరన్ డ్రెస్ సెలెక్ట్ చేస్తాడు. దానిని ప్యాక్ చేయడం కోసం సేల్స్ ఉమెన్ ఆ డ్రెస్ తీసుకు వెళ్తుంటే అదే డ్రెస్ అనుకోకుండా అక్కడికి వచ్చిన మాళవికకి నచ్చుతుంది. ఈ డ్రెస్ నాకు కావాలి అంటుంది. ఇది వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అని యష్ ని చూపిస్తుంది సేల్స్ ఉమెన్. దగ్గరికి వెళ్లి చూసేసరికి అక్కడ ఉన్న యష్ ని చూసి సర్ప్రైజ్ అవుతుంది.నాకోసం ఈ డ్రెస్ కొన్నందుకు థాంక్స్ అంటుంది.
నీకోసం నేనెందుకు కొంటాను.. నా భార్య కోసం కొన్నాను అంటాడు యష్. ఆ ముద్దపప్పు కి ఈ మోడరన్ డ్రెస్ ఏం సూట్ అవుతుంది నాకు గిఫ్ట్ గా ఇచ్చేయ్ అంటుంది మాళవిక. ఈ ప్లేస్ లో నువ్వు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే తప్పకుండా ఇచ్చేసేవాడిని కానీ నీకు మాత్రం చచ్చినా ఇవ్వను అంటూ అక్కడ నుంచి డ్రెస్ తీసుకుని వెళ్ళిపోతాడు యష్.
ఇంటికి వచ్చిన తర్వాత ఆ డ్రెస్ ని వేదకి చూపిస్తాడు యష్. డ్రెస్ అంటే ఏదో శారీ కానీ సల్వార్ కానీ తెస్తారు అనుకున్నాను కానీ ఈ మోడరన్ డ్రెస్ నాకు సూట్ అవ్వదు అంటుంది వేద. వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు ఆఫీసులో పని ఉంది నేను పట్టించే పార్టీకి వస్తాను నువ్వు ఈ డ్రెస్ లో అక్కడికి రా నిన్ను చూసి నేను ఫిదా అయిపోవాలి అంటాడు యష్. ఇబ్బందిగా మొహం పెడుతుంది వేద.
మరోవైపు చిత్రని తన దగ్గరికి పిలిపించుకుని సాయంత్రం పెద్ద పార్టీ వుంది. ఆ పార్టీలో వేసుకోవటం కోసం ఒక డ్రెస్ కొనుక్కుందాం అనుకున్నాను కానీ అప్పటికే దానిని మీ బావ యష్ కొనుక్కున్నాడు అని చెప్తుంది మాళవిక. తరువాయి భాగంలో తను గిఫ్ట్ గా తెచ్చిన డ్రెస్ లో వేద వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాడు యష్. కానీ ఆ డ్రెస్ లో మాళవిక వచ్చి సర్ప్రైజ్ ఇస్తుంది. ఒకసారి గా షాక్ అవుతాడు యష్. శారీలో వచ్చిన వేదని చూసి కోప్పడతాడు.