Ennenno Janmala Bandham: మాళవిక, అభిమన్యు ప్లాన్.. యష్, వేద మధ్య గొడవలు!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమౌతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ ప్రసారం అవుతూ మంచి సక్సెస్ అందుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

యష్ (Yash) తన భార్య వేదతో కలిసి తన ఫ్రెండ్ రిసెప్షన్ పార్టీకి వస్తాడు. ఇక ఆ పార్టీ ప్లేస్ చూసి యష్ కోపంగా ఉంటాడు. గతంలో ఆ ప్లేస్ లో మాళవిక తో జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుకు చేసుకుంటాడు. గతంలో వాలెంటెన్స్ డే రోజు యష్ తన మొదటి భార్య మాళవిక (Malavika) తో అక్కడ జరిగిన ఒక పార్టీకి వెళ్తాడు.
అక్కడ మాళవిక (Malavika) అందరిని చూసి తాను కూడా అలాగా ఉండాలి అని అనుకుంటుంది. కానీ యష్ ను ఉద్దేశించి అటువంటి రిచ్ కోరికలు తీరవని అంటుంది. ఆ సమయంలో అభిమన్యు (Abhimanyu) వచ్చి దగ్గర కూర్చుని మాళవిక తో సంబంధం కలుపుకుంటాడు.
అది చూసిన యష్ (Yash) తట్టుకోలేక పోతాడు. ఇక అప్పటినుంచి మాళవిక (Malavika) కు దూరం ఉంటాడు. అలా ఆ చేదు అనుభవాలను తలచుకొని కోపంతో కుమిలిపోతాడు. ఇక అక్కడ ఉండకూడదు అనుకోని వెనుక వెళ్తున్న సమయంలో యష్ ఫ్రెండ్ వచ్చి యష్ ను తీసుకొని వెళ్తాడు.
వేద (Vedha) మాత్రం తనను యష్ పట్టించుకోలేదని కోపంగా కనిపిస్తుంది. తిరిగి ఇంటికి వెళ్ళాలి అని అనుకోవటం తో ఖుషి గుర్తుకు రావడంతో ఆగిపోతుంది. అదే సమయంలో ఖుషి (Khushi) ఫోన్ చేయడంతో ఖుషితో మాట్లాడుతుంది. ఇక అక్కడికి కారులో అభి, మాళవిక కూడా వస్తారు.
ఫోన్ మాట్లాడుతున్న వేదను (Vedha) కోపంగా చూస్తారు. మరోవైపు యష్ తాగుతూ ఉంటాడు. అక్కడికి అభిమన్యు, మాళవిక లు వచ్చి వేద, యష్ (Yash) ల గురించి మాట్లాడుకుంటారు. పెళ్లి చేసుకున్నా కూడా దూరం గా ఉంటున్నారు అని వెటకారం చేస్తారు.
ఇక అభిమన్యు (Abhimanyu) మాళవికతో వేదకు కంపెనీ ఇవ్వమని అంటాడు. దాంతో మాళవిక కొన్ని కొన్ని సార్లు నువ్వు బాగా నచ్చుతావు అభి అని అంటుంది. ఆ తర్వాత మాళవిక వేద (Vedha) దగ్గరికి వెళ్లి పలకరిస్తుంది. కానీ వేద మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది.
కోర్టు దగ్గర అలా అన్నందుకు క్షమించు అని వేద (Vedha) తో అంటుంది. అదే సమయంలో మాళవిక ఫ్రెండ్స్ రావటంతో వారికి వేదను పరిచయం చేస్తుంది. ఇక మాళవిక ఫ్రెండ్స్ యష్ (Yash) గురించి మాట్లాడటం తో వేద ఇబ్బందిగా ఫీల్ అయినట్లు కనిపిస్తుంది.