MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • KGF 2: మూర్ఖుడు అన్నారు, అలాంటి వాడినే.. కేజీఎఫ్ 2 సక్సెస్ పై యష్ ఎమోషనల్ కామెంట్స్

KGF 2: మూర్ఖుడు అన్నారు, అలాంటి వాడినే.. కేజీఎఫ్ 2 సక్సెస్ పై యష్ ఎమోషనల్ కామెంట్స్

కన్నడ స్టార్ హీరో యష్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదటి భాగం వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 22 2022, 08:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
KGF2

KGF2

కన్నడ స్టార్ హీరో యష్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదటి భాగం వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇటీవల విడుదలైన రెండవ భాగం కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మొత్తం మోగిస్తోంది. కొన్ని చోట్ల కేజిఎఫ్ 2 ఆర్ఆర్ఆర్, బాహుబలి చిత్రాల్ని కూడా అధికమిస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
KGF2

KGF2

ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో యష్ ని అల్టిమేట్ ఎలివేషన్ సీన్స్ తో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశాడు. మాస్ ప్రేక్షకులు కేక పెట్టించే విధంగా కేజిఎఫ్ చిత్రం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కేజిఎఫ్ 2 సాలిడ్ బాక్సాఫీస్ హిట్ గా దూసుకుపోతోంది. దీనితో యష్ తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. 

36
KGF2

KGF2

ఒక గ్రామంలో తీవ్రమైన కరువు వస్తుంది. వర్షం కోసం భగవంతుడిని ప్రార్థించేందుకు గ్రామస్తులంతా ఒక చోటికి చేరుతారు. కానీ ఒక చిన్న అబ్బాయి మాత్రం అక్కడికి గొడుగుతో వెళతాడు. ఆ పిల్లాడిని చూసి గ్రామస్తులంతా మూర్ఖుడు అని అంటారు. మరికొందరు అతివిశ్వాసం అని అంటారు. 

46
KGF2

KGF2

కానీ ఆ పిల్లాడిది నమ్మకం మాత్రమే. ఆ పిల్లాడు వర్షం పట్ల ఎలాంటి నమ్మకంతో ఉన్నాడో.. కెజిఎఫ్ చిత్రం విషయంలో కూడా నేను అలాగే ఉన్నాను. ఇది సాధ్యం అవుతుందా అని కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు కెజిఎఫ్ చిత్రానికి మీరు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే హృదయం నిండిపోతోంది అని యష్ పేర్కొన్నాడు. 

56
KGF2

KGF2

కేజిఎఫ్ చిత్రంతో యష్ తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. యష్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. కెజిఎఫ్ 2 ఏప్రిల్ 14న విడుదలయింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఇండియా టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. 

66
KGF2

KGF2

ఈ చిత్రంలో రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రలో నటించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రశాంత్ నీల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు
Recommended image2
Lucky Heroine: విజయ్, అజిత్, సూర్యకి లక్కీ ఛార్మ్ ఒక్కరే.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇప్పుడు సంచలనం
Recommended image3
Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved