Ennenno Janmala Bandham: అభిపై సీరియస్ అయిన భ్రమరాంబిక.. సంతోషంలో యష్, వేద?
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు డిసెంబర్ 16 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ లో యష్,వేద ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా అప్పుడు యష్ అవును మీ తాతయ్య వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పావు వారి పేర్లు ఏమిటి అని అడగగా అప్పుడు వేద మా తాత గారి పేరు రాజా అనడంతో మీ నా అమ్మమ్మ పేరు రాణి నా అని అనగా కరెక్ట్ గా గెస్ చేశారు అని అంటుంది వేద. చాలా బాగుంది ఓల్డ్ కపుల్ కి ట్రెండింగ్ నేమ్స్ అని అనడంతో వేద వెటకారమా అని అంటుంది. లేదు నిజం లవ్లీ నేమ్స్ అంటాడు యష్. అవును వారిద్దరూ చాలా మంచివారు ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అమర ప్రేమికులు అని అంటుంది వేద.
మరి వారిలో నీకు అంతగా ఏం నచ్చింది అనడంతో వాళ్లు ఇప్పటికీ ఒకరంటే ఒకరికి ప్రాణం ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అని అంటుంది వేద. నువ్వు వాళ్ల గురించి చెబుతున్న ప్రతిసారి ఎప్పుడెప్పుడు వాళ్ళని చూస్తానా అని ఎగ్జైటింగ్ గా ఉంది అంటాడు. మీకు అసలు విషయం చెప్పాలి వాళ్ళ అసలు పేర్లు అవి కాదు వాళ్ళు ముద్దుగా ఒకరినొకరు ఆ విధంగా పిలుచుకుంటారు అనడంతో యష్ నవ్వుకుంటూ ఉంటాడు. నేను కూడా నా భర్తతో ఎప్పుడు అలాగే ఉండాలి అనుకుంటున్నాను అని అనడంతో యష్ ఆశ్చర్యపోతాడు.
వారిద్దరూ వాళ్ళ తాతయ్య పేర్ల గురించి మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు యష్, వేద ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. మరొకవైపు అభిమన్యు ఇంటికి వాళ్ళ అక్క భ్రమరాంబిక వస్తుంది. బాగున్నావా అక్క అని పలకరిస్తూ బొకే ఇవ్వడంతో నువ్వు ఇంకా మారలేదా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఇవ్వాల్సినవి ఇవ్వవు చేయాల్సినవి చేయవు అనడంతో ఏమైంది అక్క అని అడగగా అక్కకు బొకే ఇవ్వడం ఏంట్రా అక్క కాళ్లకు నమస్కారం పెట్టవా అని అడిగిమని నమస్కారాలు పెట్టించుకుంటుంది భ్రమరాంభిక.
ఇంతలోనే భ్రమరాంబికాలకు సాష్టాంగ నమస్కారం చేయడంతో ఎవడ్రా నువ్వు చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు అని అంటుంది. ఇప్పుడు కైలాస్ ని చూసి వీడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు వీడు చాలా చెడ్డ నా కొడుకు అని చెబుతుంది. మరొకవైపు యష్, వేద ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత వేద పాటలు పెట్టడంతో అందులో లవ్ సాంగ్స్ రావడంతో ఇద్దరు ఒకరి వైపు ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. మరొకవైపు భ్రమరాంబికకు మాళవిక ఎదురుపడుతుంది.
వెల్కమ్ టు ఇండియా అని అనడంతో హూ ఆర్ యు అని అడగగా అభి వైపు సైగలు చేయడంతో స్టాపిడ్ అభి అని ధైర్యంగా పిలవడం ఏంటి అని తిడుతుంది. అప్పుడు అభి మిస్ మాళవిక నా ఫ్రెండ్ తో నీ ఫ్రెండ్ ఏంట్రా ఇద్దరు బిడ్డల తల్లిలా ఉంది అని అంటుంది. తనకి షెల్టర్ ఇచ్చాను అని అనడంతో రెండు రోజుల్లో మొత్తం ఇల్లు ఖాళీ అవ్వాలి తనని ఇల్లు ఖాళీ చేయించి బయటికి పంపించేసేయ్ అని అంటుంది. అప్పుడు కైలాష్ ఈమె తో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మాళవిక అభి పై సీరియస్ అవుతూ నేను కష్టాల్లో ఉండడం ఏంటి అభి నువ్వు షెల్టర్ ఇవ్వడం ఏంటి అని అడుగుతుంది.
ఇంతలో భ్రమరంబిక పిలవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అభి. మరొకవైపు మాలిని, సులోచన ను పిలిచి వాళ్ళు వెళ్లారో లేదో అడుగు అని అడగగా వెంటనే సులోచన వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అడగగా ఇంకా రాలేదు దగ్గరలో ఉన్నట్టు ఉన్నారు మేము కూడా వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాము అని అంటాడు రాజా. మరొకవైపు యష్ వాళ్లు కార్లో వెళ్తూ ఉండగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు యష్ హెయిర్ గురించి ఫన్నీగా కామెంట్ చేసి నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు నేను చెబుతున్నది మా నాన్నమ్మ గురించి వినడంతో వేద నవ్వుతూ ఉంటుంది.