MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్విస్ట్ మాములుగా లేదుగా.. మోనిత బిడ్డ కోసం దోష నివారణ పూజకు సిద్ధమైన సౌందర్య?

ట్విస్ట్ మాములుగా లేదుగా.. మోనిత బిడ్డ కోసం దోష నివారణ పూజకు సిద్ధమైన సౌందర్య?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళుతోంది. ఈ సీరియల్ కు తెలుగు రాష్ట్రాలలో మంచి అభిమానం ఉంది. ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Nov 02 2021, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

మోనితకు (Monitha) పుట్టిన బిడ్డ పేగు మెడలో చుట్టుకొని రావటంతో మేనమామకు లేదా తండ్రికి దోషమని అనటంతో వెంటనే సౌందర్య పంతులుని కలవడానికి పంతులు వాళ్ళ ఇంటికి వెళుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నాను అని దీపను (Deepa) మోసం చేస్తున్నానని బాధపడుతుంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

ఎందుకు ఇంతా తప్పు చేసావు కార్తీక్ (Karthik) అని అనుకుంటుంది. మరోవైపు ఇదంతా కార్తీక్ కోసమే కదా అని కార్తీక్ బాగుంటే దీప కూడా బాగుంటుంది కదా అని ఎక్కడికి వెళ్లావు దీప (Deepa) అని అనుకుంటూ పంతులు దగ్గరకి వెళ్తుంది.
 

39

పంతులు కి పుట్టిన బిడ్డ గురించి మొత్తం చెబుతుంది. ఇక దోష నివారణ కోసం పంతులు ఓ స్లిప్ కూడా రాసిస్తాడు. అందులో బాబు తండ్రిగా కార్తీక్ (Karthik) పేరు రాయిస్తుంది. ఈ పూజకు తల్లి తండ్రి బాబు తప్పకుండా ఉండాలని పంతులు చెబుతాడు.
 

49

ఇక సౌందర్య (Soundarya) కారులో వెళ్తూ ఇప్పుడు మోనితను ఎలా పిలవాలని.. గతంలో తను మోనితను తిట్టిన మాటలను గుర్తు చేసుకొని తన ముందుకు ఏం ముఖం పెట్టుకొని వెళ్లాలని ఆలోచిస్తుంది. ఇక దీప (Deepa) గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది.
 

59

అంతలోనే దీప (Deepa) రోడ్డుపై వస్తూ ల్యాబ్ లో మాట్లాడిన మాటలు తలచుకుంటుంది.  అంతేకాకుండా తనతో ప్రియమణి (Priyamani) మాట్లాడిన మాటలు కూడా తలచుకుంటూ బాధపడుతుంది. అప్పుడే సౌందర్య ఎదురు పడటంతో దీపను కారులో తీసుకెళ్తుంది.
 

69

ఎక్కడికి వెళ్లావని సౌందర్య (Soundarya) ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఇక దీప లోలోపల బాధపడుతూ కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. ఇక సౌందర్య దీప (Deepa) మాటలను విని కొత్తగా మాట్లాడుతుందని భయపడుతుంది.
 

79

మరోవైపు మోనిత (Monitha) కార్తీక్ కు పదే పదే ఫోన్ చేయటంతో కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే భారతి రావటంతో భారతితో (Bharathi) మాట్లాడుతుంది. మోనితను ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నావు అని అడగగా త్వరలోనే దానికి సమాధానం దొరుకుతుందన్నట్లు సమాధానం ఇస్తుంది.
 

89

ఇక కార్తీక్ దీప గురించి ఆలోచిస్తూ బాధపడతాడు. వెంటనే సౌందర్య కి ఫోన్ చేయటంతో ఫోన్ కార్ లో రింగ్ అవుతుంది. ఇక దీప (Deepa) ఆ ఫోన్ తీయడానికి ప్రయత్నించడంతో పంతులు గారు ఇచ్చిన స్లిప్ చూస్తుందేమో అని సౌందర్య (Soundarya) భయపడుతుంది.
 

99

ఇక పదేపదే ఫోన్ రావటంతో దీప (Deepa) ఫోన్ తీసి ఇస్తుంది.  సౌందర్య ఇబ్బంది పడుతూ కారు బయటికి వెళ్లి ఫోన్ మాట్లాడుతుంది. వెంటనే దీప ఏదో జరుగుతుందని బాధపడుతుంది. డిక్కీ లోపల పంతులు ఇచ్చిన స్లిప్ చూసి ఆశ్చర్యపోతుంది దీప (Deepa). మొత్తానికి సౌందర్య పూజకు ఏర్పాటు చేయడంతో సీన్ మొత్తం హైలెట్ గా మారేలా ఉంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Collection: `ధురంధర్‌ 2` 50 రోజుల కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్‌.. టోటల్‌ ఎంత వచ్చాయంటే?
Recommended image2
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Recommended image3
అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved