MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రజనీకాంత్ పేరుతో దారుణమైన చీటింగ్..యువతి వద్ద ఏకంగా 4 లక్షల దోపిడీ, ఎలా జరిగిందంటే

రజనీకాంత్ పేరుతో దారుణమైన చీటింగ్..యువతి వద్ద ఏకంగా 4 లక్షల దోపిడీ, ఎలా జరిగిందంటే

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రంతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేశారు. రజనీ స్టయిల్ లో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్న అభిమానులకు జైలర్ చిత్రం ఫుల్ మీల్స్ లా అనిపించింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 17 2024, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Lokesh Kanagaraj

Lokesh Kanagaraj

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రంతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేశారు. రజనీ స్టయిల్ లో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్న అభిమానులకు జైలర్ చిత్రం ఫుల్ మీల్స్ లా అనిపించింది. ఆ తర్వాత వచ్చిన లాల్ సలామ్ దారుణమైన ఫ్లాప్ గా నిలిచినప్పటికీ అది పూర్తి స్థాయి రజనీకాంత్ చిత్రం కాకపోవడంతో ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. 

26
Lokesh Kanagaraj

Lokesh Kanagaraj

ఇప్పుడు తలైవర్ ఫ్యాన్స్ ఫోకస్ మొత్తం లోకేష్ కనకరాజ్ చిత్రంపైనే ఉంది. లోకేష్ కనకరాజ్ తలుచుకుంటే రజనితో వండర్స్ క్రియేట్ చేయొచ్చు. దీనితో ఈ ప్రాజెక్టు పై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

36

అయితే ఈ క్రేజీ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ని వాడుకుంటూ కొందరు సైబర్ నేరగాళ్లు ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగుళూరులో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ చిత్రంలో ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని చాలా మంది వర్తమాన నటీనటులు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారిని టార్గెట్ చేస్తూ కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. 

46

తలైవర్ 171 చిత్రంలో నటించేందుకు నటీనటులు కావాలంటూ ఒక ఆడిషన్ పోస్ట్ బెంగుళూరులో వైరల్ అయింది. రజనీకాంత్ సినిమా కావడంతో చాలా మంది ఆ పోస్ట్ లో ఉన్న అడ్రెస్ కి వెళ్లారు. అక్కడ వారికి కాస్టింగ్ డైరెక్టర్స్ పేరుతో కొందరు వ్యక్తులు పరిచయం అయ్యారు. ఆడిషన్స్ కి వెళ్లిన వారి దగ్గర భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారు. 

56

మృదుల అనే యువతి నుంచి సురేష్ కుమార్ అనే వ్యక్తి ఏకంగా 4 లక్షలు తీసుకున్నాడట. డబ్బు ఇచ్చిన తర్వాత తాను మోసపోయినట్లు మృదుల గ్రహించింది. వెంటనే పోలీసులని ఆశ్రయించింది. రజనీకాంత్ సినిమా అనే సరికి తాను మోసపోయినట్లు పోలీసుల వద్ద మొరపెట్టుకుంది. దీనితో బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

66

చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన వస్తేనే స్పందించండి అని నిర్మాతలు తరచుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఎలాగైనా సినిమా ఆఫర్ పొందాలనే ఉద్దేశంతో కొందరు ఇలా కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Treat: విజయ్‌ దేవరకొండ, రష్మిక అభిమానులకు `రణబాలి` ఊహించని ట్రీట్‌.. తెరపై మరోసారి పెళ్లి
Recommended image2
Sangeetha Vijay: విజయ్ కంటే సంగీత ఆస్తి ఎక్కువా? ఆమె వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Recommended image3
Celebrity Weddings: రష్మిక-విజయ్ నుంచి సమంత- రాజ్ వరకు.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన 7 సౌత్ స్టార్ జంటలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved