అమరావతి కి టాలీవుడ్ షిఫ్ట్ అవ్వబోతుందా ..? తేల్చి చెప్పేసిన చంద్రబాబు
టాలీవుడ్ ఆంధ్రాకు తరలిపోబోతోందా..? అమరావతిలో తెలుగు సినీపరిశ్రమ ఏర్పాటు కాబోతోందాం...? చంద్రబాబు మాటల్లో ఆంతర్యం ఏంటి..? ముందు ముందు ఏం చేయబోతున్నారు..?
Pan Indian Movies
రాష్ట్రాలు రెండైనా.. తెలుగు సినీపరిశ్రమ మాత్రం ఒక్కటే. హిందీ పరిశ్రమ ఎన్నిరాష్ట్రాల్లో ఉన్నా.. బాలీవుడ్ అని మాత్రమే పిలుస్తారు. ఇక తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉన్నా.. సినీపరిశ్రమ మాత్రం టాలీవుడ్ మాత్రమే హైదరాబాద్ కేంద్రంగా పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్, కోలీవుడ్ లాంటి పెద్ద పరిశ్రమలను వెనక్కి నెట్టి.. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అన్నంతగా తెలుగు సినీపరిశ్రమ పేరుతెచ్చుకుంటుంది.
Top 10 Pan India Stars
ఈక్రమంలో ఎవరు క్రాస్ చేయలేని రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది తెలుగు సినిమా. ఈక్రమంలో తెలుగు సినీపరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలిపోతుంది అన్న ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది. ఎంత కాదనకున్నా.. టాలీవుడ్ అంటే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సినీ పరిశ్రమగానే ఉంది. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నటులు చాలా తక్కువ. అయితే తెలుగు రాష్ట్రాలు వేరవడ్డం.. సినీపరిశ్రమ మాత్రం ఒక్కటిగానే ఉంది.
తెలుగు సినిమాలు తెలుగు వారందరికి చెందినవి.. దీనిలో విభజన ఉండదు అంటూ. ఎప్పపుడో తేల్చి చెప్పేశారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా తెలుగు పరిశ్రమ అభివృధ్ది చెందాలని. అక్కడ కూడా పెద్ద స్టూడియోలు కట్టాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అక్కడ కూడా సినిమాకు సబంధించిన పనులు జరగాలని చాలామంది అభిప్రాయం.
ఈరకంగా చిన్నగా ఆంధ్ర ప్రదేశ్ కు కూడా టాలీవుడ్ నువిస్తరించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో అమరావతిలో టాలీవుడ్ కు సబంధించి ఏం కావాలన్న చేయడానికి కూటమి ప్రభుత్వం కూడా సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందులోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండటంతో.. తెలుగు పరిశ్రమ ఆంధ్ర ప్రదేశ్ లో స్థిరపడటానికి ఇప్పటి నుంచే పునాదులు వేసేలా ప్లాన్ చేస్తున్నారట.
ఈక్రమంలో ఈమధ్య హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలు కూడా ఈ విషయానికి బలం చేకూర్చుతున్నాయి. సినిమా వారిపై ప్రభుత్వం కక్షపూరితంగా ఉంది అంటూ కొంత మంది కావాలని ప్రచారం చేడంతో.. పరిశ్రమకు ఏం కావాలన్నీ చేస్తాం అంటూ రేవంత్ రెడ్డి రీసెంట్ గా మీటింగ్ పెట్టి..తాము ఫిల్మ్ ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు అన్న సంకేతాలు ఇచ్చారు. ఇక ఇక్కడ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు మాత్రం పెంచమని చెప్పేశారు.
amaravathi
దీనికితోడు రీసెంట్ గా చంద్రబాబు చేసిన కామెంట్స్ కూడా టాలీవుడ్ ను ఆంధ్రాకు ఆహ్వానించినట్టుగానే అనిపిస్తున్నాయి. రీసెంట్ గా న్యూ ఇయర్ రోజు అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ చేసినన ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక విషయాలు పంచుకున్నారు. సినిమా రంగంలో భవిష్యత్తులో అమరావతి కూడా ప్రభావం చూపబోతోంది అన్నారు. అసలు మొదట్లో సినిమా రంగానికి బెజవాడ కేంద్ర స్థానంగా ఉండేది.
తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చినా ఆదాయపరంగా కోస్తా ప్రాంతమే సినిమా రంగానికి కీలకంగా ఉండేదని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ జనాభా కోటి దాటి పోయి అక్కడ సినిమా రంగానికి ఆదాయం పెరిగింది.. దీంతో ఆ రంగంలో హైదరాబాద్ ప్రాముఖ్యం విస్తరించింది.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.. తెలుగు సినిమాలకు ఇప్పుడు విదేశాల్లో ఎక్కువ ఆదాయం వస్తోంది. విదేశాలను దృష్టిలో పెట్టుకొని సినిమాల తయారీ, పంపిణీ జరుగుతోందని.. అయినా ఆదాయపరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌దే ప్రముఖ స్థానం అన్నారు.
ఇక భవిష్యత్తులో అమరావతిలో సినిమా ఇండస్ట్రీ సెటిల్ అవ్వడానికి కావల్సినవి ఇవ్వడానికి రెడీగా ఉన్నామన్నట్టుగా చంద్రబాబు హింట్ ఇచ్చారు. తెలుగు పరిశ్రమ మొత్తం తరలి వెళ్లడం కుదిరేపరి కాదు.
ఎందుకంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ లెవల్లో సినిమాలకు కేంద్రంగా మారింది. బాలీవుడ్ జనాలు కూడా ఇక్కడ షూటింగ్స్ చేసుకుటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ, రామానాయుడు, ఎల్వీప్రసాద్, లాంటి పెద్ద పెద్ద స్టూడియోలు హైదరాబాద్ లో ఉన్నాయి.
వీటికి సబంధించిన సినిమా కుటుంబాలకు పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా ఇక్కడే ఉన్నాయి. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, బాలయ్య, ఇలా పెద్ద పెద్ద వాళ్ల ఇళ్లు.. వ్యాపారాలు, అంతా హైదరాబాద్ లోనే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి పర్మినెంట్ గా ఇప్పట్లో అమరావతికి సినిమా వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు.
కాని.. అమరావతి డెబలప్ అయ్యి.. అక్కడ పెద్ద పెద్ద స్టూడియోలు.. సినిమా రంగానికి సబంధించిన అన్ని ఏర్పాట్లు జరగిన తరువాత తరం హీరోలు అక్కడికి వెళ్లి సినిమాలు చేసే అవకాశం ఉంది. ఈమధ్యలో అమరావతి - హైదరాబాద్ మధ్య షటిల్ సర్వీస్ ఉంటుందేమో కాని పర్మినెంట్ గా వెళ్ళే అవకావాలు లేనట్టు తెలుస్తోంది.