- Home
- Entertainment
- Guppedantha manasu: నీ చేత్తో విషం ఇచ్చి చంపేయ్ రిషీ.. దేవయాని డ్రామాలు మాములుగా లేవుగా!
Guppedantha manasu: నీ చేత్తో విషం ఇచ్చి చంపేయ్ రిషీ.. దేవయాని డ్రామాలు మాములుగా లేవుగా!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 6వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రిషి, దేవయాని దగ్గరికి కంగారుగా వెళ్తాడు.రిషి రావడం చూసి దేవయాని బాధని నటిస్తూ నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు రిషి. ఇదే నా ఆకరి మాట అనుకున్నాను అని ఏడుస్తూ ఉంటాది.అసలేమైంది పెద్దమ్మ? అని రిషి కంగారు అడగగా, నేను నీ పట్ల తెలిసో తెలియకో ఏవైనా చిన్న తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు. కానీ నేను సాక్షిని తప్పు అంచనా వేశాను.
తనకి నువ్వంటే చాలా ఇష్టం అని నేను తనకి సపోర్ట్ చేశాను. నువ్వు జగతిని ఇంటికి తీసుకొచ్చావు అయినా నేనేం అనలేదు, వసుధరతో ఎక్కువగా ఉండొద్దు అన్నాను,అయినా ఉన్నావు నేనేం అనలేదు. సాక్షికి నువ్వంటే ఇష్టమని సాక్షితో ఉండమన్నాను, అదీ నీ ఇష్టం. ఇప్పుడు నేను ఏమనలేను. కానీ ఇంత చేసినా, సాక్షి నా మీద కోప్పడి నన్ను జైల్ కి పంపిస్తా అంటుంది. ఇంకా నా దగ్గర ఉన్నవి రెండే మార్గాలు, ఒకటి నిన్ను సాక్షిని పెళ్లి చేసుకోమని అడగడం.
అది జరగని పని ఎందుకంటే అది నువ్వు ఒప్పుకోవు, ఇంకొకటి నేను విషం తాగి చావడం అందుకే విషం తాగి చచ్చిపోతా అని అంటుంది. దేవయాని రిషి మౌనంగా బాధపడుతూ అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. ఈలోగా మిగిలిన ఇంట్లో కుటుంబ సభ్యులందరూ వసదారు దగ్గరికి వెళ్లి రిషి మూడ్ ఎలా ఉంది అని అడగగా, బయటకి బానే ఉన్నా ఆయన లోపల బాగాలేరు. సాక్షి మీద అతనికున్న ఆలోచనలను అంచనా వేయలేకపోతున్నాను అని అంటుంది వసుధార.
ఇంక నేను ఇంటికి బయలుదేరుతాను అని వాసుదార అనగా ఇంత రాత్రికి ఏం వెళ్తావు? ఇక్కడే ఉండు ఈ రాత్రికి అని జగతి అంటుంది. వసుధార గదిలోకి వెళ్లడం చూసి దేవయాని వాసు నీ తన గదిలోకి పిలిచి, సాక్షి దగ్గర నుంచి రిషిని నువ్వే కాపాడాలి. సాక్షి గురించి తక్కువ వేశాను. రిషి కి నివ్వంటే అంటే మర్యాద కనుక నువ్వే తనని కాపాడాలి అంటూ బాధను నటిస్తూ ఏడుస్తుంది.రిషి సార్ కి తనని తాను కాపాడుకోవడం తెలుసు.
తన గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. ఆ తర్వాత రోజు ఉదయం రిషి కి కాఫీ ఇస్తుంది వసు. రిషి వద్దని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సీన్లో వసు కాఫీ షాప్ లోని తన పనులు చేస్తూ పరధ్యానంలో ఉండి అక్కడ పనులన్నీ తప్పు తప్పుగా చేస్తూ ఉంటుంది ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!