అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్లకు అదే పెద్ద ఛాలెంజ్... అత్త అమల వలె చేయగలదా? లేదంటే కష్టమే!
త్వరలో శోభిత ధూళిపాళ్ల అక్కినేని ఇంటి కోడలు కానుంది. అయితే శోభిత ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఒక పక్క చైతన్య-శోభిత కలిసి ఉండటం కష్టమే అనే విమర్శలు వినిపిస్తుండగా అమల వలె చేయగలదా అనే సందేహాలు మొదలయ్యాయి.
Naga Chaitanya and Sobhita
నాగ చైతన్య త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆగస్టు 8వ తేదీన శోభిత ధూళిపాళ్ల తో నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో నాగ చైతన్య - శోభిత ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కినేనివారి కొత్త కోడలిపై అనేక చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మరో కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది.
గతంలో నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ చాలా సార్లు ఫారెన్ లో జంటగా కనిపించారు.తరచుగా వెకేషన్స్ కి వెళ్లేవారనే వాదన ఉంది. ఈ క్రమంలో డేటింగ్ రూమర్స్ ఎక్కువయ్యాయి. వాటిని నిజం చేస్తూ నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల తో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున అఫీషియల్ గా ప్రకటించారు.
నాగార్జున ఎంగేజ్మెంట్ ట్విట్టర్ ఎక్స్ లో ఫోటోలు షేర్ చేశాడు.పెళ్ళికి కాస్త సమయం ఉందని తెలిపారు. నాగ చైతన్య కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల వివరాలను నెటిజెన్స్ విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శోభితను నాగార్జున భార్య అమల తో పోలుస్తున్నారు. అమల కి ఉన్నంత బాధ్యత శోభితకి ఉంటుందా? అక్కినేని కుటుంబంలోకి రాబోతున్న శోభిత ఫ్యామిలీ కోసం అమల మాదిరి కెరీర్ త్యాగం చేస్తుందా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.
1992లో అక్కినేని నాగార్జున హీరోయిన్ అమలను రెండో వివాహం చేసుకున్నాడు. చాలా సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అయితే పెళ్ళైన తరువాత అమల సినిమాల్లో నటించలేదు. కుటుంబం కోసం కెరీర్ ని పక్కన పెట్టింది.పెళ్ళైన ఏళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సెలెక్టీవ్ గా తల్లి పాత్రలు, గెస్ట్ రోల్స్ చేస్తుంది. నాగ చైతన్య శోభితను రెండో వివాహం చేసుకోబోతున్నారు. ఆమె కూడా నటనకు గుడ్ బై చెబుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి.
నాగ చైతన్య మాజీ భార్య సమంతకు అక్కినేని ఫ్యామిలీ కెరీర్ విషయంలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. నాగ చైతన్య కూడా ఆమెను ప్రోత్సహించాడు. సమంత వివాహం అనంతరం కూడా బోల్డ్ రోల్స్ చేసింది. నాగ చైతన్యతో విభేదాలకు అది కూడా కారణం అంటారు. ఒకవేళ శోభిత నటన కొనసాగిస్తే నాగ చైతన్య-శోభిత బంధం ఒడిదుడుకులు లేకుండా సాగుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి . ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.