MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sudigali Sudheer: బంగారు బాతు సుడిగాలి సుధీర్ ని మల్లెమాల ఎందుకు రానివ్వడం లేదు..? అసలు మేటర్ అదేనా!

Sudigali Sudheer: బంగారు బాతు సుడిగాలి సుధీర్ ని మల్లెమాల ఎందుకు రానివ్వడం లేదు..? అసలు మేటర్ అదేనా!

సుడిగాలి సుధీర్ హీరోగా ఫస్ట్ హిట్ కొట్టాడు. గాలోడు మూవీ విజయం సాధించింది. ఆయనకు హీరోగా ఆఫర్స్ వస్తున్నాయి. అయినప్పటికీ మల్లెమాల సంస్థలో తిరిగి పని చేయాలని అనుకుతున్నారని, కానీ రానివ్వడం లేదని ఒక వాదన వినిపిస్తోంది.  

2 Min read
Sambi Reddy
Published : Jan 02 2023, 08:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


జబర్దస్త్ లైఫ్ ఇచ్చిన కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) ఒకడు. ఒక సాధారణ కమెడియన్ గా వచ్చి టీమ్ లీడర్ అయ్యాడు. తన మల్టీ టాలెంట్స్ చూపుతూ బుల్లితెర స్టార్ గా ఎదిగాడు. జబర్దస్త్ తో పాటు ఢీ డాన్స్ రియాలిటీ షో సుధీర్ ఇమేజ్ పెంచేసింది. ఇక రష్మితో సుధీర్ లవ్ ట్రాక్స్, రొమాన్స్ సైతం ప్లస్ అయ్యాయి. 
 

28

సాఫ్ట్ వేర్ సుధీర్ మూవీతో సుడిగాలి సుధీర్ హీరో అయ్యాడు. 3 మంకీస్ టైటిల్ తో మరో చిత్రం చేశాడు. అయితే గత ఏడాది విడుదలైన గాలోడు చిత్రం ఆయనకు ఫస్ట్ హిట్ ఇచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన గాలోడు మూవీ బ్రేక్ ఈవెన్ దాటడంతో పాటు బయ్యర్లకు లాభాలు పంచింది. ఈ క్రమంలో సుధీర్ కి హీరోగా అవకాశాలు క్యూ కట్టనున్నాయి.

38
Sudigali Sudheer

Sudigali Sudheer


గాలోడు చిత్ర డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మరి కొన్ని ప్రాజెక్ట్స్ సుధీర్ తో తెరకెక్కించే సూచనలు కలవు. గాలోడు సక్సెస్ మీట్స్ లో రాజశేఖర్ రెడ్డి ఈ విషయం తెలిసియజేశారు. ఈ క్రమంలో ఇక సుధీర్ బుల్లితెర షోలు చేయడా? అతడు జబర్దస్త్ కి పూర్తిగా దూరం కానున్నాడా? అనే సందేహాలు నెలకొన్నాయి. 
 

48

ఈ ప్రశ్నలకు సుధీర్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. హీరో అయినప్పటికీ బుల్లితెరను వదిలేది లేదు. జబర్దస్త్ కి త్వరలో రీఎంట్రీ ఇస్తాను. మల్లెమాల యాజమాన్యంతో మాట్లాడాను. నాపై కొన్ని కొత్త కామెడీ షోలు రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు వారు వెల్లడించారు. నేను అనుమతి తీసుకొని జబర్దస్త్ మానేశాను. మల్లెమాలతో ఎలాంటి విబేధాలు లేవు... అని చెప్పుకొచ్చారు.

58


ఆ మాట చెప్పి నెలలు గడుస్తున్నా సుధీర్ జబర్దస్త్ కి రాలేదు. ఇటీవల ఆహా యాప్ లో కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పేరుతో ఒక కామెడీ షో స్టార్ట్ చేయగా... యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా మల్లెమాల సుధీర్ కి నో ఎంట్రీ బోర్డు పెట్టిందనేది టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట. ఈ వాదనకు హైపర్ ఆది కామెంట్ బలం చేకూర్చుతుంది. ఇటీవల ఓ షోలో హైపర్ ఆది యాంకర్ రష్మీతో(Rashmi Gautam) ''మీవాడు మళ్ళీ రావాలని తెగ బ్రతిమిలాడుకుంటున్నాడటగా'' అన్నాడు. 

68


సుధీర్ తిరిగి వచ్చేందుకు మల్లెమాల యాజమాన్యాన్ని వేడుకుంటున్నాడని హైపర్ ఆది పరోక్షంగా అన్నాడు. మల్లెమాల ఒక పాలసీ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంది. ఒకసారి తమను కాదని బయటకు వెళ్ళిపోయిన వాళ్ళను తిరిగి రానివ్వరు. ఆ రూల్ సుడిగాలి సుధీర్ కి అప్లై చేశారని, అతడు బ్రతిమిలాడుకుంటున్నా అవకాశం ఇవ్వడం లేదంటున్నారు. 

78

అయితే సుధీర్ రీఎంట్రీ మల్లెమాలకు చాలా ప్లస్ అవుతుంది. ముఖ్యంగా ఎక్స్ట్రా జబర్దస్త్ టీఆర్పీ అతడి రాకతో పరుగులు పెడుతుంది. సుడిగాలి సుధీర్ టీమ్ రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులతో అసంపూర్తిగా ఉంది. వారితో సుడిగాలి సుధీర్ జాయిన్ అయితే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. వారి స్కిట్స్ చూసేందుకు ఎగబడతారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా ఆదరణ పెరిగే సూచనలు ఉన్నాయి.

88


కేవలం ఇగోకి పోయి సుడిగాలి సుధీర్ లాంటి బంగారు బాతును వదులుకుంటున్నారంటే నమ్మడం కష్టమే. ఇక సుడిగాలి సుధీర్ కోణం నుండి ఆలోచిస్తే... హీరోగా అవకాశాలు వస్తున్న సుధీర్ కెరీర్ గ్రాఫ్ పైకి పోతుంటే ఆయన వెనక్కి ఎందుకు చూస్తున్నారని. ఒకవేళ నిజంగా సుధీర్ జబర్దస్త్ రీఎంట్రీ కోసం ట్రై చేస్తుంటే ఒకే ఒక కారణం ఉంది. సినిమా జూదం లాంటిది ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. మల్లెమాల షోలు ఆర్థిక భద్రత ఇస్తాయి. సినిమాలతో పోల్చితే తక్కువ సంపాదన అయినప్పటికీ ప్రతినెలా నికర ఆదాయం సమకూరుతుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు
Recommended image2
2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?
Recommended image3
ర‌జినీకి త‌ల్లిగా, ల‌వ‌ర్‌గా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved