ఆ ప్రశ్న అడిగారని జర్నలిస్ట్ పై సీరియస్ అయిన రజనీ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం కూలీ సినిమాతో బిజీగా ఉన్నారు. కూలీ (Coolie) షూటింగ్ కోసం థాయ్‌లాండ్‌కు బయల్దేరారు తలైవా.
Rajinikanth, Coolie, Anna University
రజనీకాంత్ మీడియాతో మాట్లాడేది తక్కువ. అది కూడా చాలా ఆచి,తూచి మాట్లాడతారు, ఎప్పుడూ సైలెంట్ గా ఉండటానికే ఇష్టపడతారు. అయితే మీడియా మాత్రం ఆయన్ను వివాదాస్పద ప్రశ్నలు వేసి ఇరికించాలనే ప్రయత్నిస్తూంటుంది.
ఎందుకంటే రజనీ వంటి సెలబ్రెటీ మాటలు హాట్ టాపిక్ గా మారతాయి కాబట్టి. తాజాగా రజనీకాంత్ మీడియా నుంచి ఓ ప్రశ్నను ఎదుర్కొన్నారు. అది తమిళనాడులో ప్రస్తుతం రగులుతున్న ఓ వివాదాస్పద అంశం. దాంతో రజనీకాంత్ ఆ మీడియా వ్యక్తిపై సీరియస్ అయ్యారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. అసలు రజనీకాంత్ ని మీడియా వ్యక్తి ఏ విషయం గురించి అడిగారో చూద్దాం.
Rajinikanth, Rajanikanth,
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం కూలీ సినిమాతో బిజీగా ఉన్నారు. కూలీ (Coolie) షూటింగ్ కోసం థాయ్‌లాండ్‌కు బయల్దేరారు తలైవా. ఆయన చెన్నై విమానాశ్రయంలో కనిపించగా అక్కడున్న మీడియా కొన్ని ప్రశ్నలడిగింది. సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందని అడగ్గా రజనీ.. 70 శాతం పూర్తయిందని చెప్పాడు. మిగతాది జనవరి 13 నుంచి 28 మధ్య షూటింగ్ చేస్తామన్నాడు.
ఓ జర్నలిస్ట్.. తమిళనాడులో మహిళ భ్రదత గురించి ప్రశ్నించగా రజనీ అసహనం వ్యక్తం చేశాడు.‘నన్ను రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగొద్దు’ (Dont ask political questions) అంటూ సమాధానమిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రజనీకాంత్ వంటి సెలబ్రెటీలు కూడా రాజకీయాలు నాకొద్దు అంటూ ప్రజలకు దూరంగా వెళ్లిపోతే ఎలా అంటూ విమర్శలు మొదలయ్యాయి.
Rajanikanth
ఇంతకీ ఆ ప్రశ్న అడగటానికి కారణం ఏమిటి?
తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీ (Anna University) లో విద్యార్థినిపై అత్యాచారం ఘటన ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళల భద్రతపై (womens safety) ఆందోళన వ్యక్తం చేయటమే. అన్నా యూనివర్సిటీలో సెకండియర్ చదువుతున్న విద్యార్థినిపై గతేడాది డిసెంబర్ 23న ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి క్యాంపస్ వెనుకవైపు ఏకాంతంగా ఉన్న సమయంలో నిందితుడు అక్కడికి వెళ్లి వారిని వీడియో తీశాడు. బాధితురాలి స్నేహితుడిని బెదిరించి వెళ్లగొట్టి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకుచెబితే వీడియో బయటపెడుతానని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఇదే తరహాలో మరో అమ్మాయిని కూడా బెదిరింపులతో లొంగదీసుకున్నట్లు తెలుస్తోంది.
Rajanikanth, anushka shetty, Linga,
కూలీ చిత్రం విషయానికి వస్తే..
జైలర్‌తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సూపర్ స్టార్ ఇటీవల వెట్టైయాన్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చారు. టీజీ జ్ఞానలేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లని రాబట్టింది. ఇదే జోరుతో ప్రస్తుతం రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలో నటిస్తున్నారు.
సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరొందిన లోకేశ్ కనగరాజ్ ఈ కూలీ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. ఇటీవల రిలీజైన టైటిల్ టీజర్ సినిమాపై అంచనాల్నిపెంచేసింది. బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే సినిమానే ఈ కూలీ అని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.