- Home
- Entertainment
- నందమూరి వంశంలో ఆ హీరోని తొక్కేసింది ఎవరు ? చిరంజీవితో కూడా నటించాడు.. అప్పట్లో జరిగింది ఇదే
నందమూరి వంశంలో ఆ హీరోని తొక్కేసింది ఎవరు ? చిరంజీవితో కూడా నటించాడు.. అప్పట్లో జరిగింది ఇదే
నందమూరి వంశంలో ఓ హీరో కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ హీరో ఎందుకు సినిమాలు మానేశారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

నందమూరి వంశంలో ఆ హీరో
స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత నందమూరి వంశంలో నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా రాణించారు. బాలకృష్ణ ఇప్పటికీ టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా రాణిస్తున్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ సినీ రంగ ప్రవేశం చేశారు. నందమూరి వంశంలో బాలకృష్ణ తర్వాత అంతటి స్టార్ హీరో కావలసిన ఒకరు కెరీర్ ని మధ్యలోనే ఆపేసి కనుమరుగయ్యారు. ఇంతకీ ఆ హీరో ఎవరు.. నందమూరి వంశంతో అతడి రిలేషన్ ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రావు తనయుడు
సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు నందమూరి త్రివిక్రమ రావు నిర్మాతగా రాణించారు. ఎన్టీఆర్ తో అనేక చిత్రాలు నిర్మించారు. త్రివిక్రమ రావుకి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు నందమూరి కల్యాణ చక్రవర్తి కాగా రెండో కుమారుడు హరీన్ చక్రవర్తి. కల్యాణ చక్రవర్తి 80వ దశకంలో టాలీవుడ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు.
చిరంజీవితో నటించిన ఏకైక నందమూరి హీరో
మెగాస్టార్ చిరంజీవితో నటించిన ఏకైక నందమూరి హీరో కూడా అతడే. కల్యాణ చక్రవర్తి తలంబ్రాలు, ఇంటి దొంగ, దొంగ కాపురం లాంటి చిత్రాల్లో హీరోగా నటించారు. చిరంజీవి లంకేశ్వరుడు చిత్రంలో క్యారెక్టర్ రోల్ లో నటించారు. ఎన్టీఆర్ తమ్ముడు కొడుకు కాబట్టి బాలకృష్ణకి కల్యాణ చక్రవర్తి సోదరుడు అవుతారు. దీనితో ఆ టైంలో కల్యాణ చక్రవర్తి బాలయ్యకి పోటీగా ఎదుగుతారు అనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉండేది.
ఎన్టీఆర్ నుంచి సపోర్ట్
ఎన్టీఆర్ నుంచి మాత్రం కల్యాణ చక్రవర్తికి మంచి సపోర్ట్ లభించింది. అయినప్పటికీ కల్యాణ చక్రవర్తి నటుడిగా ఎదగలేకపోయారు. బాలయ్య తరహాలో కల్యాణ చక్రవర్తి హిట్ చిత్రాల్లో నటించలేదు. దీనితో రేసులో వెనుకబడిపోయారు. తన తండ్రి త్రివిక్రమ రావు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కల్యాణ చక్రవర్తి చెన్నై లోనే ఉండిపోవలసి వచ్చింది.
అందుకే కెరీర్ త్యాగం
ఆ టైంలో తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి తరలి వచ్చింది. తండ్రి మంచాన పడడంతో ఆయన కోసం కల్యాణ చక్రవర్తి తన కెరీర్ ని త్యాగం చేశారు. కానీ ఎవరో కల్యాణ చక్రవర్తి కెరీర్ ని తొక్కేసినట్లు, సొంత కుటుంబ సభ్యులే అలా చేశారు అంటూ అప్పట్లో రూమర్స్ వచ్చాయి. సినిమాలకు దూరమైన కల్యాణ చక్రవర్తి చెన్నైలో బిజినెస్ లో స్థిరపడ్డారు. కల్యాణ చక్రవర్తి సోదరుడు హరీన్ చక్రవర్తి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు.