- Home
- Andhra Pradesh
- చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న మాస్ డైరెక్టర్.. ఒక్క ఫైట్ లేకుండా తీసిన మూవీ బ్లాక్ బస్టర్ హిట్
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న మాస్ డైరెక్టర్.. ఒక్క ఫైట్ లేకుండా తీసిన మూవీ బ్లాక్ బస్టర్ హిట్
బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించిన ఒక మాస్ డైరెక్టర్ చిరంజీవి నటన చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట. అసలేం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎక్కువగా కమర్షియల్ చిత్రాలు చేశారు. కానీ తన నటనా ప్రతిభని తెలియజేసేలా ఆణిముత్యాల్లాంటి ప్రయోగాత్మక చిత్రాలు కూడా ఉన్నాయి. ఖైదీ తర్వాత చిరంజీవి వరుసగా మాస్ యాక్షన్ చిత్రాలు చేస్తూ వచ్చారు. చిరంజీవి కోదండ రామిరెడ్డి కాంబినేషన్ అంటే ఉర్రూతలూగించే పాటలు, డ్యాన్సులు, అదరగొట్టే ఫైట్స్ ఖాయం అని ఫ్యాన్స్ లో అభిప్రాయం ఏర్పడింది.
KNOW
చిరంజీవి విజేత మూవీ
1985లో మరోసారి చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ కుదిరింది. అల్లు అరవింద్ నిర్మాత. ఇంకేముంది.. మరో కమర్షియల్ హిట్ ఖాయం.. మాస్ ప్రేక్షకులకు పండగే అని అంతా అనుకున్నారు. కానీ థియేటర్ లో సినిమా చూసిన ప్రేక్షకులకు స్వీట్ షాక్.. చిరంజీవి, కోదండ రామిరెడ్డి సర్ప్రైజ్ చేసి పడేశారు. ఆ చిత్రం ఇంకేదో కాదు.. విజేత. ఈ చిత్రంలో ఒక్క ఫైట్ ఉండదు.
ఎమోషనల్ డ్రామాగా విజేత
కంప్లీట్ గా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని కోదండరామిరెడ్డి నడిపించారు. చిరంజీవి నటన అద్భుతం. దీనితో ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రంలో భానుప్రియ హీరోయిన్ గా నటించగా .. శారద, అల్లు రామలింగయ్య, సోమయాజులు కీలక పాత్రల్లో నటించారు. అల్లు అర్జున్ ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు.
కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
ఈ చిత్రానికి చిరంజీవికి ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది. ఈ మూవీ ఫస్ట్ కాపీ రెడీ అయినప్పుడు చిరంజీవి యాక్టింగ్ చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని కోదండరామిరెడ్డి స్వయంగా తెలిపారు. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ చిరంజీవి రాత్రి 12 గంటల వరకు షూటింగ్ చేసేవారు. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు ఒక సన్నివేశం చిత్రీకరించాలని చెబితే ఒకే.. చేసేద్దాం అనేవారు. అదేంటి 12 గంటల వరకు షూటింగ్ చేశాం కదా.. మళ్ళీ 5 గంటలకు ఎలా సాధ్యం అవుతుంది అని ఎప్పుడూ చిరంజీవి అడ్డు చెప్పింది లేదు.
చిరంజీవిపై ప్రశంసలు
చిరంజీవి అంతలా కష్టపడ్డారు కాబట్టే మెగాస్టార్ అయ్యారు అని కోదండరామిరెడ్డి ప్రశంసలు కురిపించారు. అప్పటి మ్యాగజైన్స్ లో కూడా విజేత చిత్రం గురించి కథనాలు వెలువడ్డాయి. చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్ కి మాత్రమే పరిమితం అనే అభిప్రాయాన్ని పటాపంచలు చేసిన చిత్రం విజేత అంటూ ప్రశంసలు దక్కాయి.