MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షాకింగ్: దర్శన్ కు సపోర్ట్ ఇస్తూ నాగశౌర్య పోస్ట్, మంచివాడంటూ...

షాకింగ్: దర్శన్ కు సపోర్ట్ ఇస్తూ నాగశౌర్య పోస్ట్, మంచివాడంటూ...

 దర్శన్ అన్న కలలో కూడా ఎప్పుడూ ఇలాంటి పనులు చేసే మనిషి కాదు.. దర్శన్ అన్న గురించి తెలిసిన వారికి, 

3 Min read
Author : Surya Prakash
Published : Jun 28 2024, 06:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
darshan

darshan


తెలుగులో  యంగ్ హీరోల్లో అందగాడుగా నాగశౌర్యకి పేరుంది. తెరపై లవర్ బాయ్  ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోల్లో నాగ శౌర్య ఒకరు.   మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం ఆయన సొంతం. అమ్మాయిలలో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. నాని .. రామ్ .. నితిన్ వంటి హీరోల నుంచి నాగశౌర్యకి గట్టిపోటీ ఉన్నప్పటికీ, తనదైన ప్రత్యేకతను కనబరుస్తూ ముందుకెళ్లాడు. తన ఖాతాలోనూ కొన్ని హిట్లు వేసుకున్నాడు. ఇటు సొంత బ్యానర్లోను ... అటు బయట బ్యానర్లలోను వరుసగా చేస్తూ పాతిక సినిమాల దాకా చేసారు . అయితే  ఈ మధ్యకాలంలో సరైన హిట్ పడలేదు. 'రంగబలి' తరువాత ఆయన సినిమాలకి సంబంధించిన అప్ డేట్స్ రావడం లేదు. అయితే తాజాగా నాగశౌర్య తన సినిమాల గురించి కాకుండా వివాదంలో ఉన్న దర్శన్ గురించి మాట్లాడి హాట్ టాపిక్ అయ్యారు. 

28


దర్శన్ (Darshan) అభిమాని రేణుకస్వామి (Renukaswamy) హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయాలు తెలిసి ఒక్కొక్కరు షాక్ అవుతున్నారు.  ఇవి విన్నవారంతా దర్శన్ ఇంత క్రూరుడా...మరీ ఇంత దారుణమా? అంటూ దర్శన్‌ని అసహ్యించుకుంటున్నారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ‌తోపాటు మొత్తం 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. 

38


గత కొద్దికాలంగా జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న దర్శన్, పవిత్ర, ఇతరులను విచారించగా వారు చేసిన అకృత్యాలు బయటపడి కన్నడ చిత్ర పరిశ్రమను మాత్రమే కాకుండా అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో దర్శన్ కు సపోర్ట్ గా ముందుకు రావటానికి ఎవరూ ధైర్యం చేయటం లేదు. కానీ మన తెలుగు హీరో నాగ శౌర్య మాత్రం ఆ సాహసం చేసారు. దర్శన్ కు సపోర్ట్ చేస్తూ  ఓ ఇనిస్ట్రా పోస్ట్ పెట్టారు.   నాగశౌర్య మాత్రం నేరుగా దర్శన్  కి అండగా ఉంటానంటూ ఇన్స్టాలో పోస్ట్ చేయడం సంచలనం క్రియేట్ చేసింది.. 

48


రేణుక స్వామి శరీరం మైసూరు ప్రాంతంలో దొరికినప్పుడు ముందుగా అది ఆత్మహత్య అనుకున్నారు, కానీ కొంచెం లోతుగా పరిశోధనలు చేసిన తరువాత, అది హత్య అని తేలింది. దీనికి సంబంధించి పోలీసులు సుమారు 23 మందిని అరెస్టు చేసి విచారణ చెయ్యగా, అందరూ దర్శన్ వైపే వేలెత్తి చూపారు. దర్శన్ ఈ హత్యకి పురమాయించాడని, అందుకే చెయ్యాల్సి వచ్చిందని అరెస్టయిన వారు చెప్పారు.  

58

రేణుకస్వామి అదృశ్యంపై అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కొందరిని అరెస్ట్ చేసి విచారించగా.. దర్శన్, పవిత్ర పేర్లు బయటకు వచ్చాయి. ఆ వ్యవహారంలో వారిని అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. వారు రేణుకస్వామిని తీసుకొచ్చి ఎంత దారుణంగా హింసించారనే విషయం బయటకు వచ్చింది.‌ శాఖాహారం మాత్రమే తీసుకొనే రేణుకా స్వామి నోట్లో మాంసం ఎముక పెట్టి కొట్టారు. మాంసం తింటే నీకు దెబ్బలను ఓర్చుకొనే శక్తి వస్తుందని శారీరకంగా హింసించారు. చర్మం చిట్లిపోయి ఊడిపోయే విధంగా కొట్టారు. దాంతో అతడు మరణించాడు అనే విషయం విచారణలో వెలుగు చూసింది. తాజాగా రేణుకా స్వామి డెడ్ బాడీ ఫోటోలు సోషల్ మీడియాలో  ద్వారా బయిటకు వచ్చాయి.

68
Pavithra Gowda Darshan

Pavithra Gowda Darshan


ఆ ఫోటోలను, అందులో రేణుకస్వామిని హింసించిన విధానాన్ని చూసిన నెటిజన్లు, పబ్లిక్.. ఇలాంటి దారుణమైన సంఘటనకు బాధ్యుడైన దర్శన్, పవిత్రగౌడ, ఇతరలను ఏ మాత్రం వదిలిపెట్టకూడదని, సభ్య సమాజం తలవంచుకొనేలా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. దర్శన్ అభిమాని రేణుకస్వామి భార్య ప్రస్తుతం గర్భిణీ కాగా.. భర్త మరణంతో ఆమె దిక్కుతోచని స్థితిలో ఉందని కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

78
Pavithra Gowda Darshan

Pavithra Gowda Darshan

నాగ శౌర్య ఈ విషయమై ఇనిస్ట్రాలో స్పందిస్తూ  ..'ఈ సంఘటనలో బాధితుడి కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. ఈ కష్టకాలంలో దేవుడు వారికి గుండెనిబ్బరం ఇవ్వాలని కోరుకుంటున్నా.. అయితే ఈ విషయం మీద జనాలు స్పందిస్తున్న తీరు నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. దర్శన్ అన్న కలలో కూడా ఎప్పుడూ ఇలాంటి పనులు చేసే మనిషి కాదు.. దర్శన్ అన్న గురించి తెలిసిన వారికి, ఆయన ఏంటో తెలిసే ఉంటుంది. వీలైతే తనకు చేతనైనంత సాయం చేసేందుకే దర్శన్ అన్న ముందుంటాడు. ఎంతో మందికి ఆయనే ఆధారం కూడా.. దీన్ని నిజం అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మన న్యాయ వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నిజం బయటికి వస్తుందని ఆశిస్తున్నాను..

88
Pavithra Gowda Darshan

Pavithra Gowda Darshan


బాధితుడి కుటుంబంతో పాటు మరో కుటుంబం కూడా ఈ వార్తల వల్ల ఇబ్బంది పడుతోందని అర్థం చేసుకోవాలి. వారికి ఈ కష్టకాలంలో కాస్త ఏకాంత సమయం, మనోధైర్యం అవసరం. అన్న దయా గుణం గురించి నాకు బాగా తెలుసు. అందుకే ఆయన నిర్దోషిగా బయటికి వస్తాడని, నిజమైన దోషులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నా..' అంటూ పోస్ట్ చేశాడు నాగశౌర్య.. దర్శన్ చేసిన పనిని అందరూ అసహ్యించుకుంటున్న ఇలాంటి సమయంలో దర్శన్  కి సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేసి, నాగశౌర్య చాలా పెద్ద సాహసమే చేసాడంటున్నారు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక కంటే ముందు కలసి నటించి పెళ్లి చేసుకున్న 6 జంటలు వీళ్ళే.. క్రేజీ ఫోటోస్
Recommended image2
Beach Club: ముంబైలో శిల్పా శెట్టి ఫస్ట్ బీచ్ క్లబ్.. 6 అద్భుతమైన ఫోటోలు
Recommended image3
వెంకటేష్ తో చేతులు కలిపిన నందమూరి హీరో.. క్రేజీ మల్టీస్టారర్ ప్రకటించిన అనిల్ రావిపూడి, రిలీజ్ డేట్ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved