#SSMB29:మహేష్ , రాజమౌళి చిత్రం షూట్ మరో ఆరు నెలలు లేటు?కారణం ఇదే?
భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Mahesh Babu and Rajamouli
మహేశ్‌బాబు (Mahesh Babu)హీరోగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ జిమ్ కు వెళ్లి కష్టపడి తనను తాను మొత్తం మార్చుకుంటున్నారు. అంతేకాకుండా ఈ లోగా తన ఫ్యామిలీని తీసుకుని మహేష్ ఫారిన్ హాలిడే ట్రిప్ సైతం వేసేసారు. అయితే మహేష్ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. ఎందుకు లేటవుతోంది. ఎప్పటినుంచి మొదలవుతుందో చూద్దాం.
Sequel Buzz: Vijayendra Prasad Teases Exciting Possibilities for Mahesh-Rajamouli Film
వాస్తవానికి జూన్ నుంచి షూటింగ్ మొదలు అయ్యేలా ప్లాన్ చేసారు. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. లొకేషన్ హంట్ బాగా లేటైందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగస్ట్ లేదా సెప్టెంబర్ కు షూట్ మొదలెడతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు డిసెంబర్ వరకూ షూట్ వాయిదా పడిందని తెలుస్తోంది. డిసెంబర్ రెండవ వారంలో ఈ చిత్రం షూట్ ని రాజమౌళి కూల్ గా మొదలు పెట్టనున్నారట. అదీ కాకపోతే కొత్త సంవత్సరంలోనే. అయితే ఎందుకు లేటు అవుతోంది. ప్లాన్స్ ఎందుకు తారు మారు అయ్యాయి.
Mahesh,rajamouli
ప్రస్తుతం రాజమౌళి స్క్రిప్టు లాక్ చేసి లొకేషన్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. అలాగే మహేష్ బాబు రెండు పెద్ద వర్క్ షాప్ లకు హాజరు కానున్నారు. అవి రెండు నెలలు పైగానే పడతాయంటున్నారు. ఈ వర్క్ షాప్ లో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ నుంచి మొత్తం మార్చి ప్రాక్టీస్ చేయస్తారని తెలుస్తోంది. మహేష్ ..వర్క్ షాప్ లకు హాజరు కావటం అనేది ఇదే తొలి సారి అంటున్నారు. దాంతో ఆయన కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారట.
ఇందులో భాగంగానే చిత్ర టీమ్ కొన్నిరోజుల క్రితం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని తాజాగా వీరందరూ హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మహేశ్‌బాబు-రాజమౌళిని ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పొడవాటి జుట్టు, గడ్డంతో మహేశ్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించారు. లుక్ టెస్ట్‌లో భాగంగానే ఈ చిత్ర టీమ్ దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం.
`ఆర్‌ఆర్‌ఆర్`తో మెప్పించిన రాజమౌళి ఇప్పుడు మహేష్‌బాబుతో సినిమా పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇటీవలే మహేష్‌తో కథా చర్చలు జరిపారు రాజమౌళి. నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి షూటింగ్ స్టార్ట్ చేయడమే మిగిలింది. ఏదేమైనా ఈ చిత్రం ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ ప్రారంభమవుతుందని తెలుస్తుంది.
మహేష్-రాజమౌళితో సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు జక్కన్ననే చెబుతూ వచ్చారు. కానీ మహేష్ ఒక్కసారి కూడా స్పందించలేదు. అంటే రాజమౌళి ఇంకా మహేష్‌కి కంప్లీట్ స్టోరీని వినిపించలేదని తెలుస్తుంది. అయితే ఇటీవల వీరిద్దరు విదేశాలకు టూర్ వెళ్లారు. అక్కడ కథా చర్చలు జరిగాయని సమాచారం. ఒకవేళ రాజమౌళి ఈ ఈవెంట్‌కి వస్తే దాని సారాంశం రాబోతుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మహేష్ సినిమా ఈ ఏడాది ఎండింగ్‌లో ప్రారంభమవుతుందని గతంలో రాజమౌళి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దాని అప్‌డేట్ కోసం అభిమానులే కాకుండా, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తికరంగా వేచి చూస్తున్నాయి.
భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెండితెరపై సరికొత్త లుక్‌లో మహేశ్ కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు. మహేశ్‌కు సంబంధించి మొత్తం ఎనిమిది లుక్స్‌ను జక్కన్న టీమ్ రెడీ చేసినట్లు టాక్.
అలాగే ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ ని వదలకపోవటానికి కారణం ఈ సినిమా ఇప్పుడిప్పుడే పూర్తి కాదు. ఇప్పుడు వరకు ఉన్న ప్లానింగ్ ప్రకారం అయితే 2026లో విడుదల అవుతుంది. అయితే రాజమౌళి సినిమాలు ముందు ప్లాన్ చేసిన టైమ్ కు రావడం చూడటం అరుదు. కాబట్టి ఇప్పటినుంచి పబ్లిసిటీ ఎందుకనేది కూడా ఓ కారణం అంటున్నారు.
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే మొదలై శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం మల్టిఫుల్ సెట్స్ హైదరాబాద్ లో వేస్తున్నారు. అలాగే ఈ సినిమా కోసం క్రూ మొత్తాన్ని రాజమౌళి సెట్ చేసారని అంటున్నారు. అలాగే ఈ చిత్రం భారీ బడ్జెట్ కావటంతో వేరే నిర్మాతలు కూడా ఇన్వాన్వ్ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది.
ఈ చిత్రానికి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. చాలా ఏళ్ల క్రితం ఆయనకు రాజమౌళి- మహేశ్ మాట ఇచ్చారు. దానిని ఈ సినిమాతో నిలిబెట్టుకుంటున్నట్లు సమాచారం. అడ్వేంచర్ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలా ఈ ప్రాజెక్టులోకి సహ నిర్మాతగా Netflix చేసేందుకు డీల్ జరుగుతోందని అంటున్నారు. అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు.
మహేష్ బావ హీరో సుధీర్ బాబు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... మహేష్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎట్ లీస్ట్ త్రీ ఇయర్స్ పట్టొచ్చు. ఆ స్పేస్ నేను పూర్తి చేస్తానని చెప్పడం లేదు. అది ఏ హీరో వల్ల సాధ్యం కాదు. మహేష్ సినిమా ఫుల్ బాటిల్ కిక్ ఇస్తుంది అన్నారు. ఈ మాటలు విన్న మహేష్ అభిమానులు ఫుల్ బాటిల్ కిక్ ఆల్రెడీ వచ్చేసిందంటున్నారు.
MAHESH, RAJAMOULI
మహేశ్‌బాబు మాట్లాడుతూ...‘ఆయనతో పనిచేయాలన్న కల సాకారం కాబోతోంది. రాజమౌళితో ఒక సినిమా చేస్తే, 25 సినిమాలు చేసినట్టే. ఈ ప్రాజెక్టు విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నా. ఇది పాన్ ఇండియా మూవీ అవుతుంది. జాతీయ స్థాయిలో సరిహద్దులను ఈ చిత్రం చెరిపేస్తుంది’’ అని అన్నారు.
MAHESH, RAJAMOULI
ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇందుకు కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో నిధి వేట ఇతివృత్తంగా ఒక కథ సిద్ధం చేయగా, జేమ్స్‌బాండ్ తరహాలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంది.