MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Entertainment
  • ‘బ్రో’లిమిటెడ్ రిలీజ్..ఫస్ట్ డే రికార్డ్ లకు దెబ్బ ?షాకింగ్ రీజన్

‘బ్రో’లిమిటెడ్ రిలీజ్..ఫస్ట్ డే రికార్డ్ లకు దెబ్బ ?షాకింగ్ రీజన్

పవన్‌కళ్యాణ్‌, హీరో సాయిధరమ్‌ తేజ్‌ కలయికలో రాబోతున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకుడు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Surya Prakash | Published : Jul 27 2023, 08:33 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
111
Asianet Image

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు  సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Varrier) హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రం రిలీజ్ కు రెడీ గా ఉంది.  జులై 28న సినిమా విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర టీమ్  ప్రచారంలో బిజీగా ఉంది. అయితే  ఈ చిత్రం మిగతా పెద్ద హీరోల సినిమాలతో పోలిస్తే లిమిటెడ్ రిలీజ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కాకుండా, ఓవర్ సీస్ లోనూ అదే పరిస్దితి. ఎందుకనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

211
Asianet Image


ముఖ్యంగా మల్టిప్లెక్స్ లలో లిమిటెడ్ షోలు ఉన్నాయనేది గమనార్హం. అందుకు కారణం మూడు పెద్ద హాలీవుడ్ సినిమాలు థియేటర్ లో ఉండటమే. Oppenheimer, Barbie, Mission impossible 7 ఈ మూడు చిత్రాలు మంచి ఆక్యుపెన్సీతో నడుస్తూండటంతో మల్టిప్లెక్స్ లలో కంటిన్యూ షోలు ఉన్నాయి. 

311
Asianet Image


మరో ప్రక్క చిన్న సినిమా గా వచ్చి పెద్ద సక్సెస్ అయిన బేబి సైతం స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. లాభాలు వచ్చే ఆ సినిమాని తీయటానికి థియేటర్స్ వాళ్ళు ఇష్టపడటం లేదు. ఈ నేపధ్యంలో మల్లిప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ లు మిగతా సినిమాలతో కలిసి బ్రో చిత్రం షేర్ చేసుకోవాల్సి వస్తోంది. ఓవర్ సీస్ లోనూ హాలీవుడ్ సినిమాలే మేజర్ థియేటర్స్ ని ఆక్యుపై చేసేసాయి. అందుకే భారీ రిలీజ్ ఉండటం లేదు. 

411
Asianet Image

అలాగే  తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ షోలు కానీ టిక్కెట్ హైక్ గానీ లేదు. దాంతో ఫస్ట్ డే కలెక్షన్స్ ...రికార్డ్ లు బ్రద్దలు కొట్టేస్దాయిలో ఉంటాయా అనేది సందేహమే అంటోంది ట్రేడ్. ఏదైమైనా ఇది పవన్ కళ్యాణ్ సినిమా అనేది మర్చిపోకూడదు. 
 

511
Asianet Image


వాస్తవానికి ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే అభిమానులు అంటే ముందుగా గుర్తోచ్చేది పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్సే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్‌ ప్రపంచమంతటా పవన్‌కు అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా రిలీజ్ అంటే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. భారీ కటౌట్‌లు, ఫ్లెక్స్‌లతో థియేటర్‌లు నిండిపోతుంటాయి. 

611
Asianet Image


  తాజాగా అమెరికాలో పవన్‌ ఫ్యాన్స్‌ బ్రో సినిమా రిలీజ్‌ సందర్భంగా సందడి చేస్తున్నారు. టెస్లా కార్లతో బ్రో సినిమా టైటిల్‌ లైట్‌ షో ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌ చల్‌ చేస్తుంది. యూఎస్‌ఏలో మూడు చోట్ల ఈవెంట్ జరిగినట్లు చిత్రయూనిట్‌ పేర్కొంది. మరి ఇలాంటి సమయంలో లిమిటెడ్ రిలీజ్ అనేది ఆశ్చర్యమే.

711
Bro Movie

Bro Movie


పీపుల్ మీడియా బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిధరమ్‌కు జోడీగా కేతిక శర్మ నటిస్తుంది. ట్రేడ్‌ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవరాల్‌ బిజినెస్‌ వంద కోట్లు దాటిందని తెలుస్తుంది. ఒక్క ఆంధ్ర ఏరియాలోనే దాదాపు రూ.50 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జరుగిందని చెప్తున్నారు.

811
#Bro

#Bro

ఇక ఓవర్సీస్‌లో రూ.13 కోట్లు డీలింగ్ ఇప్పటికే ఫిక్సయిపోయింది. నైజాం సహా మిగిలిన ఏరియాలు అన్ని కలుపుకుని మొత్తంగా వంద కోట్ల నెంబర్‌ అయితే దాటిందని. ఒక రీమేక్‌ సినిమాకు ఈ రేంజ్‌లో బిజినెస్‌ జరుగుతుందంటే పవన్‌ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని ఫ్యాన్స్ అంటున్నారు. 

911
Asianet Image

‘మా గురువు బాలచందర్‌తో కలిసి 2004లో ఒక డ్రామా చూశాను. ఆ డ్రామాను స్ఫూర్తిగా తీసుకుని 17 ఏళ్ల తరువాత ‘వినోదయ సిత్తం’ పేరుతో సినిమాగా తీశాను. సమాజానికి మనం మంచి సందేశం ఇవ్వాలని అనుకుంటే సమాజం మనకి మంచి చేస్తుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది’ అన్నారు నటుడు, దర్శకుడు పి. సముద్ర ఖని. 
 

1011
Asianet Image


ఈ కథను పవన్‌కల్యాణ్‌కు వినిపించాక,మూడు రోజులకే షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. దర్శకుడిగా నేను ఎంతో క్లారిటీగా వున్నాను అనేది ఆయనకు మొదటిరోజే అర్థమైంది. ఆయన ఈ సినిమా కోసం సమయం వృథా చేయకూడదని సెట్‌లోనే కాస్ట్యూమ్స్‌ మార్చుకున్నారు. షూటింగ్‌ జరిగినన్ని రోజులు ఉపవాసం చేశారు. ఎంతో నిష్టతో పనిచేశారు. 53 రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశాం. కానీ విజువల్స్‌ చూస్తే 150 రోజులు షూట్‌ చేసిన సినిమాలా వుంటుంది. ఇప్పటి దాకా నేను చేసిన సినిమాల్లో ఇదే నాబెస్ట్‌ మూవీ

1111
Asianet Image


మాతృకలోని ఆత్మని తీసుకుని పవన్‌కల్యాణ్‌ స్టార్‌డమ్‌కు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాం. మాతృక కంటే గొప్పగా వచ్చింది. త్రివిక్రమ్‌ సపోర్ట్‌తో ఈ సినిమా చేశాను. ఇక్కడ నేటివిటికి మీద ఆయనకున్న పట్టు చాలా గొప్పది. నేను ఈ సినిమా చేయడానికి కారణం త్రివిక్రమ్‌. ఈ కథను ఎక్కువ మందికి చేరువ కావాలని, అందుకే పవన్‌ కళ్యాణ్‌తో ఈ సినిమా తీస్తే బాగుంటుందని ఆయనే చెప్పారు. కాలమే త్రివిక్రమ్‌ను,కళ్యాణ్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చింది. 

Surya Prakash
About the Author
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా. Read More...
పవన్ కళ్యాణ్
 
Recommended Stories
Top Stories