- Home
- Entertainment
- థియేటర్లు ఇంకా హౌస్ ఫుల్స్.. కాంతార చాప్టర్ 1 ఇంత త్వరగా ఓటీటీలోకి ఎందుకు ? కారణం ఇదే
థియేటర్లు ఇంకా హౌస్ ఫుల్స్.. కాంతార చాప్టర్ 1 ఇంత త్వరగా ఓటీటీలోకి ఎందుకు ? కారణం ఇదే
థియేటర్లలో భారీ విజయం సాధించిన కాంతార చాప్టర్ 1 సినిమా, విడుదలైన 29వ రోజే ఓటీటీలోకి వస్తోంది. దీని వెనుక ఓ ముఖ్యమైన కారణం ఉంది. ఇప్పటికీ థియేటర్స్ లో బాగా రాణిస్తున్న ఈ చిత్రం ఓటీటీలో ఎందుకు రిలీజ్ అవుతుందో ఈ కథనంలో తెలుసుకోండి.

కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్
నిర్మాతలకు ఓటీటీ హక్కులు అదనపు ఆదాయ మార్గం. థియేటర్లలో సరిగా ఆడని సినిమాలకు ఓటీటీ డీల్ బాగా ఉపయోగపడుతుంది. కానీ, బాగా ఆడే సినిమాల ఓటీటీ విడుదలను వీలైనంత ఆలస్యం చేయాలనుకుంటారు. బాలీవుడ్‌లో 8 వారాల గ్యాప్ ఉంటే, సౌత్‌లో 4 వారాలే. ఈ మధ్య కొన్ని సినిమాలు 8 వారాల గ్యాప్ తీసుకుంటున్నాయి.
ప్రైమ్ వీడియోలో కాంతార చాప్టర్ 1
'కాంతార చాప్టర్ 1' ఓటీటీ విడుదలపై పెద్ద చర్చే జరుగుతోంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం కనీసం నెలరోజులు కూడా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోకుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అక్టోబర్ 31న నుంచి సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇంత పెద్ద హిట్ సినిమా ఇంత త్వరగా ఓటీటీలోకి రావడానికి ఓ కారణం ఉంది. .
కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
ఈ సినిమా 28 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹821.5 కోట్లు వసూలు చేసింది. ఇంకా మంచి వసూళ్లు రాబట్టే సినిమా ఓటీటీ ప్రకటన షాకిచ్చింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లు రేపు (అక్టోబర్ 31) అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతాయి. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది.
మూడేళ్ళ క్రితమే ఒప్పందం
హిందీ వెర్షన్ 8 వారాల తర్వాతే వస్తుంది. ఇది నిర్మాతలు కోరుకున్నది కాదు, తప్పనిసరి పరిస్థితి. మూడేళ్ల క్రితం చేసుకున్న ఓటీటీ ఒప్పందమే కారణం. అందుకే 29వ రోజే ఓటీటీలోకి వస్తోంది. సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అప్పుడు ఊహించలేదు. ఓటీటీ విడుదల తర్వాత కూడా వసూళ్లు తగ్గవని నిర్మాతల నమ్మకం.