MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సివియర్‌ గ్యాస్ట్రిటిస్ తో అల్లు అర్జున్ ఇబ్బందిపడుతున్నారు

సివియర్‌ గ్యాస్ట్రిటిస్ తో అల్లు అర్జున్ ఇబ్బందిపడుతున్నారు

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి నటించిన 'తండేల్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ హాజరు కాలేకపోవడానికి గల కారణాన్ని అల్లు అరవింద్ వివరించారు. బన్నీకి అనారోగ్యం కారణంగా ఈవెంట్‌కు దూరంగా ఉన్నట్లు తెలిపారు.

2 Min read
Author : Surya Prakash
Published : Feb 03 2025, 08:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13


‘తండేల్ జాతర ఈవెంట్‌కి బన్నీ గెస్టుగా రావాల్సి ఉంది. కానీ ఫారెన్ నుంచి వచ్చాడు. చాలా సివియర్‌గా గ్యాస్ట్రిటిస్ వచ్చింది.. అందుకే రాలేకపోయాడు.. మీ అందరికీ ఈ విషయం చెప్పమన్నాడు.. దయచేసి ఎవరూ అపార్థం చేసుకోకండి’ అని అల్లు అరవింద్ చెప్పారు.  

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్‌’. చందు మొండేటి దర్శకుడు. ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఆదివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23


 తండేల్ జాతర ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నాడని చిత్ర టీమ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానులు కూడా తండేల్ ఈవెంట్ పై బాగా ఆసక్తి చూపించారు.

పుష్ప 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ వస్తున్న తొలి మూవీ ఈవెంట్ కావడంతో బన్నీ ఏం మాట్లాడుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే చివరి నిమిషంలో తండేల్ జాతర నుంచి తప్పుకున్నాడు బన్నీ. దీనికి గల కారణాన్ని నిర్మాత అల్లు అరవింద్ వివరించారు.
 

33
Allu Arjun

Allu Arjun


అరవింద్ మాట్లాడుతూ.. ‘తండేల్‌’ సినిమా చాలా గొప్పగా ఉంటుంది. ఏడో తారీఖున అందరూ థియేటర్లకు రండి. దుల్లగొట్టేద్దాం. సినిమా గురించి చాలా మాట్లాడనుకున్నాను. సక్సెస్‌ మీట్‌లో మాట్లాడతాను’ అని అల్లు అరవింద్‌ తెలిపారు.  

నాగచైతన్య మాట్లాడుతూ ‘నా మనసులో గీతా ఆర్ట్స్‌కు ప్రతే ్యక స్థానం ఉంది. ఈసినిమా పూర్తయ్యే సమయానికి వాసు, అరవింద్‌ గారు లేకుండా మరో సినిమా ఎలా చేయాలా అనే భయం నాలో మొదలైంది. వారు అంతలా సపోర్ట్‌ చేశారు. నా మంచి కోరే వ్యక్తి చందు. సినిమాలో శ్రీకాకుళం యాసలో మాట్లాడడం సవాల్‌గా అనిపించింది. సాయిపల్లవి వ్యక్తిత్వం గొప్పది. తండేల్‌ సినిమా కోసం మత్స్యకార గ్రామాలకు వెళ్లి అధ్యయనం చేశాను. వాళ్లు లేకుండా ‘తండేల్‌’ సినిమా లేదు. థియేటర్స్‌లో దుల్లగొట్టేద్దాం’ అన్నారు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Apple Box: సినిమాల్లో పొట్టి హీరోలు పొడుగ్గా కనిపించడానికి ఏం చేస్తారో తెలుసా? ప్రభాస్ కు ఎదురైన వింత పరిస్థితి ఏంటంటే?
Recommended image2
Anirudh Kavya Marriage: అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి నిజమేనా? ఈ ఏడాదిలోనే ఒక్కటవ్వబోతున్నారా?
Recommended image3
Rakul Preet Singh: 7 దేశీ లుక్స్‌లో అదరగొట్టిన రకుల్.. అచ్చమైన ఇండియన్ బ్యూటీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved