జాన్వీ కపూర్ ఫోన్ స్క్రీన్ పై ఎవరి ఫోటో ఉంటుందో తెలుసా..? లైవ్ లో దొరికేసిందిగా..?
జాన్వీ కపూర్ తన ఫోన్ స్క్రీన్ పై ఎవరి ఫోటో పెట్టుకుంటుందో తెలుసా..? ఎవరై ఉంటారని అనుకుంటారు. ఇదిగో లైవ్ లో చూసిన నిజం.. అందరు షాక్ అవుతారు. ఇంతకీ ఆమె ఫోన్ లో ఎవరి ఫోటో ఉంది..?

సోషల్ మీడియా వచ్చిన తరువాత సామాన్యులకు.. సెలబ్రిటీలకు దూరం తగ్గిపోయింది. నెట్టింట్లో ఏమున్నా తమ భావాలు వ్యక్తం చేసుకుంటున్నారు. తిట్టాలన్నా.. పొగడాలన్నా.. సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాదు సెలబ్రిటీల పర్సనల్ విషయాలు.. పంచుకోవడం కోసం కూడా సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది. తాజాగా జాన్వీ కపూర్ కు సంభందించిన ఓ విషయం వైరల్ అవుతోంది.
సెలబ్రిటీస్ కి సంబంధించిన కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ లు జనాలు తెలుసుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా జాన్వీ కపూర్ లాంటి గ్లామర్ క్వీన్... గురించి నెట్టింట్లో ఎటువంటి అప్ డేట్ వచ్చినా.. అది వైరల్ అవుతుంది. ప్రస్తుతం అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే.. హీరోయిన్ జాన్వి కపూర్ మొబైల్ ఫోన్ స్క్రీన్ పై ఎవరిఫోటో పెట్టుకుంటుంది. రీసెంట్ గా ఆమె ఫోన్ లాక్ స్క్రీన్ ఫోటో వైరల్ గా మారింది. ఇంతకీ జాన్వి కపూర్ ఫోన్ లో ఎవరి ఫోటో ఉందో తెలుసా.. ఆమె లాక్ స్క్రీన్ పై.. శ్రీదేవి జాన్వి కపూర్ ను చిన్నప్పుడు ఎత్తుకుని కూర్చో బెట్టుకున్న ఫోటో ఉంది . దీంతో జాన్వీ కపూర్ కి తల్లి అంటే ఎంత ప్రేమ అనేది వైరల్ గా మారింది .
శ్రీదేవి చాలా చిన్న ఏజ్ లోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. తన కూతుళ్ళను స్టార్ హీరోయిన్లు గా చూడాలని అనుకుంది శ్రీదేవి. ముఖ్యంగా జాన్వీ కపూర్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న టైమ్ లోనే.. అనుమానాస్పద రీతిలో శ్రీదేవి మరణించింది. ఇప్పుడు జాన్వీ ఇంత పెద్ద హీరోయిన్ అయినా కూడా.. తన తల్లి చూడటానికి లేదు. అందుకే ఆమె ఎప్పుడూ.. తనతోనే ఉండేలా.. ఫోన్ స్క్రీన్ పై శ్రీదేవి ఫోటో పెట్టుకుంది జాన్వీ.
శ్రీదేవి ముద్దుల కూతురుగా జాన్వీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకుంది. బాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా.. మంచి మంచి కాన్సెప్ట్ లు తీసుకుని సినిమాలు చేస్తోంది. ఇక తాజాగా తెలుగులో దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది . అంతేకాదు రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోనూ జాన్వి కపూర్ నటిస్తుందటూ ప్రకటన వచ్చేసింది.
తమిళనాట పుట్టి.. తెలుగు లో స్టార్ హీరోయిన్ గా మారి.. బాలీవుడ్ గుమ్మంలో అడుగుపెట్టి.. బీటౌన్ మహారానిగా.. అతిలోక సుందరిగా పేరు తెచ్చుకుంది శ్రీదేవి. కాగా ఓ పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడ హోటల్ రూమ్ లోని బాత్ టబ్ లో కాలుజారి పడిపోయి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది . ఇప్పటికి ఆమ మరణం పై రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి .