- Home
- Entertainment
- చిరు, పవన్, చరణ్, బన్నీ... మెగా హీరోల్లో నంబర్ వన్ ఎవరు? సమీకరణాలు మార్చేసిన అల్లు అర్జున్!
చిరు, పవన్, చరణ్, బన్నీ... మెగా హీరోల్లో నంబర్ వన్ ఎవరు? సమీకరణాలు మార్చేసిన అల్లు అర్జున్!
టాలీవుడ్ ని ఏలేస్తున్నారు మెగా హీరోలు. ఒక్కడిగా వచ్చిన చిరంజీవి ఓ సామ్రాజ్యం ఏర్పాటు చేశాడు. తాను ఎదగడమే కాకుండా తన ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతి ఒక్క హీరోకి ఊతం ఇచ్చాడు. టాలెంట్ లో కొంచెం అటూ ఇటూ అయినా దగ్గరుండి వాళ్ళ ఎదుగుదలకు పాటుపడ్డారు.

ఎన్టీఆర్(NTR), ఏఎన్నార్ లాంటి ఉద్దండులు రిటైర్మెంట్ ఏజ్ కి చేరుకోగా వాళ్ళ స్థానం భర్తీ చేస్తూ ఎదిగాడు చిరంజీవి. ఆయనకు పరిశ్రమలో ఎటువంటి సప్పోర్ట్ లేదు . స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి అప్పటి వరకు ఉన్న స్టార్స్ లో లేని టాలెంట్స్ పరిచయం చేశాడు. ముఖ్యంగా చిరంజీవి డాన్స్ ఆయనకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. అప్పటి వరకు ఉన్న హీరోలలో ప్రొఫెషనల్ డాన్సర్ లేరు.
చిరంజీవి (Chiranjeevi)డాన్స్ స్టైల్, స్టెప్స్ అప్పటి ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచాయి. వరుస బ్లాక్ బస్టర్స్ తో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హోదా దక్కించుకున్నారు. ఆయన తర్వాత బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ స్టార్స్ హోదా దక్కించుకున్నారు. అయితే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన చిరంజీవి ప్రత్యేకంగా నిలిచాడు.
ఇక చిరంజీవి తర్వాత హీరోగా ఆయన తమ్ముడు నాగబాబు ఎదిగే ప్రయత్నం చేశారు. కానీ నాగబాబు పూర్తిగా విఫలం అయ్యారు. దీంతో చిరంజీవి రెండో తమ్ముడు పవన్(Pawan Kalyan) రంగంలోకి దిగాడు. పవన్ రావడంతోనే పక్కా ప్లాన్ తో ఎంట్రీ ఇచ్చాడు. అన్న చిరు పేరు ఇమేజ్ వాడుకుంటూనే... తనను ఓ దేశభక్తుడిగా, సామాజికవాదిగా చిత్రీకరించుకునేవాడు.
సినిమా సబ్జక్ట్స్ లో సామాజిక స్పృహ లేకున్నప్పటికీ పాటల్లో ప్రదర్శించేవాడు. చేగువేరా, భగత్ సింగ్ ,చంద్ర బోస్ వంటి రెబల్ లీడర్స్ ఫోటోలు తన సినిమా పాటల్లో ఉండేలా చూసుకునేవాడు. వాళ్ళ మాదిరి గెటప్స్ ధరించి పాటల్లో హల్చల్ చేసేవాడు.
దర్శకుల ప్రమేయం లేకుండా పవన్ చేసిన ఈ ప్రయత్నాలు ఫలించాయి. అనుకోకుండానే పవన్ కి దేశభక్తుడు అనే ఇమేజ్ ఈ తరహా ప్రయోగాలు తెచ్చిపెట్టాయి. అలాగే స్వయంవరం, బద్రి, ఖుషి చిత్రాల విజయాలు ఆయనకు భారీ ఇమేజ్ తీసుకొచ్చాయి. చిరంజీవి తర్వాత ఇండస్ట్రీలో ఆధిపత్యం చలాయించగల హీరో పవన్ కళ్యాణ్ అనే నమ్మకం మెగా ఫ్యాన్స్ కి కలిగింది.
డాన్స్, డైలాగ్స్, నటన విషయంలో చిరంజీవి ఎక్కడో ఉన్నారు. చిరంజీవికి ఉన్న టాలెంట్ లో పవన్ కి పది శాతం కూడా ఉండదు. ఇది స్వయంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న వాస్తవం. కానీ ఆయన చిరంజీవి కంటే కూడా పెద్ద హీరోగా ఎదిగారు. ప్రస్తుత చిరంజీవి మార్కెట్ తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ మార్కెట్ చాలా ఎక్కువ. చిరంజీవి తమ్ముడిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ఆయన్నే దాటేశాడు.
చిరంజీవి కొడుకు రామ్ చరణ్ (Ram Charan) మగధీర, రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నా పవన్ రేంజ్ కి చేరుకోలేకపోయారు. పవన్ ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే చివరకు చిరు మీద కూడా తిరగబడతారు. పవన్ తమ దేవుడు.. ఆయన తర్వాతే ఎవరైనా అంటారు.
అయితే పవన్ ఇమేజ్ కి అల్లు అర్జున్ గండికొట్టారు. ఇప్పుడు మెగా హీరోల్లో నంబర్ వన్ హీరో ఎవరంటే అల్లు అర్జున్. గత రెండు చిత్రాలు అల్లు అర్జున్ ఇమేజ్ ఎక్కడికో తీసుకెళ్లాయి. అల వైకుంఠపురంలో మూవీతో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్(Allu Arjun).. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా అవతరించారు.
పుష్ప (Pushpa) అన్ని భాషల్లో కలిపి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా హిందీ వర్షన్ రూ. 81 కోట్ల గ్రాస్ రాబట్టి అబ్బురపరిచింది. పవన్ బాలీవుడ్ లో ఇక జెండా పాతినట్టే. ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుండి పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ అవతరించినట్లే.
తనలోని లోపాలు సరిచుకొని నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటూ అల్లు అర్జున్ ఈ స్తాయికి చేరాడు. నిన్నటి వరకు మెగా హీరోలలో పవన్ కళ్యాణ్ నంబర్ వన్. కానీ ఇప్పుడు అల్లు అర్జున్. పుష్ప మూవీతో అల్లు అర్జున్ సమీకరణాలు మార్చేశాడు. మెగా హీరోలలో ఎవరూ ఆయన సెట్ చేసిన రికార్డ్స్ టచ్ చేయలేరు.
కానీ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం. అయితే అందులో ఆయన సోలో హీరో కాదు. అదే సమయంలో రికార్డ్స్ లో క్రెడిట్ మొత్తం రాజమౌళిదే. ఇక నిన్నటి వరకు మెగా హీరోలలో టాప్ పొజిషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ మూవీతో ఈ రికార్డ్స్ బ్రేక్ చేయలేరు. అయితే హరిహర వీరమల్లు పాన్ ఇండియా స్థాయిలో విడులవుతుండగా పాజిటివ్ టాక్ దక్కిన నేపథ్యంలో పుష్పను బ్రేక్ చేయవచ్చు. ప్రస్తుతానికి మాత్రం మెగా హీరోల నుండి అల్లు అర్జున్ నంబర్ వన్ గా రికార్డులకి ఎక్కారు.