MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రంభ ముందు డాన్సర్‌గా పరిచయమై.. ఇప్పుడు పాన్‌ ఇండియా బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా?

రంభ ముందు డాన్సర్‌గా పరిచయమై.. ఇప్పుడు పాన్‌ ఇండియా బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా?

Rambha-Sai Pallavi: హీరోయిన్‌ రంభ అంటే ఒకప్పుడు డాన్స్ సెన్సేషన్‌, గ్లామర్‌ సెన్సేషన్‌. అలాంటి రంభ ముందు ఓ అమ్మాయి డాన్సర్‌గా మెరిసింది. కానీ ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా హీరోయిన్‌గా బాక్సాఫీసుని షేక్‌ చేస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 10 2025, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
rambha

rambha

Rambha: సినిమా పరిశ్రమలో ఎవరి లైఫ్‌ ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో, ఏ రేంజ్‌కి వెళ్తారో ఊహించడం కష్టమే. ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయిన వాళ్లు ఎంతో మంది. గొప్ప స్థాయిలో ఉంటారని భావించిన వాళ్లు ఫేడౌట్‌ అయ్యే ఛాన్స్ ఉంది.

ఎంతో స్ట్రగుల్‌ పడి, ఇక సర్వైవ్‌ అవ్వడం కష్టమే అని భావించిన వాళ్లు ఊహించని విధంగా గొప్ప స్థాయిలో ఉంటారు. అలానే ఒకప్పటి సెన్సేషనల్ హీరోయిన్‌ రంభ ముందు డాన్సర్‌గా పరిచయం అయిన ఒక అమ్మాయి ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌గా ఎదగడమే కాదు, ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేస్తుంది. మరి ఆమె ఎవరో చూద్దాం. 
 

25
sai pallavi

sai pallavi

ఒకప్పుడు డాన్సర్‌గా రాణించి ఇప్పుడు హీరోయిన్‌గా ఆకట్టుకుంటున్నది ఎవరో కాదు, లేడీ పవర్‌ స్టార్‌ సాయిపల్లవి. ఆమె `ఢీ` షో ద్వారా తన డాన్స్ టాలెంట్‌ని నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఈటీవీలో వచ్చిన షోలో ఆమె కంటెస్టెంట్ గా పాల్గొంది. 15ఏళ్ల క్రితమే ఆమె డాన్సర్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.

read  more: ప్రభాస్‌, ప్రశాంత్‌ వర్మ సినిమా టైటిల్‌ ఇదేనా? ప్రభాస్‌ని విలన్‌గా చూపించబోతున్నారా?

35
sai pallavi

sai pallavi

ఢీ లో ఆమె బెస్ట్ డాన్సర్‌గా నిలిచింది. చాలా మంది హీరోయిన్ల ముందు ఆమె డాన్స్ పర్‌ఫెర్మెన్స్ చేసి అందరి చేత వాహ్‌ అనిపించింది. సమంత ముందు కూడా ఆమె డాన్స్ చేయడం విశేషం. 

అలాగే అప్పట్లో హీరోయిన్లలో డాన్స్ సెన్సేషన్‌గా ఉన్న రంభ ముందు సాయిపల్లవి డాన్స్ చేసింది. ఇదే షోలో మరో హీరోయిన్‌ సంగీత కూడా పాల్గొన్నారు. వీరిద్దరు జడ్జ్‌ లుగా ఉన్న ఈ షోలో సాయిపల్లవి `దైలామో` అనే పాటకి డాన్స్ చేసింది. 

45
rambha

rambha

అప్పుడు సాయిపల్లవి డాన్స్ చూసి మెచ్చుకున్నారు రంభ. ఐశ్వర్యరాయ్‌ లాంటి అందం, మాధూరీ దీక్షిత్‌ వంటీ గ్రేస్‌, సరోజ్‌ ఖాన్‌ లాంటి డాన్స్ టాలెంట్‌ ఉన్న అమ్మాయిగా ఆ షోని హోస్ట్ చేస్తున్న ఉదయభాను, అలాగే రంభ, సంగీత కూడా చెప్పారు. ఆమెని అభినందించారు. 

కట్‌ చేస్తే 15ఏళ్లలో సాయి పల్లవి చాలా ఎదిగింది. చాలా సాధించింది. మలయాళ చిత్రం `ప్రేమమ్‌`తో హీరోయిన్ గా పరిచయమై ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలతో రాణిస్తుంది.

55

ఇటీవల `అమరన్‌`తో ఇండియా వైడ్‌గా ప్రశంసలందుకుంది. `తండేల్‌`తోనూ సక్సెస్‌ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `రామాయణ` వంటి పౌరాణిక చిత్రంలో సీతగా నటిస్తుంది.

ఈ మూవీ పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతుంది. దీనికిగానూ సాయిపల్లవి ఒక్కో మూవీకి 15కోట్లు పారితోషికంగా తీసుకుంటుందని తెలుస్తుంది. ఇలా అత్యధిక పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగింది సాయిపల్లవి. 

read  more: రాజశేఖర్‌ రిజెక్ట్ చేసిన సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన చిరంజీవి, ఆ మూవీ ఏంటో తెలుసా? రెండు సార్లు సేమ్‌

also read: రామ్‌ చరణ్‌ చేత గిన్నెలు తోమిపిచ్చిన సుకుమార్‌.. విషయం తెలియడంతో చిరంజీవి రియాక్షన్‌ ఏంటో తెలుసా?
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది
Recommended image2
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Recommended image3
రష్మిక మందన్న పెళ్లి వార్తల వేళ.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పాత పోస్ట్ వైరల్, ఇంతకీ అందులో ఏముంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved