MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత కళ్లెదుటే మానవబాంబు దాడి, పెను ప్రమాదం నుండి బయటపడ్డ స్టార్ లేడీ 

సమంత కళ్లెదుటే మానవబాంబు దాడి, పెను ప్రమాదం నుండి బయటపడ్డ స్టార్ లేడీ 

ఓ మూవీ కోసం షూటింగ్ కి వెళ్లిన సమంత తృటిలో పెద్ద ప్రమాదం నుండి తప్పుకుందట. ఆమెకు సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగిందట. ఈ విషయాన్ని స్టార్ డైరెక్టర్ తెలియజేశారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 30 2024, 09:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఏమాయ చేసావే చిత్రంతో సమంత సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. నాగ చైతన్యకు జంటగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మంచి విజయం అందుకుంది. తెలుగులో రెండో చిత్రమే ఎన్టీఆర్ తో చేసే ఛాన్స్ దక్కింది. బృందావనం మూవీలో ఎన్టీఆర్ తో ఆమె జతకట్టారు. ఇక మూడో చిత్రం దూకుడు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అనాలి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మహేష్ బాబు, సమంత జంటగా నటించారు. ఈ సినిమాతో సమంత తెలుగులో హ్యాట్రిక్ పూర్తి చేసింది. ఆమె కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. కాగా దూకుడు మూవీ షూటింగ్ టైం లో సమంత పెను ప్రమాదం నుండి తృటిలో తప్పుకుందట. దూకుడు మూవీ చిత్రీకరణ కొంత భాగం టర్కీ లో జరిగింది. ఒక రోజు సమంతకు షూట్ లేదట. ఆ విషయం శ్రీను వైట్ల ఆమెకు చెప్పాడట. 

36

సరదాగా షాపింగ్ చేద్దామని బయటకు వెళ్లిందట. పది నిమిషాల్లోనే సమంత నుండి శ్రీను వైట్లకు  ఫోన్ వచ్చిందట. ఆమె కళ్ళ ఎదుట ఆత్మాహుతి దాడి జరిగిందట. సమీపంలోనే ఉన్న సమంత పెను ప్రమాదం నుండి తప్పుకుందట. దాంతో షాక్ కి గురైన సమంత సిబ్బంది ఫోన్ చేశారట. వెంటనే అక్కడ నుండి హోటల్ కి వెళ్లిపోయారట. ఈ విషయాన్ని శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 

 

46

ఇదిలా ఉండగా..  సమంత జీవితంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు హఠన్మరణం పొందారు. ''మళ్ళీ మనం కలిసే వరకు నాన్న'' అని కామెంట్ పెట్టిన సమంత , హార్ట్ బ్రేక్ ఎమోజీ జోడించారు. జోసెఫ్ ప్రభు మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. నిద్రలో ఆయన హార్ట్ అటాక్ కి గురయ్యారట, అదే ఆయన మరణానికి కారణం అని ప్రాథమిక సమాచారం.  సమంత తండ్రి జోసెఫ్ భార్యతో పాటు చెన్నైలో ఉంటున్నారు. ఈ న్యూస్ చిత్ర వర్గాల్లో విషాదం నింపింది. ఈ ఘటన సమంతను తీవ్ర వేదనలో నింపింది. తాను కెరీర్లో ఎదగడం వెనుక తండ్రి జోసెఫ్ కృషి ఎంతగానో ఉందని సమంత పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. 
 

56

ఇటీవల సిటాడెల్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత తండ్రిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పుడూ సమంత జీవితాన్ని ఛాలెంజింగ్ గా మలిచేవారట. నువ్వు చదువులో ఫస్ట్ వచ్చినంత మాత్రాన గ్రేట్ కాదు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ స్టాండర్స్ మాత్రమే అవి. నువ్వు స్మార్ట్, ఇంటెలిజెంట్ అని ఎప్పుడూ భావించకు అనేవారట. తనకున్న సామర్ధ్యాలను ఆయన దాచే ప్రయత్నం చేసేవారట.  

66

జోసెఫ్, నినెట్టే దంపతులకు సమంత 1987లో జన్మించారు. జోసెఫ్ ఆంగ్లో ఇండియన్ అని సమాచారం. సమంత కంటే ముందు ఇద్దరు అబ్బాయిలు జోసెఫ్ కి సంతానంగా ఉన్నారు. చెన్నై కి సమీపంలో గల పల్లవరం లో వీరు గతంలో నివసించేవారని తెలుస్తుంది. కాగా గత మూడేళ్ళలో సమంత జీవితంలో అనేక విషాదాలు చోటు చేసుకున్నాయి. భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత డిప్రెషన్ కి గురైంది. 

విడాకుల వేదన నుండి బయటకు పడే లోపు.. మరో సమస్యలో ఆమె చిక్కుకున్నారు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడిన సమంత రెండేళ్లకు పైగా చికిత్స తీసుకుంటున్నారు. 2022 అక్టోబర్ లో తనకు మయోసైటిస్ సోకినట్లు సమంత వెల్లడించారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: బయటపడ్డ తెరవెనుక రహస్యం, యష్ టాక్సిక్ మూవీ మేకింగ్ వీడియో వైరల్..
Recommended image2
CM Vijay Trisha: సీఎం విజయ్ తో ఒకే కారులో త్రిష, ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైమ్ కలిసి కపించిన జంట
Recommended image3
Pushpa 3: పుష్ప 3 రిలీజ్ డేట్ ఫిక్స్ ? జగపతి బాబు ఇచ్చిన మాస్ అప్‌డేట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved