సమంత తల్లిదండ్రులకు నాగచైతన్యతో పెళ్లి ఇష్టం లేదా..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలిగిపోతున్న సమంత పెళ్లి తరువాత కూడా హీరోయిన్గా అదే ఫాంను కొనసాగిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీ తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులో షేర్ చేసుకుంటుంది.
అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న వెంటనే తన సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరును సమంత అక్కినేనిగా మార్చేసుకుంది సమంత. అంతేకాదు తాను అక్కినేని ఇంటి కోడలిని అయిన తరువాత తన మీద బాధ్యత డబుల్ అయ్యిందని వెల్లడించింది.
అంతగా అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్న ఫ్యామిలీలో తాను కలవటం తన అదృష్టం అంటూ ఆనందం వ్యక్తం చేసింది సమంత.
అయితే మీడియాలో వచ్చిన సమంత - నాగచైతన్య ల పెళ్లి ఫోటోలు చూస్తే వాటిలో అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కనిపిస్తారు. సమంత కుటుంబ సభ్యులు పెద్దగా కనిపించరు.
అప్పట్లో సమంత తల్లిదండ్రులకు చైతు, సామ్‌ల పెళ్లి ఇష్టం లేదన్న రూమర్స్ కూడా వినిపించాయి. అందుకే వీరి పెళ్లిలో సమంత తరపువారు పెద్ద కనిపించలేదన్న ప్రచారం జరిగింది. కానీ కొద్ది రోజుల తరువాత సమంత తల్లిదండ్రులు కొత్త జంటతో కలిసి దిగిన ఫోటో బయటకు రావటంతో ఆ రూమర్స్‌కు బ్రేక్ పడింది.
ఈ వార్తలపై సమంత కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. `మా తల్లి దండ్రులు చాలా సింపుల్‌గా జీవిస్తారు. వాళ్లు సినిమాలు కూడా చూడరు. మీకు వింతగా అనిపించవచ్చు. కానీ మా తల్లి దండ్రులకు నేను సౌత్ సినీ ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అన్న విషయం కూడా తెలియదు` అని తెలిపింది.
అంతేకాదు.. `నేను, నాగచైతన్య చాలా కాలంగా మంచి స్నేహితులం అని వారికి తెలుసు. నేను నా బెస్ట్ ఫ్రెండ్‌నే పెళ్లాడుతున్నానంటే వాళ్లు చాలా సంతోషించారు. ముఖ్యంగా గ్రేట్ అక్కినేని ఫ్యామిలీలోొకి అడుగుపెట్టినందుకు మరింతగా ఆనందించారు` అంటూ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.