అమితాబ్ తో లిప్ లాక్ చేసిందని ..తన లవర్ కి బ్రేక్ అప్ చెప్పిన అభిషేక్
క్లైమాక్స్ లో అమితాబ్ కు ఆమెకు లిప్ లాక్ కిస్ ఉంది. అయితే ఆ సీన్ ఏదో వేరే హాట్ లిప్ లాక్ కాదు.

Amitabh Bachchan
ఎంతో విలువైన జుహు బంగ్లాను అమితాబ్ బచ్చన్ . కుమార్తె శ్వేతా నందాకు గత ఏడాది బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బచ్చన్ కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. దానికి తోడు అభిషేక్ బచ్చన్ రీసెంట్‌గా సోషల్ మీడియాలో విడాకుల పోస్ట్‌ను పెట్టడంతో మళ్లీ ఐశ్వర్య, అభిషేక్ విడాకులు విషయం హాట్ టాపిక్‌గా మారింది.
దానికి తోడు రీసెంంట్‌గా అనంత్ అంబానీ పెళ్లికి ఐశ్వర్య తన కూతురుతో ఒంటరిగా వెళ్లింది. ఆపై ఒంటరిగా విమానాశ్రయానికి కూడా వెళ్లింది. దీంతో నెటిజన్లు అమితాబ్ బచ్చన్ ఇంట్లో విభేదాలు ఉన్నాయని, ఐశ్వర్ రాయ్.. అభిషేక్ బచ్చన్‌లు విడాకులు తీసుకోబోతున్నారని పలు చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అభిషేక్ బచ్చన్ కు చెందిన పాత లవ్ ఎఫెర్స్ సోషల్ మీడియాలో రచ్చ మొదలయ్యాయి. అలాంటి వాటిల్లో రాణి ముఖర్జీ ఒకటి.
అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ కలిపి మణిరత్నం యువ సినిమాలో మొదటి సారి చేసారు. అప్పుడు వీరిద్దరి మధ్యా క్లోజెనెస్ మొదలైంది.అదే స్క్రీన్ పై కెమిస్ట్రీ బాగా పండేలా చేసి సినిమా సక్సెస్ కు కారణమైంది. యువ తర్వాత బంటి అవుర్ బబ్లి సినిమా చేసారు. అప్పుటి దాకా రూమర్ గా ఉన్న వీరి రొమాన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
అయితే అమితాబ్, రాణి ముఖర్జీ కలిపి చేసిన బ్లాక్ సినిమా రిలీజ్ తర్వాత పరిస్దితులు మారిపోయాయి. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ఆ చిత్రం ఎన్నో అవార్డ్ లు సాధించింది. రాణి ముఖర్జీ ఆ సినిమాలో హెలెన్ కిల్లర్ ని దృష్టిలో పెట్టుకుని చేసిన పాత్రను పోషించింది. ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. అమితాబ్, రాణి ముఖర్జీలను అందరూ ప్రశించారు. అందులో అమితాబ్ గురువు, రాణి ముఖర్జీ శిష్యురాలి పాత్ర.
2005లో వచ్చిన ఈ సినిమాకి సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు. రాణీ ముఖర్జీ ఇందులో అమితాబ్ పాటు నటిచింది. ఈ సినిమాలో అమితాబ్ నట విశ్వరూపం కనిపిస్తుంది. వయస్సులో బిగ్ బి తనకంటే వయస్సులో చాలా చిన్నదైన అమ్మాయి.. అది కూడా కళ్లు లేని ఆడపిల్ల..ఆమె సినిమా చివర్లో ముద్దు అడిగినప్పుడు అమితాబ్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ వేరేలెవల్‌లో ఉంటాయి. ఆయన నటనకు అంతా ఫిదాఅయ్యారు.
ఇక అసలు విషయానికి వస్తే రాణి ముఖర్జీ ...బ్లాక్ సినిమా క్లైమాక్స్ లో అమితాబ్ కు ఆమెకు లిప్ లాక్ కిస్ ఉంది. అయితే ఆ సీన్ ఏదో వేరే హాట్ లిప్ లాక్ కాదు. ఓ ప్రేమ ప్రదమైన విషయం. తన అభిమాన గురువుతో శిష్యురాలు తండ్రి,కూతురు మాదిరిగా లిప్ లాప్ కిస్ పెట్టడం జరిగింది. ఆ సీన్ కు చాలా ప్రశంసలు వచ్చాయి. కానీ ఆ సీన్ చూసిన అభిషేక్ బచ్చన్, అలాగే అమితాబ్ భార్య జయ బచ్చన్ చాలా మండిపడ్డారు.
వయస్సులో బిగ్ బి తనకంటే వయస్సులో చాలా చిన్నదైన అమ్మాయి.. అది కూడా కళ్లు లేని ఆడపిల్ల..ఆమె సినిమా చివర్లో ముద్దు అడిగినప్పుడు అమితాబ్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ వేరేలెవల్‌లో ఉంటాయి. ఆయన నటనకు అంతా ఫిదాఅయ్యారు.
తండ్రితో లిప్ లాక్ కిస్ ఇచ్చిన నాటి నుంచి రాణి ముఖర్జీని అభిషేక్ దూరం పెట్టడం మొదలెట్టాడు. అది రాణి ముఖర్జీని బాగా బాధపెట్టింది. నటనలో భాగంగా చేసిన విషయాన్ని తను నటుడే అయ్యినప్పుటికీ సీరియస్ గా తీసుకోవటం రాణి ముఖర్జీని హర్ట్ చేసింది. దాంతో ఆమె కూడా అభిషేక్ ని దూరం పెట్టింది. అలా ఇధ్దరి మధ్యా దూరం పెరిగింది. చివరకి అభిషేక్ తన పెళ్లికి అందరితో పాటు బాలీవుడ్ లో స్టార్ గా వెలుగుతున్న ఆమెను పెళ్లికి పిలవలేదు. ఆ తర్వాత ఐశ్వర్యారాయ్, రాణి ముఖర్జీ సైతం శత్రువులుగా మారారు అభిషేక్ వల్ల అని బాలీవుడ్ అంటోంది.
Amitabh Bachchan
ఇక తన ఇరవై మూడేళ్ల ఏళ్ల కెరీర్‌లో అభిషేక్ బచ్చన్ 29 ఫ్లాప్ల్ చూశాడు. హ్యాపీ న్యూ ఇయర్, ధూమ్ 2, ధూమ్ 3, హౌజ్‌ఫుల్ 3, దోస్తానా సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా అవన్నీ మల్టీ స్టారర్ సినిమాలే. దాంతో సోలోగా అతని ఖాతాలో పడే హిట్స్ కోసం ఎదురుచూసాడు. అయితే 2020లో మాత్రం బీత్ ఇంటు ది షాడోస్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ హిట్ అందుకున్నాడు. ఇందులో అభిషేక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అనంతరం ది బిగ్ బుల్, దస్వీ, బాబ్ బిస్వాస్ సినిమాలతో ఓటీటీలో ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ నికర ఆస్తి విలువ సుమారు రూ. 280 కోట్లకు (Abhishek Bachchan Net Worth) చేరుకున్నట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం అభిషేక్ బచ్చన్ ప్రతి నెల దాదాపుగా రూ. 2 కోట్లు సంపాదిస్తున్నాడు. ఒక్కో చిత్రానికి రూ. 10 నుంచి 12 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. అంతేకాకుండా ప్రో కబడ్డీ లీగ్ జట్టు జైపూర్ పింక్ పాంథర్స్‌కు ఓనర్. దాని విలువ రూ. 100 కోట్లు అని తెలుస్తోంది.
ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి విడివిడిగా హజరయ్యారీ లవ్లీ కపుల్. ఐశ్వర్యరాయ్ తన కుమార్తెతో కలిసి ఈ వివాహానికి హాజరైంది. మరోవైపు అభిషేక్ మాత్రం అమితాబ్, జయ బచ్చన్ తో కలిసి అంబానీ పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు. ఇలా వీరిద్దరూ విడివిడిగా రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఐశ్వర్య- అభిషేక్ ల విడాకుల రూమర్లు మళ్లీ మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అభిషేక్ బచ్చన్ చేసిన ఓ పని విడాకుల వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. అదేంటంటే.. తాజాగా ‘ విడాకులు ఎవరికీ అంత ఈజీ కాదన్న పోస్ట్‌ను అభిషేక్ బచ్చన్ లైక్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.