- Home
- Entertainment
- ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీని రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన స్టార్ హీరో... ఎక్కడ తేడా జరిగింది?
ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీని రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన స్టార్ హీరో... ఎక్కడ తేడా జరిగింది?
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆంధ్రావాలా డిజాస్టర్. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని రీమేక్ చేసి బ్లాక్ బాస్టర్ కొట్టాడు మరొక స్టార్ హీరో. ఆ కథ ఏమిటో చూద్దాం...

NTR
టీనేజ్ కూడా దాటకుండా స్టార్ హీరోల లిస్ట్ లో చేరాడు ఎన్టీఆర్. స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి విజయాలు ఎన్టీఆర్ ఇమేజ్ తారా స్థాయికి చేర్చాయి. మాస్ హీరోగా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. సింహాద్రి ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
NTR
దాంతో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. దర్శకుడు పూరి జగన్నాధ్-ఎన్టీఆర్ కాంబోలో ఫస్ట్ తెరకెక్కిన ఆంధ్రావాలా ను భారీగా ప్రమోట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి అందించిన సాంగ్స్ జనాలను ఊపేశాయి. ఇంకేముంది.. సినిమా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు.
NTR
సంక్రాంతి కానుకగా 2004 జనవరి 1న విడుదల చేశారు. సినిమా చూసేందుకే ఆడియన్స్ పోటెత్తారు. అయితే బెనిఫిట్ షోల నుండే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అంచనాల మధ్య విడుదలైన ఆంధ్రావాలా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
ఎన్టీఆర్ యంగ్ ఏజ్ లోనే డ్యూయల్ రోల్ చేయడం, ముంబై ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వర్క్ అవుట్ కాలేదు. మంచి సాంగ్స్ ఉండి కూడా ఆంధ్రావాలా విజయ తీరం చేరుకోలేకపోయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. నిజానికి ఆంధ్రావాలా ఆడి ఉంటే... ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్ రేంజ్ కి వెళ్ళేవాడు.
కాగా ఎన్టీఆర్ కి డిజాస్టర్ ఇచ్చిన స్టోరీనే మరలా తెరకెక్కించి హిట్ కొట్టాడు పూరి జగన్నాధ్. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కి పూరి జగన్నాధ్ అత్యంత సన్నిహితుడు. పునీత్ ని హీరోగా పరిచయం చేసింది పూరినే. అప్పు పేరుతో పూరి దర్శకత్వంలో పునీత్ చేసిన చిత్రం సూపర్ హిట్.
NTR
అప్పు చిత్రాన్ని తెలుగులో ఇడియట్ గా రీమేక్ చేసి మరో హిట్ కొట్టాడు పూరి జగన్నాధ్. కాగా ఆంధ్రావాలా స్టోరీకి కన్నడ నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేసి వీర కన్నడిగ టైటిల్ తో పూరి జగన్నాధ్ తెరకెక్కించాడు.
పునీత్ హీరోగా నటించిన వీర కన్నడిగ అక్కడ బాగా వర్క్ అవుట్ అయ్యింది. పూరి రాసిన స్టోరీకి ఫలితం దక్కింది. ఆ విధంగా ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ ఆంధ్రావాలా... వీర కన్నడిగ గా రీమేక్ చేసి పునీత్ మంచి విజయాన్ని అందుకున్నారు.