చిరంజీవి పై కోపంతో ఆ హీరోకి అన్యాయం చేసిన రాజమౌళి, దర్శకధీరుడుకి అంత అవమానం జరిగిందా?
దర్శకధీరుడు రాజమౌళిని చిరంజీవి అవమానించాడట. చిరంజీవి మీద కోపం మరో హీరో బలయ్యేలా చేసిందట. ఆ స్టోరీ ఏమిటీ
NTR-Rajamouli
దర్శకుడిగా రాజమౌళి నమోదు చేసిన రికార్డులు ఎవరూ అందుకోలేనివి. అపజయం ఎరుగని దర్శకుడిగా ఆయన ఉన్నారు. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో రాజమౌళి చేసింది 12 చిత్రాలే. అందుకే ఆయనకు జక్కన్న అనే పేరు కూడా ఉంది. ప్రతి చిత్రాన్ని సుదీర్ఘ కాలం నిర్మిస్తారు.
Rajamouli
స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో దర్శకుడిగా మారాడు రాజమౌళి. 2001లో వచ్చిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ సూపర్ హిట్. ఎన్టీఆర్ కి హీరోగా ఫస్ట్ బ్రేక్ అని చెప్పాలి. ఇక రెండో చిత్రం సింహాద్రి. టాలీవుడ్ రికార్డ్స్ ని సింహాద్రి తుడిచిపెట్టింది. ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్నాడు.
కాగా రామ్ చరణ్ రెండో చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 2007లో చిరుత చిత్రంతో రామ్ చరణ్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిరుత ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఈసారి భారీ హిట్ కొట్టాలని రాజమౌళిని రంగంలోకి దించారు.
Rajamouli-Chiranjeevi
మగధీర టైటిల్ తో మూవీ ప్రకటించారు. అల్లు అరవింద్ నిర్మాత. ఆ రోజుల్లో మగధీర టాలీవుడ్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ. పొదుపుకు చిరునామాగా చెప్పుకునే అల్లు అరవింద్ ఇబ్బంది పడుతూనే మగధీర చిత్రాన్ని నిర్మించాడట. బడ్జెట్ దాటిపోతుందని పదే పదే రాజమౌళికి గుర్తు చేసేవాడట. చరణ్ కి ఇంకా మార్కెట్ ఏర్పడకపోవడం కూడా అల్లు అరవింద్ భయానికి కారణం.
ఉన్నదంతా పెట్టి మగధీర తీశాను. అప్పులు కూడా చేశానని వాపోతూ ఉండేవాడట. మగధీర సోషియో ఫాంటసీ యాక్షన్, లవ్ డ్రామా. రామ్ చరణ్ కి జంటగా కాజల్ నటించింది. శ్రీహరి కీలక రోల్ చేశాడు. 2009లో విడుదలైన మగధీర బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. గత టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
సినిమా విడుదలయ్యాక చిరంజీవి... సక్సెస్ క్రెడిట్ రామ్ చరణ్ దే అన్నారట. రామ్ చరణ్ నటన, ప్రతిభ వలనే మగధీర ఆడింది అన్నారట. నిర్మాతగా అల్లు అరవింద్ ఫుల్ హ్యాపీ. భారీగా డబ్బులు వచ్చాయి. పలు భాషల్లో మగధీర రీమేక్ అయ్యింది. ఆ విధంగా కూడా డబ్బులు వచ్చాయి.
కొడుక్కి భారీ హిట్ ఇచ్చిన రాజమౌళిని చిరంజీవి గుర్తించలేదట. అదే సమయంలో పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించిన అల్లు అరవింద్, ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదట. పైగా నేను రిస్క్ చేసి భారీ బడ్జెట్ తో మగధీర తీశాను. కాబట్టి రిస్క్ నాది... ఫలితం కూడా నా ఒక్కడికే అన్నట్లు ప్రవర్తించాడట.
Allu Arjun
ఇవన్నీ మనసులో పెట్టుకున్న రాజమౌళి కమెడియన్ సునీల్ తో మర్యాద రామన్న మూవీ చేసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఈగ అనే ప్రయోగాత్మక చిత్రం చేశాడు. ఈగ బాలీవుడ్ లో కూడా సత్తా చాటింది. చిరంజీవి కామెంట్స్ కి హర్ట్ అయిన రాజమౌళి... ఓ కమెడియన్ ని, అలాగే చిన్న ఈగను హీరోగా పెట్టి మూవీ తీసి హిట్ కొట్టగలనని పరోక్షంగా సందేశం పంపించాడట.
అల్లు అరవింద్, చిరంజీవి మగధీర విషయంలో ప్రవర్తించిన తీరు నచ్చని రాజమౌళి ఇకపై మెగా హీరోలతో సినిమాలు చేయకూడదని అనుకున్నాడట. ఆ కారణంగానే అల్లు అర్జున్ తో రాజమౌళి ఒక్క సినిమా చేయలేదట. చిరంజీవి, అల్లు అరవింద్ లపై ఉన్న కోపం అల్లు అర్జున్ బలి అయ్యేలా చేసిందట. ఈ మేరకు గతంలో కథనాలు వెలువడ్డాయి.
Ram charan RRR
అయితే ఇదంతా ట్రాష్... చిరంజీవిపై రాజమౌళికి కోపం ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీలో మరో హీరోగా రామ్ చరణ్ ని ఎందుకు తీసుకుంటాడు. ఎన్టీఆర్ కి ధీటుగా రామ్ చరణ్ పాత్ర ఎలా తీర్చిదిద్దుతాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రచారమైన వార్తల్లో నిజమెంతో వారికే తెలియాలి.
బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి