MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ డైరెక్టర్ తో కలిసి విజయశాంతిని ఛీట్ చేసిన చిరంజీవి, పాపం.. స్టార్ లేడీ గుడ్డిగా నమ్మేసింది 

స్టార్ డైరెక్టర్ తో కలిసి విజయశాంతిని ఛీట్ చేసిన చిరంజీవి, పాపం.. స్టార్ లేడీ గుడ్డిగా నమ్మేసింది 

స్టార్ లేడీ విజయశాంతిని చిరంజీవి మోసం చేశాడట. ఓ స్టార్ డైరెక్టర్ తో కలిసి స్టార్ లేడీని పిచ్చిదాన్ని  నవ్వుకున్నారట. ఇంతకీ ఏ విషయంలో విజయశాంతి మోసపోయింది? 

1 Min read
Author : Sambi Reddy
Published : Jan 02 2025, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిరంజీవికి మాస్ ఫాలోయింగ్ రావడానికి ఆయన డాన్సులు ఫైట్స్ తో పాటు మేనరిజమ్స్ కూడా కారణం. 90లలో ఆయన ప్రతి సినిమాలో ఓ మేనరిజం ట్రై చేసేవారు. అవి విపరీతంగా జనాల్లోకి వెళ్ళేవి. 'చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో, ' కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో', 'బాక్సులు బద్దలైపోతాయి' వంటివి కొన్ని ఉదాహరణలు.. 

26

కాగా హీరోయిన్ విజయశాంతి తో చిరంజీవి పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు.  చిరంజీవి-విజయశాంతిలది హిట్ ఫెయిర్. అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. కాగా ఓ సినిమాలో విజయశాంతిని చూసిన వెంటనే చిరంజీవి  'జమ్కు జమా లస్క్ టపా...' అంటాడు. 

 

36

ఈ డైలాగ్ మీనింగ్ ఏమిటో తెలుసుకోవాలని విజయశాంతి అనుకున్నారట. చిరంజీవిని జమ్కు జమా లస్క్ టపా అంటే  ఏంటని అడిగిందట. నాకు తెలియదు. వెళ్లి డైరెక్టర్ రాఘవేంద్రరావుని అడుగు అన్నాడట చిరంజీవి. దాంతో విజయశాంతి రాఘవేంద్రరావు వద్దకు వెళ్లి జమ్కు జమా లస్క్ టపా అంటే అర్థం ఏంటని, అడిగిందట. 

46
\

\

దానికి రాఘవేంద్రరావు...    జమ్కు జమా లస్క్ టపా అంటే 'నీ అందచందాలకు దాసుడిని అయిపోయాను' అని అర్థం అన్నాడట. అవునా అని విజయశాంతి అన్నారట. వచ్చి చిరంజీవితో ఇదే చెప్పారట. కాసేపటి తర్వాత రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్లిన చిరంజీవి జమ్కు జమా లస్క్ టపా అంటే నిజంగా అర్థం అదేనా అని అడిగాడట. 

56

లేదు జమ్కు జమా లస్క్ టపా అంటే 'నిన్ను ఎలా పడేస్తానో చూడు' అని మీనింగ్ అని రాఘవేంద్రరావు చిరంజీవితో అన్నాడట. రాఘవేంద్రరావు-చిరంజీవి గట్టిగా నవ్వుకున్నారట. నిజానికి ఆ డైలాగ్ కి ఎలాంటి మీనింగ్ లేదు. మాస్ జనాలు అమ్మాయిల వద్ద ఎక్స్ ప్రెస్ చేసే ఒక రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్ అని చెప్పొచ్చు. విజయశాంతి తప్పుగా భావించకుండా ఉండేందుకు 'నీ అందచందాలకు దాసుడను' అని రాఘవేంద్రరావు చెప్పాడు. 

 

66
Vijayashanthi

Vijayashanthi

ఒకప్పటి చిత్రాల్లో ఇలాంటి అర్థం లేని పదాలు, వాక్యాలు చాలా వాడుతూ ఉండేవారు. అలాంటిదే జమ్కు జమా లస్క్ టపా. మొత్తానికి విజయశాంతిని చిరంజీవి-రాఘవేంద్రరావు బురిడీ కొట్టించారు. విజయశాంతి-చిరంజీవి కాంబినేషన్ లో గ్యాంగ్ లీడర్, ఛాలెంజ్, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mamidi Konala Meena: యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న మ‌రో ఫోక్ సాంగ్‌.. పాట వింటే కాలు క‌ద‌పాల్సిందే
Recommended image2
ఒక్కరోజు కూడా భర్తను వదిలి ఉండలేను.. అన్నీ కలిసే చేస్తాం: సమంత
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 27: నట్టింట్లో కుంపటి పెట్టిన భాగ్యం.. రామరాజుకు మొత్తం చెప్పేసింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved