- Home
- Entertainment
- మామయ్య మందు తాగుతాడు, బాటిల్, వాటర్ ఎప్పుడూ పక్కనే ఉండాల్సిందే... తెరపైకి బాలయ్య అల్లుడు కామెంట్స్!
మామయ్య మందు తాగుతాడు, బాటిల్, వాటర్ ఎప్పుడూ పక్కనే ఉండాల్సిందే... తెరపైకి బాలయ్య అల్లుడు కామెంట్స్!
హీరో బాలకృష్ణ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మద్యం తాగాడంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో గతంలో బాలయ్య మందు అలవాటుపై చిన్న అల్లుడు శ్రీ భరత్ చేసిన చేసిన కామెంట్స్ తెరపైకి వచ్చాయి.

Balakrishna
విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో బాలయ్య ప్రవర్తన వివాదాస్పదం అయ్యింది. బాలకృష్ణ హీరోయిన్ అంజలిని వేదిక మీద వెనక్కి నెట్టాడు. ఈ వీడియో నేషనల్ వైడ్ వైరల్ కాగా, పలువురు ఖండించారు.
Balakrishna
అలాగే ఈ వేడుకలో బాలకృష్ణ మద్యం సేవించాడని కూడా కథనాలు వెలువడ్డాయి. బాలయ్య చైర్ పక్కన వాటర్ బాటిల్ తో పాటు మందు కలిపిన బాటిల్ ఉందని సదరు కథనాల సారాంశం. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ ఎవరో సీజీలో చేశారు. బాలయ్య పక్కన ఎలాంటి బాటిల్స్ లేవని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హీరో, నిర్మాత క్లారిటీ ఇచ్చారు .
కాగా గతంలో బాలయ్య మందు అలవాటు మీద చిన్న అల్లుడు శ్రీ భరత్ ఓపెన్ కామెంట్స్ చేశాడు. లేటెస్ట్ వివాదం నేపథ్యంలో శ్రీభరత్ కామెంట్స్ తెరపైకి వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో శ్రీ భరత్ మాట్లాడుతూ... మామయ్య మ్యాన్షన్ హౌస్ తాగుతాడని తెలిశాక ఆ కంపెనీ స్టాక్స్ విలువ పెరిగింది అన్నారు. ఆయన హాట్ వాటర్ లో కలుపుకుని తాగుతాడట కదా? అని యాంకర్ భరత్ ని అడగ్గా... అవును అది నిజం అని ఒప్పుకున్నాడు భరత్.
Balakrishna
ఆయన దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది. అందులో హాట్ వాటర్, మందు బాటిల్ ఉంటాయి. ఆయన ఎక్కడికి వెళ్లినా ఆ బ్యాగ్ ఉండాల్సిందే. అమెరికా వెళ్లినా కూడా దాన్ని వెంట తీసుకెళతాడు... అని భరత్ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Balakrishna
వ్యసనాన్ని గొప్పతనంగా చెప్పుకోవడం ఏమిటని కొందరు అప్పట్లో విమర్శలు చేశారు. అలాగే టాప్ హీరోగా ఉన్న బాలయ్య మందు తాగుతాడని పబ్లిక్ గా చెబితే, ఆయన ఫ్యాన్స్ స్ఫూర్తి పొందొచ్చు. వాళ్ళకు మద్యం తాగాలనే ఆలోచనలు పుట్టొచ్చని ఎద్దేవా చేశారు. భరత్ మాటలను బట్టి బాలయ్యకు మద్యం అలవాటు ఉందనేది స్పష్టం అవుతుంది. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన తాగాడా లేదా అనేది తెలియాల్సి ఉంది...