MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ కి అదో తీరని అవమానం, తిరస్కరించిన జనం, స్టార్ డైరెక్టర్ బయటపెట్టిన నిజాలు 

ఎన్టీఆర్ కి అదో తీరని అవమానం, తిరస్కరించిన జనం, స్టార్ డైరెక్టర్ బయటపెట్టిన నిజాలు 

జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఇప్పటి పాన్ ఇండియా స్టార్ కి ఎదురైన ప్రభావాలు ఎన్నో. ఓ స్టార్ డైరెక్టర్ సలహాతో అంతా ఛేంజ్...  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 15 2024, 07:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దేవర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా రూ. 500 కోట్ల మార్క్ చేరుకుంది. దసరా హాలిడేస్ ని దేవర బాగా ఉపయోగించుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ దేవర చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, నార్త్, ఓవర్సీస్ ఏరియాల్లో దేవర పెద్ద మొత్తంలో లాభాలు పంచింది. ఆర్ ఆర్ ఆర్ మినహాయిస్తే సోలోగా ఎన్టీఆర్ కి భారీ హిట్ పడింది. కెరీర్ హైయెస్ట్ నమోదు చేశాడు. దేవర నార్త్ లో సైతం విజయం సాధించిన నేపథ్యంలో పాన్ ఇండియా హీరో ట్యాగ్ సార్థకం అయ్యింది. 

 

దర్శకుడు కొరటాల శివ దేవరను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటించింది. సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, అజయ్, శ్రీకాంత్ ఇతర కీలక రోల్స్ చేశారు. అనిరుధ్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్. ముఖ్యంగా బీజీఎమ్ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించింది. 

36
NTR-Rajamouli

NTR-Rajamouli

దేవరతో ఎన్టీఆర్ మార్కెట్ రేంజ్ ఏమిటో రుజువైంది. ఇకపై ఎన్టీఆర్ సినిమాకు రూ. 100 కోట్లు వసూలు చేయడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక్క ప్రభాస్ మాత్రమే వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక ఈ స్థాయికి రావడానికి ఎన్టీఆర్ చాలానే కష్టపడ్డాడు. ఒక దశలో ఆయన ప్రేక్షకుల నుండి తిరస్కరణకు గురయ్యారు. తనకు జరుగుతున్న డ్యామేజ్ ఏమిటో దర్శకుడు రాజమౌళి తెలియజేసినట్లు ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

 

జయప్రద హోస్ట్ గా 2010లో ప్రసారమైన జయప్రదం టాక్ షోలో పాల్గొన్న ఎన్టీఆర్ మాట్లాడుతూ.. యమదొంగకు ముందు రాజమౌళి నాకు స్క్రిప్ట్ చెప్పలేదు. నిజాలు చెప్పాడు. నువ్వు అసలు ఏం బాగోలేదు తారక్, అన్నాడు. ఈ లుక్ తోనే కదా.. సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ కొట్టింది, అన్నట్లు నేను ఒక లుక్ వేశాను. 

46
NTR

NTR

అసలు నీకు అర్థం అవుతుందా.. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నీ సినిమాలు చూడటం లేదు. యూత్, అమ్మాయిలు ఇలా ఉంటే ఎలా ఇష్టపడతారు. నువ్వు బరువు తగ్గాలి, అని రాజమౌళి అన్నారు. సరే ఆ బరువు ఎలా తగ్గాలో కూడా నువ్వే చెప్పు, అని రాజమౌళిని అడిగాను. అప్పుడు నేను లైపోసక్షన్ చేయించుకున్నాను. నేను ఎలా బరువు తగ్గితే మీకెందుకు అనుకున్నాను. బరువు తగ్గాక నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను, అన్నారు. 

 

శరీరంలోని అధిక కొవ్వును తొలగించే ప్రక్రియను లైపోసక్షన్ అంటారు. ఇది ఒకింత ప్రమాదకరం కూడాను. సినిమా కోసం ఎన్టీఆర్ రిస్క్ చేయక తప్పలేదు. సింహాద్రి అనంతరం సినిమా సినిమాకు ఎన్టీఆర్ బరువు పెరుగుతూ పోయాడు. ఆహార ప్రియుడు కావడంతో పాటు, సహజంగా బరువు పెరిగే స్వభావం ఆయన శరీరానికి ఉంది. 2006లో విడుదలైన రాఖీ సినిమా నాటికి ఎన్టీఆర్, అభిమానులు కూడా జీర్ణించుకోలేని విధంగా తయారయ్యాడు. 
 

56
NTR

NTR

రాఖీ మూవీలోని ఎన్టీఆర్ లుక్ ని ఇప్పటికీ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటారు. సింహాద్రి అనంతరం ఎన్టీఆర్ కి ఆ రేంజ్ హిట్ మరలా పడలేదు. బాడీ షేమింగ్ కి గురైన ఎన్టీఆర్, వరుస ప్లాప్స్ తో డీలా పడ్డాడు. అప్పుడు రాజమౌళి రంగంలోకి దిగాడు. యమదొంగ ప్రాజెక్ట్ కోసం బరువు తగ్గాల్సిందే అని సూచించడంతో ఎన్టీఆర్ లైపోసక్షన్ చేయించుకున్నారు. 

 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం బయటకు వెళ్లేది ఎవరు?

66
NTR

NTR

యమదొంగ మూవీలో ఎన్టీఆర్ ని చూసిన ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ సినిమా సూపర్ హిట్. కంత్రి మూవీలో ఎన్టీఆర్ చాలా సన్నగా కనిపిస్తాడు. లుక్ ఏమంత బాగోదు. కొంచెం లావు అయ్యాక ఎన్టీఆర్ సెట్ అయ్యాడు. తర్వాత బరువు పెరగకుండా చూసుకున్నాడు. ఫిట్నెస్ పై దృష్టి పెట్టిన ఎన్టీఆర్ స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: ఉపాసనపై రామ్ చరణ్ ఫన్నీ కామెంట్స్, పెద్ది ముందే వచ్చి ఉంటే..
Recommended image2
Ram Charan Peddi: రామ్ చరణ్ కు గాయం, కంటి నుంచి రక్తం వస్తోంది, డైరెక్టర్ కు చిరంజీవి ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా?
Recommended image3
Trisha Krishnan: సీఎం విజయ్‌ తో రిలేషన్ రూమర్లు, ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన త్రిష
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved