MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • హరికృష్ణ కొడుకులా లేవు, ఎన్టీఆర్ పై స్టార్ కమెడియన్ బాడీ షేమింగ్ కామెంట్స్, తారక్ రియాక్షన్ ఇదే!

హరికృష్ణ కొడుకులా లేవు, ఎన్టీఆర్ పై స్టార్ కమెడియన్ బాడీ షేమింగ్ కామెంట్స్, తారక్ రియాక్షన్ ఇదే!

ఓ స్టార్ కమెడియన్ జూనియర్ ఎన్టీఆర్ పై బాడీపై గట్టి కౌంటర్ వేశాడట. హరికృష్ణ కొడుకులా లేవు అన్నాడట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించాడు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 20 2024, 07:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జయప్రద హోస్ట్ గా 2010లో ప్రసారమైన జయప్రదం టాక్ షోలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. యమదొంగ చిత్రానికి ముందున్న ఎన్టీఆర్ ఊబకాయాన్ని ఉద్దేశిస్తూ.. అప్పటి ఎన్టీఆర్ కి ఇప్పటి ఎన్టీఆర్... పూర్తిగా విరుద్ధం. బహుశా ట్విన్స్ అనుకోవచ్చేమో అన్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
NTR

NTR

నేను బరువు తగ్గాక యమదొంగ షూటింగ్ సమయంలో,  కమెడియన్ అలీ ముందుకు వెళ్లి ఇప్పుడెలా ఉన్నాను అన్నాను. ఆయన నా మీద కౌంటర్ వేశాడు. గతంలో హరికృష్ణ నాన్నలా ఉన్నావు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొడుకులా ఉన్నావు, అన్నాడు. అంటే గతంలో నేను అంత ఛండాలంగా ఉన్నానా? అంటే అంత పెద్ద వయసున్న వాడిగా కనిపించానా? అని అడిగాను. ఏమోలే.. హరికృష్ణ తండ్రిలా ఉన్నావని అనడం ద్వారా, తాత ఎన్టీఆర్ లా ఉన్నానని...  అలీ అనుకోకుండా పోల్చాడని..  నేను సంతోష పడ్డానని, ఎన్టీఆర్ అన్నారు. 

ఇక ఎన్టీఆర్ బరువు తగ్గడానికి రాజమౌళి కారణం అయ్యాడు. ఎన్టీఆర్ కి రాజమౌళి జ్ఞానోపదేశం చేశాడట. అసలు నీకు అర్థం అవుతుందా.. ఒక వర్గం ప్రేక్షకులు నీ సినిమాలు చూడటం లేదు. యూత్, అమ్మాయిలు ఇలా ఉంటే ఎలా ఇష్టపడతారు. నువ్వు బరువు తగ్గాలని రాజమౌళి అన్నారట. అప్పుడు ఎన్టీఆర్ లైపోసక్షన్ చేయించుకున్నాడట. బరువు తగ్గాక చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడట ఎన్టీఆర్. 

36

శరీరంలోని అధిక కొవ్వును తొలగించే ప్రక్రియను లైపోసక్షన్ అంటారు. ఇది ఒకింత ప్రమాదకరం కూడాను. సినిమా కోసం ఎన్టీఆర్ రిస్క్ చేయక తప్పలేదు. సింహాద్రి అనంతరం సినిమా సినిమాకు ఎన్టీఆర్ బరువు పెరుగుతూ పోయాడు. ఆహార ప్రియుడు కావడంతో పాటు, సహజంగా బరువు పెరిగే స్వభావం ఆయన శరీరానికి ఉంది. 2006లో విడుదలైన రాఖీ సినిమా నాటికి ఎన్టీఆర్... తన అభిమానులు కూడా జీర్ణించుకోలేని విధంగా తయారయ్యాడు. 

రాఖీ మూవీలోని ఎన్టీఆర్ లుక్ ని ఇప్పటికీ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటారు. సింహాద్రి అనంతరం ఎన్టీఆర్ కి ఆ రేంజ్ హిట్ మరలా పడలేదు. బాడీ షేమింగ్ కి గురైన ఎన్టీఆర్, వరుస ప్లాప్స్ తో డీలా పడ్డాడు. అప్పుడు రాజమౌళి రంగంలోకి దిగాడు. యమదొంగ ప్రాజెక్ట్ కోసం బరువు తగ్గాల్సిందే అని సూచించడంతో ఎన్టీఆర్ లైపోసక్షన్ చేయించుకున్నారు. 
 

46

యమదొంగ మూవీలో ఎన్టీఆర్ ని చూసిన ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ సినిమా సూపర్ హిట్. కంత్రి మూవీలో ఎన్టీఆర్ చాలా సన్నగా కనిపిస్తాడు. లుక్ ఏమంత బాగోదు. కొంచెం లావు అయ్యాక ఎన్టీఆర్ సెట్ అయ్యాడు. తర్వాత బరువు పెరగకుండా చూసుకున్నాడు. ఫిట్నెస్ పై దృష్టి పెట్టిన ఎన్టీఆర్ స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపిస్తున్నాడు.   

ప్రస్తుతం దేవర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా రూ. 500 కోట్ల మార్క్ చేరుకుంది. దసరా హాలిడేస్ ని దేవర బాగా ఉపయోగించుకుంది. 
 

56

మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ దేవర చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, నార్త్, ఓవర్సీస్ ఏరియాల్లో దేవర పెద్ద మొత్తంలో లాభాలు పంచింది. ఆర్ ఆర్ ఆర్ మినహాయిస్తే సోలోగా ఎన్టీఆర్ కి భారీ హిట్ పడింది. కెరీర్ హైయెస్ట్ నమోదు చేశాడు. దేవర నార్త్ లో సైతం విజయం సాధించిన నేపథ్యంలో పాన్ ఇండియా హీరో ట్యాగ్ సార్థకం అయ్యింది. 

 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి

 

66

దర్శకుడు కొరటాల శివ దేవరను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటించింది. సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, అజయ్, శ్రీకాంత్ ఇతర కీలక రోల్స్ చేశారు. అనిరుధ్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్. ముఖ్యంగా బీజీఎమ్ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించింది. దేవరతో ఎన్టీఆర్ మార్కెట్ రేంజ్ ఏమిటో రుజువైంది. ఇకపై ఎన్టీఆర్ సినిమాకు రూ. 100 కోట్లు వసూలు చేయడం ఖాయం. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Recommended image2
Irumudi: ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి, రాంచరణ్ ని కలిసిన రవితేజ
Recommended image3
Malavika Mohanan: అందరిముందు మాళవికని ఆమెతో పోల్చిన కార్తీ.. జెంటిల్మెన్ అంటూ పొగిడిన హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved