MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ అసలు పేరు ఏంటో తెలుసా? బారసాల్లో తల్లి పెట్టింది వేరు! ఇంట్రెస్టింగ్ స్టోరీ?

పవన్ కళ్యాణ్ అసలు పేరు ఏంటో తెలుసా? బారసాల్లో తల్లి పెట్టింది వేరు! ఇంట్రెస్టింగ్ స్టోరీ?

పవన్ కళ్యాణ్ అనేది ఆయన అసలు పేరు కాదన్న విషయం తల్లి అంజనాదేవి వెల్లడించాడు. బారసాల్లో పవన్ కళ్యాణ్ కి పెట్టిన పేరును ఆమె బయటపెట్టారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 06 2024, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pawan Kalyan

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ అనే పేరుకు ఓ బ్రాండ్ వాల్యూ ఉంది. అభిమానులు ఈ పేరు వింటే చొక్కాలు చించుకుంటారు. బహుశా పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి  డై హార్డ్ అభిమానులు మరొక హీరోకి ఉండరేమో. అన్నయ్య చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Pawan Kalyan

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ని పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ. ఈ చిత్రంలో రియల్ స్టంట్స్ చేసి పవన్ కళ్యాణ్ తెలుగు ఆడియన్స్ కి కొత్త అనుభూతిని పంచాడు. సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి వంటి విజయాలు పవన్ కళ్యాణ్ కి స్టార్డం తెచ్చిపెట్టాయి. 

2001లో విడుదలైన ఖుషి పవన్ కళ్యాణ్ కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. యూత్ పవన్ కళ్యాణ్ కి బాగా అట్రాక్ట్ అయ్యారు. ఖుషి అనంతరం పవన్ కళ్యాణ్ కి వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎక్కడగా తగ్గలేదు. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్ కి మంచి విజయాలు అందించాయి. ఆయన తిరిగి ట్రాక్ లో పడ్డాడు. 
 

36
Pawan Kalyan

Pawan Kalyan

కాగా పవన్ కళ్యాణ్ అసలు పేరు వేరట. ఈ విషయాన్ని తల్లి అంజనా దేవి స్వయంగా వెల్లడించింది. అంజనాదేవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పవన్ కళ్యాణ్ అన్నప్రాసన రోజు కత్తి పట్టుకున్నాడట. తండ్రి వెంకట్రావు దగ్గర ఒక కత్తి ఉండేదట. 

పెన్ను, పుస్తకం, డబ్బు, నగలతో పాటు కత్తి కూడా పవన్ కళ్యాణ్ ముందు ఉంచారట. పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకున్నాడట. కత్తి పట్టుకున్నాడంటే వీడు పెద్దయ్యాక కోపిష్టి అయినా అవుతాడు, లేదంటే ప్రజలకు మేలు చేసేవాడు అవుతాడని.. అంజనాదేవి భావించిందట. చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ కి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఎక్కువగా లైబ్రరీలో గడిపేవాడు. ఇప్పటికీ తన గదిలో చాలా పుస్తకాలు ఉంటాయి. 

46

ఈ పుస్తకాలు చదివే అలవాటు తండ్రి నుండి వచ్చిందని అంజనాదేవి అన్నారు. పవన్ కళ్యాణ్ అసలు పేరు ఏంటి? బారసాలలో పెట్టిన పేరు అదేనా? అని యాంకర్ అంజనాదేవిని అడిగింది. కాదని ఆమె సమాధానం చెప్పారు. మేము శ్రీ కళ్యాణ్ కుమార్ అని పెట్టాము. ఎవరో పవన్ అని పెట్టారట. అలా పవన్ కళ్యాణ్ గా స్థిరపడిపోయింది... అని అంజనాదేవి అన్నారు.  

కాగా చిరంజీవి కూడా స్క్రీన్ నేమ్ మార్చుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. స్క్రీన్ నేమ్ అనేది కొత్తగా, స్టైలిష్ గా ఉండాలి. ఇతర నటుల పేర్లతో పోలిక ఉండకూడదని చిరంజీవి భావించారట. అప్పుడు చిరంజీవికి ఓ కల వచ్చిందట. ఆ కలలో గర్భగుడి ఎదుట ఆయన  పడుకుని ఉన్నాడట. 
 

56
Chiranjeevi Konidela

Chiranjeevi Konidela

ఓ పాప వచ్చి... చిరంజీవి ఏంటి ఇక్కడ పడుకున్నావ్? వెళ్లి నీ పని చూసుకో అందట. తన ఫ్రెండ్ కూడా వచ్చి చిరంజీవి రా వెళదాం, అన్నాడట. వీళ్లు చిరంజీవి అని పిలుస్తున్నారేంటని ఆయన అనుకున్నారట. కలలో నుండి ఉలిక్కి పడి లేచిన ఆయన... ఈ విషయం తల్లితో చెప్పాడట. అప్పటి వరకు అలాంటి పేరు ఒకటి ఉంటుందని, అది తనకు ఇష్టమైన ఆంజనేయ స్వామి పేరని చిరంజీవికి తెలియదట. 

బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి 

66

చిరంజీవి స్క్రీన్ నేమ్ గా ఎందుకు పెట్టుకోకూడదని ఆయన అనుకున్నారట. అలా శివ శంకర్ వర ప్రసాద్ కాస్తా.. చిరంజీవి అయ్యాడు. చరిత్ర సృష్టించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి టాలీవుడ్ ని శాసించే హీరోలుగా ఎదిగారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం. ఆయన హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్స్ పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవల హరి హర వీరమల్లు చిత్రీకరణ తిరిగి ప్రారంభించినట్లు సమాచారం.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved