బక్క చిక్కిన శరీరం, దెయ్యపు కళ్ళు, అందవిహీనంగా తయారైన శృతి... గుర్తుపట్టడం కూడా కష్టమే!
తెల్లని శరీరం, తేనెకళ్లు, నాజూకైన నడుము... శృతి హాసన్ అనగానే మనకు గుర్తుచ్చే ఆమె అందాలు. తన గ్లామర్ తో సౌత్ ఇండియాను ఏలిన శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది. ముఖ్యంగా తెలుగు, తమిళ్ బాషలలో ఆమె స్టార్ హీరోల సరసన నటించారు.
ఒకప్పుడు గ్లామర్ కి బ్రాండ్ అంబాసర్ లా ఉండే శృతి హాసన్ మునుపటి మెరుపు కోల్పోయింది. అసలు శృతి హాసన్ అందం అంతా కనుమరుగై పోయింది. శృతి హాసన్ కెరీర్ బిగినింగ్ నుండి సన్నగానే ఉండేవారు. అయితే ముఖంలో వర్చస్సు, ఎత్తుకు తగ్గ బరువుతో ముచ్చగా అనిపించేవారు.
అయితే కొన్నాళ్లుగా శృతి హాసన్ తన అందం కోల్పోయిన భావన కలుగుతుంది. ముఖ్యంగా శృతి హాసన్ చాలా సన్నగా తయారయ్యారు. అలాగే ఆమె ముఖంలో మునుపటి చార్మ్ మాయమైంది.
ఇటీవల శ్రుతి తెలుగులో నటించిన క్రాక్, వకీల్ సాబ్ చిత్రాలలో ఆమె లుక్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. వకీల్ సాబ్ లో అయితే శ్రుతిని చూడలేకపోయారు. వకీల్ సాబ్ లో ఆమెది క్యామియో రోల్. కొద్దిసేపటికే శృతి స్క్రీన్ పై భరించడం ప్రేక్షకులకు కష్టమై పోయింది.
లవ్ ఫెయిల్యూర్ తరువాత శృతి హాసన్ లో ఈ మార్పు వచ్చింది. లవ్ బ్రేకప్ తరువాత ఆమె చాలా కాలం లండన్ లో ఉన్నారు. అక్కడ లైవ్ మ్యూజిక్ షోలు నిర్వహించారు. గత ఏడాది శృతి హాసన్ ఇండియాకు రావడం జరిగింది.
సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శృతికి పెద్దగా ఆఫర్స్ ఏమీ రాలేదు. కాంబినేషన్ కోసం క్రాక్ లో రవితేజ పక్కన తీసుకున్నారు. పవన్ మూవీలో తక్కువ నిడివి కలిగిన పాత్ర కావడంతో ఆమె వద్దకు వచ్చింది.
కాగా శృతి హాసన్ లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే ఫ్యాన్స్ షాక్ తినడం ఖాయం. అల్ట్రా స్టైలిష్ కాస్ట్యూమ్ ధరించి ఆమె ఓ క్రేజీ ఫోటో షూట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో శృతి చాలా అగ్లీగా కనిపించారు. బక్క చిక్కిన శరీరం, ఏలియన్స్ మాదిరి పూర్తిగా నలుపుగా మారిన కళ్ళతో ఆమె దెయ్యంలా కనిపించారు.
సాధారణంగా అందంగా కనిపించాలని హీరోయిన్స్ కోరుకుంటున్నారు. దానికి భిన్నంగా ఉన్న అందం కూడా తగ్గించుకొని, అగ్లీగా కనిపిస్తూ ఫోటో షూట్ చేస్తుంది శృతి హాసన్.