వి వి వినాయక్ సినిమా ఆఫర్ ఇస్తే.. బోరుమని ఏడ్చిన హీరోయిన్ ? కారణం ఏంటో తెలుసా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ కు ఓ వింత అనుభవం ఎదురైంది. తన సినిమాలో క్యారెక్టర్ ఆఫర్ చేయడానికి ఓ హీరోయిన్ దగ్గరకు వెళ్తే.. ఆమె ఏడవడం మొదలు పెట్టిందట. ఆమె అలా ఏడవడానికి కారణం ఏంటి? వినాయక్ ఆఫర్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

హీరోలను స్టార్స్ ను చేసిన దర్శకుడు
వి.వి వినాయక్ ఎంతో మంది టాలీవుడ్ హీరోలను స్టార్స్ ను చేశాడు. ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన వినాయక్.. ఆతరువాత కాలంలో కామెడీ జానర్ ను కూడా అద్భుతంగా హ్యాండిల్ చేయగలడు అని, అదుర్స్ సినిమాతో నిరూపించుకున్నాడు. ఒకప్పుడు ఎన్టీఆర్ తో ఆది సినిమా చేసి సంచలనం సృష్టించాడు వినాయక్. నాటు బాంబ్ లు, సుమో చేజింగ్ సీన్లు వినాయక్ సినిమాల్లో కామన్ గా కనిపిస్తుంటాయి. ఎన్టీఆర్ తో ఆది, అదుర్స్ లాంటి సినిమాలు చేసి హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు, బాలయ్య తో చెన్నకేశవ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక మెగాస్టార్ తో వినాయక్ తెరకెక్కించిన ఠాగూర్ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వినాయక్ ఆఫర్.. ఏడ్చేసిన హీరోయిన్
వి.వి వినాయక్ మంచి ఫామ్ లో ఉండగా.. ఆయన సినిమాలకు యమా క్రేజ్ ఉండేది. వినాయక్ సినిమా అంటే కళ్లు మూసుకుని సైన్ చేసేవారు ఆర్టిస్ట్ లు. ఆయన ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేయడం అనే మాట ఉండదు. కానీ చెన్నకేశవరెడ్డి సినిమా టైమ్ లో మాత్రం వినాయక్ కు ఓ విచిత్ర అనుభవం ఎదురయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది అని అనుకుంటే.. అప్పుడు వినాయక్ కు హీరోయిన్ లయ గుర్తుకువచ్చింది. వెంటనే రామోజీ ఫిల్మ్ సిటీలో లయ ఏదో షూటింగ్ లో ఉన్నారని తెలిసి, వెళ్లి విషయం చెప్పారట వినాయక్. కథ కూడా చెప్పారట. ఇందులో బాలయ్య చెల్లెలి పాత్ర చేయాలి అనిచెప్పడంతో లయ ఏడవడం స్టార్ట్ చేసిందట.
తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా పనిచేయరా?
వినాయక్ లయకు బాలయ్య చెల్లెలి పాత్రను ఆఫర్ చేశారు. కానీ అప్పటికీ లయ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్నారు. వినాయక్ ఇచ్చిన ఆఫర్ ఆమెను బాధపెట్టింది. వెంటనే వినాయక్ తో లయ ఇలా అన్నారు.. '' తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా పనిచేయరా సార్..? ఎంతసేపు క్యారెక్టర్ రోల్స్ ఇద్దామనే చూస్తారా ..? '' అని కన్నీళ్లు పెట్టుకున్నారు. చెన్నకేశవరెడ్డి సినిమాలో బయట నుంచి ఇద్దరు హీరోయిన్లను తీసుకుని.. చెల్లెలు పాత్ర కోసం తెలుగు హీరోయిన్ ను అడగటం ఆమెను బాధపెట్టింది. ఇక వెంటనే వినాయక్.. ''అదేం లేదమ్మ.. నువ్వు అయితే ఈ పాత్రకు బాగుంటావు అని అనుకున్నాను అంతే.. '' అని చెప్పి ఓదార్చి.. అక్కడ నుంచి వచ్చేశారు. ఈ విషయాన్ని వినాయక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఈ పాత్ర కోసం వినాయక్ హీరోయిన్ దేవయానికి సంప్రదించారు. ఆమె ఈ కథ వినగానే క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు.
రీ ఎంట్రీ ఇచ్చిన లయ
చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉంటూ వస్తోన్న లయ.. రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల హవా తగ్గిపోయిన టైమ్ లో..లయ మాత్రమే స్టార్ డమ్ తో కొనసాగింది. బాలయ్య, శ్రీకాంత్, వేణు, శివాజీ లాంటి హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ.. దూసుకుపోయింది. హీరోయిన్ గా సినిమాలు తగ్గిపోతున్న టైమ్ లో, ఓ డాక్టర్ ను పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయ్యింది లయ. టైమ్ అంతా తన కుటుంబానికే కేటాయించింది. పిల్లలు పెద్దవాళ్లు అవ్వడంతో.. మళ్లీ వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది లయ. రీసెంట్ గా నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమాలో.. హీరో అక్క పాత్రలో కనిపించింది మాజీ హీరోయిన్. టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నాయని, సెలక్టీవ్ గా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నట్టు లయ ఓ సందర్భంలో వెల్లడించింది.