- Home
- Entertainment
- బాలకృష్ణ తల్లి పాత్రలో సౌందర్య మిస్ అయిన సినిమా ఏదో తెలుసా? డైరెక్టర్ అడిగితే ఆమె ఏమన్నారంటే?
బాలకృష్ణ తల్లి పాత్రలో సౌందర్య మిస్ అయిన సినిమా ఏదో తెలుసా? డైరెక్టర్ అడిగితే ఆమె ఏమన్నారంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణకు తల్లి పాత్రలో సౌందర్య మిస్ అయిన సినిమా ఏదో తెలుసా? అసలు బాలయ్య తల్లిగా సౌందర్య నటించడం ఏంటి? ఈప్రపోజల్ పెట్టిన దర్శకుడు ఎవరు? ఆసినిమా ఏంటి?

సావిత్రి స్థానంలో సౌందర్య..
తెలుగు సినీ పరిశ్రమలో సావిత్రి శకం ముగిసిన తరువాత అంతటి పేరు సంపాదించిన నటి మరెవరు లేరు. కానీ కన్నడ పరిశ్రమ నుంచి వచ్చినా.. సావిత్రిని మరిపించింది సౌందర్య. సావిత్రి తరువాత అంతటి పేరు సౌందర్య సాధించింది. ఫ్యాషన్ ప్రపంచం వేర్లు బలంగా నాటుకుంటున్న టైమ్ లో.. మోడ్రన్ డ్రెస్ లు వేసుకోకుండా.. చీకట్టుతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సౌందర్య. 90 దశకంలో.. టాలీవుడ్ ను ఊపేస్తోన్న చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. అంతే కాదు శ్రీకాంత్, జగపతిబాబు, సురేష్, లాంటి టైర్ 2 హీరోల సరసన కూడా నటించి మెప్పించింది సౌందర్య. సహజ నటనతో సావిత్రిని మరిపించిన సౌందర్య.. తెలుగు పరిశ్రమలో మరో మహానటిగా పేరు తెచ్చకుంది. అంతే కాదు సావిత్రి లాగానే చాలా చిన్న వయసులో మరణించింది సౌందర్య. ఓ హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె కన్నుమూసింది.
బాలకృష్ణతో ఒక్క సినిమాలో నటించి సౌందర్య..
టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడిన సౌందర్య.. నటసింహం బాలయ్య తో మాత్రం ఒకే ఒక్క సినిమాలో నటించారు. మరో సినిమాలో నటించినా.. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. సౌందర్య , బాలయ్య కాంబోలో వచ్చిన ఏకైక సినిమా టాప్ హీరో. 1994 డిసెంబర్ 9 రిలీజ్ అయిన ఈ సూపర్ హిట్ మూవీని ఎస్వీ కృష్ణరెడ్డి డైరెక్ట్ చేశారు. ఇక ఈసినిమా తరువాత వీరిద్దరి కాంబోలో నర్తనశాల సినిమా స్టార్ట్ అయ్యింది. కానీ అంతలోనే సౌందర్య మరణంతో ఈ సినిమానే ఆగిపోయింది. సౌందర్య కన్నుమూయడంతో మరో హీరోయిన్ లేకుండా వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ విధంగా బాలయ్య , సౌందర్య కాంబినేషన్ లో ఒక సినిమా మాత్రమే రావడం విశేషం.
బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన సౌందర్య...
కెరీర్ మొత్తం మీద బాలకృష్ణతో ఒక్క సినిమానే చేసింది సౌందర్య. ఈక్రమంలో బాలయ్యతో ఓ బ్లాక్ బస్టర్ మూవీ చేసే అవకావం సౌందర్యకు వచ్చింది. కానీ ఈసినిమాను స్వయంగాఆమె రిజెక్ట్ చేసింది. దానికి కారణం ఈసినిమాలో సౌందర్య పాత్ర.. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు బాలకృష్ణ, వివి వినాయక్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ చెన్నకేశవ రెడ్డి. ఈసినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా సౌందర్యను తీసుకోవాలని డైరెక్టర్ వినాయక్ అనుకున్నారట. బెంగళూరు వెళ్ళి కథ కూడా వినిపించారట. కథ మొత్తం విన్న తరువాత సౌందర్యఈ పాత్రను తాను చేయలేనని చెప్పారట.
సౌందర్య రిజెక్ట్ చేయడానికి కారణం
బాలకృష్ణతో అసలు సినిమాలే చేయలేదు అనుకుంటే.. వచ్చిన ఈ అవకాశాన్ని కూడా సౌందర్య వదిలేసుకుంది. కానీ దానికి ఓ కారణం కూడా ఉంది. చెన్నకేశవరెడ్డి సినిమాలో టబు చేసిన పాత్ర కోసం సౌందర్యను అడిగారట వినాయక్. అయితే ఈ పాత్ర బాలయ్యకు భార్య గా ఒక ఫేజ్ ఉంటే.. మరో ఫేజ్ లో యంగ్ బాలయ్యకు తల్లి పాత్ర చేయాల్సి ఉంటుంది. కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్న సౌందర్యకు.. ఆ పాత్ర చేయాలి అనిపించలేదు. హీరోయిన్ గా తన కెరీర్ కు దెబ్బ పడుతుందేమో అని భయపడింది. దాంతో వినాయక్ కు ఇదే విషయం చెప్పేసిందట సౌందర్య. గతంలో వినాయక్ సౌందర్య సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన పరిచయం ఉంది. ఆ చనువుతోనే డైరెక్ట్ గా వినాయక్ తో సౌందర్య ఈ విధంగా అన్నారు ''హీరోయిన్ గా నటిస్తున్న టైమ్ లో.. ఓల్డ్ క్యారెక్టర్ చేయడం కరెక్ట్ కాదేమో వినాయక్ గారు'' అని రిక్వెస్ట్ గానే సౌందర్య ఈ విషయం చెప్పారు. దాంతో వినాయక్ నెక్ట్స్ ఆప్షన్ గా టబు దగ్గరకు వెళ్తే.. వెంటనే ఈ పాత్రకు ఆమె ఒకే చెప్పారట. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వినాయక్ వెల్లడించారు.
సూపర్ హిట్ సినిమా
బాయల్య కెరీర్ లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల తరువాత ఆ రేంజ్ లో హిట్ అయిన సినిమా చెన్నకేశరెడ్డి. ఈసినిమా చూసి నందమూరి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. టబు తో పాటు శ్రియా గ్లామర్ ఈసినిమాకు అడిషనల్ గా బ్యూటీని అందించింది. బాలయ్య యాక్షన్ సీన్స్, వినాయక్ మార్క్ సుమో చేజింగ్ లు.. మణిశర్మ మోలోడీ మాయాజాలంతో మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఓవర్ ఆల్ గా చెన్నకేశవరెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. బాలయ్య కెరీర్ లో అద్బుతం చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచింది చెన్నకేశవరెడ్డి సినిమా. కానీ ఈసినిమాలో టబు చేసిన పాత్రను సౌందర్య మిస్ అయ్యింది.