- Home
- Entertainment
- Vrushakarma Trailer Review: ఏమాత్రం మెప్పించలేని వృషకర్మ ట్రైలర్.. నాగచైతన్యకిది సాహసమే
Vrushakarma Trailer Review: ఏమాత్రం మెప్పించలేని వృషకర్మ ట్రైలర్.. నాగచైతన్యకిది సాహసమే
నాగచైతన్య, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన `వృషకర్మ` మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇది రొటీన్‌గానే సాగింది. ఏమాత్రం కొత్తదనం కనిపించలేదు. మరి సినిమా ఎలా ఉంటుందనేది చూస్తే.

వృషకర్మ ట్రైలర్ వచ్చింది
నాగచైతన్య, మీనాక్షి చౌదరీ జంటగా నటిస్తోన్న చిత్రం `వృషకర్మ`. `విరూపాక్ష` ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ వచ్చింది. ఈ మూవీ వచ్చే నెల 4న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్. అందులో భాగంగా గురువారం ట్రైలర్‌ని విడుదల చేశారు.
మరి ఇది ఎలా ఉందనేది చూస్తే. ట్రైలర్ ప్రారంభంలో ఇంట్రెస్టింగ్గా సాగింది. కోటకు గబ్బిలాలు వేలాడుతుంటాయి. ఆ తర్వాత ఓ చిన్నారి వైపు టర్న్ తీసుకుంటుంది. అతీంద్రియ శక్తులు తన బలిని ఎంచుకుందని చెప్పగా, అది ఆ చిన్నారినే అని అర్థమవుతుంది. పక్షులు వెంటాడుతుంటాయి. ఆ అమ్మాయి ఒక వెలిగే రాయిని పట్టుకోగా, ఆమెలో అతీంద్రియ శక్తి ఆవహించినట్టుగా చూపించారు.
వృషకర్మ ట్రైలర్లో ఏం చూపించారంటే
ఆ తర్వాత కొన్ని అనుమానాస్పద, భయానక సన్నివేశాలు, మాయా శక్తులు, అవి చేసే దాడిని చూపించారు. అనంతరం పూరావస్తు శాఖ తవ్వకాలు చేయగా, ఒక కేవ్‌లో ఐదు వేల సంవత్సరాల నాటి శిల్పాలు బయటపడినట్టు చూపించారు. ఆ సమయంలోనే నీ హెల్ప్ కావాలని జయరాం అడగ్గా, నాగచైతన్య ఎంట్రీ ఇచ్చారు.
ముందు పనేంటో చెప్పండి అంటూ చైతూ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా, యాక్షన్, అడ్వెంచర్ చేస్తున్న సీన్లని చూపించారు. గుహలో కొన్ని కొత్త తరహా శిల్పాలు, రూపాలు కనిపిస్తాయి. వీటి విషయంలో చైతూ అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తుంటాడు. ఇంతలో `మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చబోతున్న ఒక అతీంద్రియ శక్తి తిష్ట వేసింది అని ఒక వాయిస్ చెప్పగా, ఒక చిన్నారి పుట్టుక సస్పెన్స్ గా ఉంటుంది.
ఇంతలో విలన్ రాక్షసుడిగా ఎంట్రీ ఇస్తాడు. మనకు అందని సైన్స్ వాళ్లది, వేది క్ సైన్స్ అని చైతూ చెప్పగా, ఒక కోటలో విలన్ విశ్వరూపం చూపిస్తాడు. ఈ క్రమంలో కొన్ని భయానక యాక్షన్ సీన్లు వస్తాయి. సృష్టి ధర్మాన్ని కాపాడటం కోసం ఆ దేవుడు నిన్ను ఎంచుకున్నాడని చెప్పడం విశేషం.
వృషకర్మ ట్రైలర్ ఎలా ఉందంటే?
ట్రైలర్ కొంత వరకు ఆకట్టుకుంది. సస్పెన్స్ గా సాగింది. కానీ పెద్దగా ఎగ్జైటింగ్‌గా అనిపించలేదు. వాహ్ ఫీలింగ్ అస్సలు కలిగేలా లేదు. రొటీన్ హర్రర్, థ్రిల్లర్.. సైకలాజికల్ థ్రిల్లర్స్ ని తలపించింది. అదే సమయంలో విరూపాక్ష, మిరాయ్ వంటి కొన్ని చిత్రాలను తలపించేలా ట్రైలర్ సాగింది. పెద్దగా ఆకట్టుకునేలా లేదని చెప్పొచ్చు.
అయితే ఇలాంటి చిత్రాలు వెండితెరపైనే మ్యాజిక్ చేస్తుంటాయి. కథనం చాలా ఇంపార్టెంట్. చూస్తున్నంత సేపు ఆకట్టుకుంటాయి. గూస్ బంమ్స్ తెప్పిస్తాయి. ఉత్కంఠభరితంగా సాగుతూ భయపెడుతుంటాయి. మరి `వృషకర్మ` అలా ఆకట్టుకుంటుందా అనేది చూడాలి. `విరూపాక్ష`తో తానేంటో నిరూపించుకున్నాడు దర్శకుడు కార్తీక్ దండు. ఇప్పుడు ఆయన మీదే నమ్మకం. ఎంత వరకు మ్యాజిక్ చేస్తాడో చూడాలి.















