- Home
- Entertainment
- చిన్నప్పుడే ఆ వ్యాధి, అందుకే బరువు పెరిగా..ఇండస్ట్రీలో హేళన చేశారు, వైవా హర్ష భావోద్వేగం
చిన్నప్పుడే ఆ వ్యాధి, అందుకే బరువు పెరిగా..ఇండస్ట్రీలో హేళన చేశారు, వైవా హర్ష భావోద్వేగం
ప్రముఖ కమెడియన్ వైవా హర్ష ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా రోల్స్ చేసి నవ్వించారు. వైవా హర్ష కామెడీ టైమింగ్ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటుంది.

ప్రముఖ కమెడియన్ వైవా హర్ష ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా రోల్స్ చేసి నవ్వించారు. వైవా హర్ష కామెడీ టైమింగ్ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటుంది. అయితే వైవా హర్ష తొలిసారి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సుందరం మాస్టర్. ఫిబ్రవరి 23న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలో హర్ష వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నవ్విస్తూ కనిపించే హర్ష మనసులో చాలా బాధనే దాచుకున్నాడు. ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవమానాలన్నీ బయట పెట్టాడు. తన శరీరాకృతిపై, బాడీ షేమింగ్ పై హర్ష భావోద్వేగానికి గురయ్యాడు.
తనకి బాడీ షేమింగ్ కామెంట్స్ స్కూల్ స్టేజ్ నుంచే ఎదురయ్యాయని హర్ష తెలిపాడు. కనీసం ట్రైన్ లో ప్రయాణించాలన్నా భయపడేవాడిని. నా కలర్, బరువు గురించి పరోక్షంగా కామెంట్స్ చేసినప్పుడు చాలా కుమిలిపోయేవాడిని. చిన్నప్పుడు నాకు ఆస్తమా ఉండేది. అది తగ్గడం కోసం స్టెరాయిడ్స్ ఇచ్చారు. అందువల్లే బరువు పెరిగాను అని హర్ష తెలిపాడు.
కలర్ ఫోటో చిత్రంలో నటించే వరకు మనం ఇండస్ట్రీకి ఎందుకు వచ్చామో అనే విషయం అర్థం కాలేదు. అంతకు ముందు ఇష్టం లేకపోయినా పిచ్చి పిచ్చి పాత్రలు చేశాను. షూటింగ్ సమయంలో నా కలర్, బాడీ పై జోకులు వేసేవారు. డబ్బు కోసం ఈ అవమానాలు తప్పవు అని భరించినట్లు వైవా హర్ష భావోద్వేగానికి గురయ్యారు.
అయితే తనని వ్యక్తిగతంగా ఎవరూ కామెంట్ చేయలేదు అని అన్నారు. ఇదిలా ఉండగా వైవా హర్ష నటిస్తున్న సుందరం మాస్టర్ చిత్రాన్ని నిర్మిస్తోంది ఎవరో కాదు.. మాస్ మహారాజ్ రవితేజ.
రవితేజ ప్రొడక్షన్ లో వస్తుండడం కూడా ఈ చిత్రానికి అడ్వాంటేజ్ గా మారింది. దివ్య శ్రీపాద, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విజయం సాధిస్తే టాలీవుడ్ లో మరో కామెడీ హీరో వచ్చినట్లే అని చెప్పొచ్చు.