విష్వక్‌సేన్ ‘మెకానిక్ రాకీ’ OTT ఫ్లాట్ ఫామ్, రిలీజ్ డేట్
ఈ సినిమా థియేట్రికల్ రన్ త్వరగా పూర్తై పోవటంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాని స్ట్రీమింగ్ కు రెడీ చేసింది.
Vishwak Sen, Mechanic Rocky
ఈ సంవత్సరంలో విష్వక్‌సేన్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మూడో చిత్రం... ‘మెకానిక్ రాకీ’ (Vishwak Sen New Movie). ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తర్వాత ప్రేక్షకుల తీర్పుని కోరిన చిత్రమిది. స్ట్రాంగ్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెకానిక్ రాకీ’(Mechanic Rocky). మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనింగ్‍గా నవంబర్ 22న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ఏ ఓటిటిలో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.
'మెకానిక్ రాకీ' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ త్వరగా పూర్తై పోవటంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాని స్ట్రీమింగ్ కు రెడీ చేసింది. డిసెంబర్ 19 నుంచి ఆ చిత్రం ఓటీటిలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. థియేటర్ లో జనం పట్టించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఓటిటిలో మంచి రెస్పాన్స్ వస్తుందనే భావిస్తున్నారు.
మాస్ ఎలిమెంట్స్ కారణంగా ఇది కమర్షియల్ సినిమా అనిపిస్తుంది. కానీ, నిజానికి ఇది క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఫక్తు థ్రిల్లర్ సినిమాకి అవసరమైన సరకున్న కథ.చాలావరకు సీరియస్ అంశాలున్న ఈ సినిమాకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించటం మైనస్ గా మారింది. వాటి కారణంగా కథలో డెప్త్ కొరవడింది. కామెడీ సీన్స్, పాటల మధ్య ఫస్టాఫ్ లో కథే ముందుకు కదలదు.
పాత్రలు నడుచుకునే విధానం మొదలుకుని కథలో చోటు చేసుకునే పరిణామాల వరకూ ఏవీ సహజంగా అనిపించవు. దాంతో ప్రేక్షకుడు కథలో లీనం కాలేడు. కామెడీ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. విష్వక్‌సేన్ ఓల్డ్ గెటప్‌లో కనిపించి చేసిన హంగామా కాస్త అలరిస్తుంది విశ్వక్ సేన్ తన సూట్ అయ్యే పాత్రలో నటించాడు. విశ్వక్ సేన్ గత చిత్రాల్లో లాగే అతడి యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ డైమింగ్ ఉంటాయి.
ప్రధానంగా ఫస్ట్ హాఫ్ లో బోరింగ్ కామెడీ, సరైన కథ లేకపోవడం, ఇంటర్వెల్ వరకు ఆసక్తి కలిగించకపోవడం మైనస్ గా మారాయి. కమర్షియల్ ఫార్మాట్ లో ట్రై చేసినప్పుడు అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా ప్యాకేజ్ లాగా కుదరాలి. మెకానిక్ రాకీ చిత్రంలో అది జరగలేదు.
స్క్రీన్ ప్లే కూడా చాలా రొటీన్ అనిపిస్తుంది. కామెడీ సన్నివేశాలు నవ్వించకపోవగా చిరాకు పుట్టించేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ లైన్ అసలు ఉండదు. ఇంటర్వెల్ ని ట్విస్ట్ తో ఎండ్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు ఆసక్తిగా అనిపిస్తాయి. కానీ ఆ ట్విస్ట్ లని ఉపయోగించుకుని కథని బిల్డ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ లో కామెడీ కూడా కాస్త వర్కౌట్ అయింది.
కథేంటంటే::
మలక్ పేటలో గ్యారేజ్ నడుపుతున్న నగుమోము రామకృష్ణ (నరేష్) కొడుకు రాకేష్ అలియాస్ రాకీ (విశ్వక్ సేన్). బీటెక్ డ్రాప్ అవుట్ అయిన రాకీ.. తండ్రితో కలిసి గ్యారేజ్, డ్రైవింగ్ స్కూల్ పనులు చూస్తుంటాడు. అయితే రంకి రెడ్డి (సునీల్) గ్యారేజ్ స్థలంపై కన్నేయడంతో రాకీ లైఫ్ లో సమస్యలు మొదలవుతాయి.
అదే సమయంలో డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన మాయ (శ్రద్ధ శ్రీనాథ్) ఆ సమస్యల నుండి అతన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంది. కానీ కొత్త సమస్యలు వచ్చి పడతాయి. అసలు మాయ ఎవరు..? అతనికి ఎందుకు హెల్ప్ చేసింది..? ఆ సమస్యల నుండి రాకీ ఎలా బయటపడ్డాడు? అతని జీవితంలో ప్రియా ( మీనాక్షి చౌదరి)కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి..? అనే విషయాలు తెలియాలంటే సినిమా ఓటిటిలో చూడాల్సిందే.
read more: నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఎర్ర చందనం దొంగ హీరోనా.. అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు వివాదం?