- Home
- Entertainment
- హీరోయిన్ కాకుండానే చనిపోతాననుకున్నా.. ఛాన్స్ ఇచ్చిన దర్శకేంద్రుడు, విష్ణుప్రియ కామెంట్స్
హీరోయిన్ కాకుండానే చనిపోతాననుకున్నా.. ఛాన్స్ ఇచ్చిన దర్శకేంద్రుడు, విష్ణుప్రియ కామెంట్స్
టాలీవుడ్ అందాల యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది.

టాలీవుడ్ అందాల యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ.
సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. విష్ణుప్రియ తరచుగా చేసే ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి.
విష్ణు ప్రియా తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పెడుతోంది. తన ఇంట్లోనే విష్ణుప్రియ మెలికలు తిరిగే డ్యాన్స్ తో కనువిందుచేస్తుండడం చూస్తూనే ఉన్నాం. పాపులర్ సాంగ్స్ అన్నింటికీ విష్ణుప్రియ డాన్స్ చేస్తూ ఉంటుంది. అనసూయ, శ్రీముఖి తరహాలోనే తాను కూడా నటిగా రాణించాలనే ఉద్దేశంతో విష్ణుప్రియ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
Vishnupriya
సుడిగాలి సుధీర్, యాంకర్ దీపికా పిల్లి జంటగా నటిస్తున్న 'వాంటెడ్ పండుగాడ్' చిత్రంలో విష్ణు ప్రియ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పిస్తున్న ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకుడు. ఈ చిత్ర మీడియా సమావేశంలో విష్ణు ప్రియ మాట్లాడుతూ.. తాను హీరోయిన్ అవ్వకుండానే చనిపోతానేమో అని భయపడ్డాను అని తెలిపింది.
కానీ రాఘవేంద్ర రావు గారు పండుగాడ్ చిత్రంలో తనకు గొప్ప అవకాశం ఇచ్చారని విష్ణుప్రియ మురిసిపోయింది. ఈ చిత్రంలో సుధీర్, దీపికా పిల్లి, విష్ణు ప్రియ, అనసూయ, సునీల్, బ్రహ్మానందం లాంటి క్రేజీ నటులు నటిస్తున్నారు.
ఛాన్స్ వస్తే వెండితెరపై గ్లామర్ ఒలకబోయాలని చూస్తున్న విష్ణు ప్రియకి ఈ చిత్రంలో ఎలాంటి రోల్ పండిందో వేచి చూడాలి. సుధీర్, విష్ణుప్రియ మధ్య ఆల్రెడీ మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరూ పోవేపోరా షోలో యాంకర్స్ గా చేశారు.