విష్ణుప్రియకు షాక్.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫైనలిస్ట్ లు వీళ్లే..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. చివరి వారానికి వచ్చింది. టాప్ 5 కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు. ఈవారం డబుల్ఎలిమినేషన్ లో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు బయటకు వెళ్ళిపోయారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరివారానికి చేరింది. 14 వారాలు కంప్లీట్ అయ్యి.. 15వారంలోకి ఎంటర్ అయ్యింది. ఈ వారం ఎలిమినేషన్ కు కాదు.. విన్నర్ కు ఓటు వేయాల్సి వస్తుంది. ఇక ఫైనల్ వారం ఆటకోసం టాప్ 5 మెంబర్స్ ఎవరోతెలిసిపోయింది. ఈవారం అంటే 14 వారం వీకెండ్ లో డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. శనివారం ఎపిసోడ్ లో రోహిణి ఎలిమినేట్ అవ్వగా.. ఆదివారం ఎపిసోడ్ లో విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది.
టాప్ 5లో అవకాశం కోల్పోయింది విష్ణుప్రియ. ఈ వారం వీకెండ్ లో డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా.. ఆదివారం ఎపిసోడ్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఎప్పుడు నామినేషన్స్ లో ఉన్నవారిని సేవ్ చేస్తూ వచ్చిన నాగార్జున.. ఈసారి మాత్రం ఫైనలిస్ట్ ల ను రివిల్ చేస్తూ ఎపిసోడ ను రన్ చేశారు. ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాశ్ కాగా.. సెకండ్ ఫైనలిస్ట్ గా నిఖిల్, థర్డ్ ఫైనలిస్ట్ గా గౌతమ్, ఫోర్త్ ఫైనలిస్ట్ గా ప్రేరణ విన్అయ్యారు.
ఇక మిగిని ఇద్దరు నబిల్, విష్ణు ప్రియ కాగా.. వారిలో నబిల్ ఫైనల్స్ కు వెల్ళాడు.. విష్ణు ప్రియ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. అసలు విష్ణు ప్రియ ఇక్కడివరకూ రావడమే గొప్పవిఫయం అనుకోవాలి. ఎందుకుంటే హౌస్ లో పృధ్వీతో లవ్ ట్రాక్ తప్పించి గేమ్ పై పెద్దగా శ్రద్దపెట్టలేదు విష్ణు. అంతే కాదు బాగా ఆడగలిగి ఉంది, ఈ సీజన్ లో లేడీ విన్నర్ అవ్వాల్సిన అన్ని లక్షణాలు ఉండి కూడా.. పృధ్వీ వెంట పడుతూ.. తన గ్రాఫ్ ను తానే తగ్గించుకుంది.
అయినా సరే వీరి లవ్ ట్రాక్ ఆమెను ఇంత దూరం తీసుకువచ్చింది. అంతే కాదు విష్ణు ప్రియ ఎవరు చెప్పినా వినలేదు. కాని ఆడియన్స్ ఆమెకు ఓట్లు వేస్తూ వచ్చారు. ఇక 14 వారాలు హౌస్ లో ఉండి చాలా నామినేషన్లు ఫేస్ చేసిన విష్ణు ప్రియ తాజాగా ఎలిమినేట్ అయ్యి బయటకువెళ్లింది. 13 వారం ఎలిమనేషప్ లో పృధ్వీ బయటకు వెళ్ళిపోగా.. 14 వారం విష్ణు ఎలిమినేట్ అయ్యింది. ఇక వెళ్తు వెళ్తు.. విన్నర్ ఎవరు అవుతారు అనే విషయంపై తన అభిప్రయాన్ని వెల్లడించింది.
ఎప్పుడు గ్రాహాలు అని మాట్లాడే విష్ఖుకు దానికి సబంధించిన టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఇక నిఖిల్ ను విన్నర్ గా చెప్పిన విష్ణు.. సెకండ్ ప్లేస్ ను ప్రేరణకు ఇచ్చింది. చివరి స్థానాన్ని గౌతమ్ కు ఇచ్చి.. నీ ఆట నేను చూడలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్లి వరుసగా ఎపిసోడ్స్ చూస్తాను అంది. సో అలా విష్ణు ప్రియ ఎలిమినేట్ అయ్యి... ఫైనల్స్ లిస్ట్ పిక్స్ అయ్యింది. ఇక ఫైనల్స్ లో నిఖిల్, గౌతమ్, నబిల్,ప్రేరణ, అవినాశ్ ఉన్నారు.
ఇక వీరిలో విన్నర్ ఎవరు అనేది మరో వారంలో తేలిపోతుంది. ఎక్కువగా ఫైట్ నిఖిల్, గౌతమ్ మధ్య ఉండే అవకాశం ఉంది. ఇద్దరిలోఎవరో ఒకరు విన్ అయ్యి..ఇంకొకరు రన్నర్ గానిలిచే అవకాశం ఉంది. చూడాలి ఈ వారం ఎవరికి ఓట్లు ఎక్కువగా పడతాయి.. ఎవరు విన్ అవుతారు అనేది. ఇక బిగ్ బాస్ వీకెండ్ హంగామా మాత్రం ఎప్పటిలాగానే కొనసాగింది. సన్ డే ఫన్ డే అయ్యింది. రకరకాల ఈవెంట్స్ తో సందడి చేశారు నాగ్. అందులో భాగంగా అవినాశ్ ను ఒక ఆట ఆడేసుకున్నారు. కామెడీ టైమింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు అవినాశ్.