- Home
- Entertainment
- నవ్య నా బెస్ట్ ఫ్రెండ్, ఆమె ప్రపోజ్ చేస్తే లవ్ గురించి ఆలోచిస్తా.. విరూపాక్ష నటుడు రవికృష్ణ కామెంట్స్
నవ్య నా బెస్ట్ ఫ్రెండ్, ఆమె ప్రపోజ్ చేస్తే లవ్ గురించి ఆలోచిస్తా.. విరూపాక్ష నటుడు రవికృష్ణ కామెంట్స్
బుల్లితెరపై నటీనటులు, బిగ్ బాస్ సెలెబ్రిటీల మధ్య తరచుగా లవ్ ఎఫైర్ రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. సుడిగాలి సుధీర్, రష్మీ.. దీప్తి సునైనా, షణ్ముఖ్ లాంటి సెలెబ్రిటీల మధ్య ప్రేమ వార్తలు తరచుగా చూస్తూనే ఉన్నాం.

బుల్లితెరపై నటీనటులు, బిగ్ బాస్ సెలెబ్రిటీల మధ్య తరచుగా లవ్ ఎఫైర్ రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. సుడిగాలి సుధీర్, రష్మీ.. దీప్తి సునైనా, షణ్ముఖ్ లాంటి సెలెబ్రిటీల మధ్య ప్రేమ వార్తలు తరచుగా చూస్తూనే ఉన్నాం. అలా ప్రేమాయణం సాగిస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తున్న జంటలలో బిగ్ బాస్ రవికృష్ణ, నటి నవ్య కూడా ఉన్నారు.
వీళ్లిద్దరి గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. కానీ రవికృష్ణ కానీ, నవ్య స్వామి కానీ ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. వీళ్ళిద్దరూ సూపర్ హిట్ సీరియల్స్ లో నటించారు. రవికృష్ణ ప్రస్తుతం సినిమాలతో కూడా పాపులర్ అవుతున్నాడు.
రీసెంట్ బ్లాక్ బస్టర్ విరూపాక్ష చిత్రంలో రవికృష్ణ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. రవికృష్ణ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. రవికృష్ణ పాత్ర ఊహించని విధంగా ఉంటుంది. బుల్లితెరపై లవర్ బాయ్ లాగా కనిపించే రవికృష్ణ విరూపాక్ష చిత్రంలో కాస్త భయపెట్టాడు అనే చెప్పాలి.
విరూపాక్ష సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రవికృష్ణ తాజాగా ఇంటర్వ్యూలో నవ్య స్వామితో రిలేషన్ గురించి ఓపెన్ అయ్యాడు. రూమర్స్ గురించి స్పందిస్తూ.. ఒక సూపర్ హిట్ సీరియల్ లో కలసి నటించిన తర్వాత అలాంటి రూమర్స్ సహజమే. నవ్య ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్. అయితే మా ఇద్దరి మధ్య ఇంతవరకు ప్రేమ పెళ్లి అనే ఆలోచననే లేదు అని రవికృష్ణ తెలిపాడు.
మేమిద్దరం ప్రేమలో ఉన్నామనే వార్తల్లో వాస్తవం లేదు అని తెలిపాడు. భవిష్యత్తులో నవ్య వైపు నుంచి ప్రపోజల్ వస్తే ఆలోచిస్తా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు రవికృష్ణ బదులిచ్చాడు.
దీనితో రవికృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రవికృష్ణ మనసులో నవ్య స్వామి ఉన్నట్లే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విరూపాక్ష తరహాలో ఎలాంటి వైవిధ్యమైన పాత్రలైనా చేస్తానని రవికృష్ణ తెలిపారు.