- Home
- Entertainment
- Janaki Kalaganaledu: రామచంద్రను పొగుడుతున్న ఊరి ప్రజలు.. జ్ఞానాంబ పేరు మీద గుడికి విరాళం ఇచ్చిన జానకి!
Janaki Kalaganaledu: రామచంద్రను పొగుడుతున్న ఊరి ప్రజలు.. జ్ఞానాంబ పేరు మీద గుడికి విరాళం ఇచ్చిన జానకి!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ(jnanamba), రామచంద్ర ఇంటర్వ్యూ ఈ విషయంలో టెన్షన్ పడుతూ ఉండగా జానకి(janaki)వచ్చి ధైర్యం చెబుతుంది. మీ హుందాతనంతో నే వాళ్ళు ప్రశ్నలు అడగడానికి భయపడతారు అంటూ జ్ఞానాంబ కు ధైర్యం చెబుతుంది జానకి. ఇక జానకి మాట్లాడిన మాటలను తలచుకుని జ్ఞానాంబ ధైర్యం తెచ్చుకుంటుంది.
మరోవైపు మల్లిక(mallika) అద్దం ముందు నిలబడి అందాన్ని చూసుకుని మురిసిపోతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి విష్ణు(vishnu) వచ్చి మల్లిక మీద సెటైర్లు వేస్తాడు. ఆ తర్వాత అందరూ ఇంటర్వ్యూ కీ సిద్ధమవుతారు. కానీ జ్ఞానాంబ మాత్రం ఇంటర్వ్యూ విషయంలో టెన్షన్ పడుతూ ఉండగా జానకి మళ్ళీ ధైర్యం చెబుతుంది.
అప్పుడు మల్లిక (mallika)కెమెరా ముందు నిలబడి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. మైక్ తీసుకొని మా బావగారికి నేనే కొన్ని టిప్స్ చెప్పాను అని చెబుతూ ఉండడంతో వెంటనే జ్ఞానాంబ(jnanamba), మల్లిక నోరు ముగిస్తుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ సజావుగా పూర్తి అవుతుంది. ఇంటర్వ్యూ చేసిన యాంకర్ రామచంద్రుని పొగుడుతుంది.
రామచంద్ర తో పాటు రామచంద్ర(rama Chandra)కు అండగా నిలిచిన తల్లి భార్యలను కూడా పోగొడుతుంది. ఆ తర్వాత జానకి రామచంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జానకి(janaki) మీరు వంటల ప్రోగ్రామ్ లో పాల్గొన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొని చివరికి గెలిచి మీరు అంటే ఏంటో నిరూపించుకున్నారు అని రామచంద్ర తో అనగా వెంటనే రామచంద్ర అందుకు కారణం మీదే అని జానకిని పొగుడుతాడు.
ఆ తర్వాత ఆలోచనలో జానకి (janaki)చదువు మర్చిపోయింది అని రామచంద్ర వెళ్లి బుక్కు తీసుకొని వచ్చి జానకికీ ఇవ్వగా రేపటినుంచి చదువుకుంటాను ఈరోజు మీ గెలుపును సంతోషంగా ఆస్వాదిస్తాను అని రామచంద్ర(rama chandra)తో అంటుంది. మరుసటి రోజు ఉదయం జ్ఞానాంబ కుటుంబం అందరూ గుడికి బయలుదేరుతారు. అక్కడ కొందరు జ్ఞానాంబ ను పొగుడుతూ ఉంటారు.
జానకి (janaki)గురించి కూడా మాట్లాడుతూ జానకి ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇలాంటి కోడలు దొరకడం నిజంగా జ్ఞానాంబ అదృష్టం అని అంటూ ఉంటారు. అప్పుడు మల్లిక(mallika) కుళ్ళు కుంటూ జ్ఞానాంబ కు లేనిపోని చెప్పడంతో మల్లికకు గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత గుడిలో పూజారి ఇకపై మీరు డబ్బులు ఇవ్వొద్దు మీ కోడలు గుడికి విరాళంగా కొంచెం డబ్బులు ఇచ్చింది అనడంతో అందరూ ఆశ్చర్య పోయి సంతోషంగా ఫీల్ అవుతారు.