- Home
- Entertainment
- 45 రోజులు నాగ చైతన్య కఠినమైన డైట్, రివీల్ చేసిన 'థాంక్యూ' డైరెక్టర్.. సూర్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్
45 రోజులు నాగ చైతన్య కఠినమైన డైట్, రివీల్ చేసిన 'థాంక్యూ' డైరెక్టర్.. సూర్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్
అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'థాంక్యూ'. 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'థాంక్యూ'. 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. చైతు మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. రొమాంటిక్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది.
జూలై 22న థాంక్యూ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. విక్రమ్ కుమార్ తాజాగా ఇంటర్వ్యూలో థాంక్యూ చిత్రంలోని విశేషాలు, నాగ చైతన్య పాత్ర గురించి వివరించారు. ఈ చిత్రానికి నాగ చైతన్యని మాత్రమే ఎంచుకోవడానికి కారణం ఉందని అన్నారు.
హీరో పాత్ర ఈ చిత్రంలో మూడు గెటప్స్ లో కనిపించాలి. ఓ గెటప్ లో 16 ఏళ్ల కుర్రాడిగా కనిపించాలి. టీజెన్ యువకుడిగా, సాధారణ కుర్రాడిగా ఒకేసారి కనిపించాలి అంటే అది నాగ చైతన్యకి మాత్రమే సాధ్యం. టీనేజ్ యువకుడిగా 16 ఏళ్ల వయసున్న కుర్రాడిలా కనిపించేందుకు నాగ చాలా కష్టపడ్డాడు.
ఆ లుక్ కోసం 45 రోజుల పాటు కఠినమైన డైట్ పాటించాడు. ఇలా నాగ చైతన్య తప్ప ఇంకెవరూ చేయలేరు అంటూ విక్రమ్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక విక్రమ్ కుమార్ ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా కామన్ గా ఓ ప్రశ్న ఎదురవుతోంది. అదేంటంటే '24' మూవీకి సీక్వెల్ ఎప్పుడని.
Naga Chaitanya
దీనికి విక్రమ్ కుమార్ సమాధానం సూర్య అభిమానులని నిరాశ పరిచే విధంగా ఉంది. 24కి సీక్వెల్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. కానీ అన్నీ కుదరాలి కదా.. ఐదు పేజీల కథ కూడా మొదలు పెట్టాను. సూర్యతో సపరేట్ గా టైం ట్రావెల్ మూవీ చేయాలంటే చాలా సులభం. వెంటనే కొత్త కథ సిద్ధం చేయొచ్చు.
కానీ ఆత్రేయ పాత్రని కొనసాగిస్తూ 24 సీక్వెల్ చేయాలంటే బాగా ఆలోచించాలి. అందుకే ఆలస్యం అవుతోంది అని విక్రమ్ కుమార్ అన్నారు. ఇది కాస్త సూర్య అభిమానులకి నిరాశ కలిగించే అంశమే. 24లో సూర్య డ్యూయెల్ రోల్ లో అదరగొట్టేసిన సంగతి తెలిసిందే.