- Home
- Entertainment
- RRR: వక్రీకరించడం అంటే అది, దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ చేసిన తప్పు.. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్
RRR: వక్రీకరించడం అంటే అది, దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ చేసిన తప్పు.. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్
రాజమౌళి తండ్రి, ఆర్ఆర్ఆర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ దానవీరశుర కర్ణ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

RRR
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ మొదలయింది. ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానుల కేరింతలతో థియేటర్స్ మోతెక్కుతున్నాయి. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో అద్భుతమైన నటన అందించారు. రాజమౌళి మరోసారి వెండితెరపై తన మార్క్ ప్రదర్శించారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.
RRR Movie
ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలని ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాజమౌళి వక్రీకరిస్తున్నారు అంటూ ఓ వర్గం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ ఈ విమర్శలకు సమాధానం ఇచ్చారు. ఈ చిత్రంలో అల్లూరి, కొమరం భీం పాత్రలని తాము వక్రీకరించడం లేదు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. వారి పాత్రలని ఇన్సిపిరేషన్ గా తీసుకుని కొత్త కథ సృష్టించినట్లు పేర్కొన్నారు.
RRR Movie
ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి, కొమరం భీం గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ చర్చ జరుగుతుండగా ఇంటర్వ్యూలో యాంకర్ దానవీరశూర కర్ణ చిత్ర ప్రస్తావన తీసుకువచ్చారు. దీనితో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. దానవీర శూర కర్ణలో శ్రీకృష్ణుడు కర్ణుడి జన్మ వృతాంతం చెబుతారు.
RRR Movie
నువ్వు ద్రౌపతి మీద మోజు పడ్డావు కదా.. ఆమె నిన్ను ఆరో భర్తగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉంది అని శ్రీకృష్ణుడు చెబుతారు. ఈ సన్నివేశం ఆ చిత్రంలో ఉంది. కానీ ఇది మహా భారతంలో ఎక్కడా లేదనే సంగతి మీకు తెలుసా అని విజయేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. కర్ణుడిని, మహా సాథ్వి ద్రౌపతిని ఉద్దేశించి తప్పుగా చూపించారు. ఇది వక్రీకరించడం కిందకు వస్తుంది అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అక్కడ తప్పు జరిగింది.
RRR Movie
కానీ ఆర్ఆర్ఆర్ చిత్రం అలా ఉండదు. ఎక్కడా పొరపాటు చేయలేదు. ఇందులో చూపించేది అల్లూరి, కొమరం భీం జీవిత చరిత్ర కాదు అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
RRR Movie
ఆర్ఆర్ఆర్ చిత్రం ఖరారు కాక ముందే రాజమౌళికి మల్టీస్టారర్ చిత్రం చేయాలనే ఆలోచన ఉండేదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆ సమయంలో సూర్య, కార్తీ ఇద్దరి కాంబినేషన్ గురించి కూడా తాము చర్చించుకున్నాం అని అన్నారు. ఆర్ఆర్ఆర్ కథ పుట్టాక రాంచరణ్, ఎన్టీఆర్ లని ఫిక్స్ చేసినట్లు తెలిపారు.